Pages

Tuesday, November 29, 2011

రాష్ట్ర రాజకీయాల్లో తాజా మలుపులు



ఊహించనివి కాకున్నా రాష్ట్ర రాజకీయాల్లో తాజా మలుపులు చాలానే వున్నాయి. ఎవరి కోణం నుంచి వారు మాట్లాడినా ఎవరూ కాదనలేని వాస్తవాలూ కొన్ని వున్నాయి. ఏ రాజకీయ పార్టీ పెద్దగా ఆనందించే పరిస్తితి ఇప్పుడు లేదన్నది మొదటి విషయం. వ్యక్తిగతంగా ఏడాది పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కొంచెం సంతోషించవచ్చునేమో గాని అసలు సవాళ్లు ఇప్పటి నుంచే మొదలవుతాయని ఆయనకు బాగా తెలుసు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి పాలన అని నన్ను వ్యాఖ్యానం అడిగినప్పుడు ఆయన గురించి చెప్పొచ్చు గాని పాలన అనడానికేమీ లేదని చెప్పాను. ఇక ముందైనా ఆ స్థితి మారుతుందేమో చూడాలి. కాకపోతే ఆయన నిలదొక్కుకోవడానికి సీనియర్‌ మంత్రులెవరూ సహకరించడం కాంగ్రెస్‌ సంసృతిలో జరగని పని. కనక ఆయన పాట్లు ఆయన పడుతున్నారు .ప్రచారానికి కోట్టు పెడుతున్నారు. పనులు జరిగినా జరక్కున్నా పథకాల జాతర సాగిస్తున్నారు.ఈ సమయంలో తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం ఆలోచన చేస్తున్నా అది నెగ్గే అవకాశం లేదు. తద్వారా ప్రభుత్వాన్ని వెన్నాడే అస్థిరత్వం పోయిందని చెప్పుకునే అవకాశం కలగవచ్చు. సభ బయిట సమీకరణలు ఎలా వున్నా సభలో మాత్రం జగన్‌ వర్గం సవాలు ఉధృతి తగ్గిపోవడం కనిపిస్తున్నా వాస్తవం.ఇప్పుడే స్పీకర్‌ కూడా మూకుమ్మడి రాజీనామాలను తిరస్కరించి సంబంధిత సభ్యుల నెత్తిన పాలు పోశారు. వీటిని ఆమోదిస్తారని ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు కూడా. పార్టీలు మార్చిన, పట్టు పట్టిన సభ్యుల రాజినామాలనే ఆయన ఆమోదించినట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో స్పీకర్‌ నిర్ణయాధికారాన్ని ప్రశ్నించే వారు పదే పదే రాజీనామాలను ప్రయోగించే తమ వైఖరిని కూడా ప్రశ్నించుకోవలసి వుంటుంది.ప్రజలకు ఏ మేలు చేయని రాజినామాలు ఉప ఎన్నికలలో మునిగి తేలడం వ్యర్థ ప్రక్రియ మాత్రమే.ఇప్పుడైనా పార్టీలు ప్రజల సమస్యలపై చర్చిస్తే మేలు. చివరగా పార్లమెంటులో బిజెపి కాంగ్రెస్‌లు టిఆర్‌ఎస్‌కు సహకరించే అవకాశం మాయమైంది. నిజానికి బిజెపి టిఆర్‌ఎస్‌ వైరుధ్యాలు తీవ్రమవుతున్నాయి. జెఎసి భారం తనే మోయడానికి కూడా టిఆర్‌ఎస్‌ సిద్దంగా లేదు.ఏతావాతా ఎన్నికల కోసం ఎదురు చూడటమే జరిగేట్టు కనిపిస్తుంది.

No comments:

Post a Comment