Pages

Friday, November 18, 2011

పునరాలోచనలో జగన్‌ వర్గీయులు



రెండేళ్ల కాలంలో జగన్‌ వర్గం బలహీనపడి పోవడం ఇప్పుడు దాచినా దాగని సత్యంలా కనిపిస్తున్నది. 150 మంది సంతకాలతో మొదలైన ఆయన యాత్ర ఇప్పుడు అందులో రెండంకెలకు పరిమితమై పోయినట్టే చెప్పాలి. జయసుధ అయితే దాగుడుమూతలు లేకుండా ముఖ్యమంత్రిని బలపరుస్తున్నట్టు స్పష్టంగా చెప్పేశారు. బాగా గట్టిగా నిలబడేవారిగా పేరొందినవారు కూడా స్పీకర్‌ నిర్ణయానికి కట్టుబడతామన్నారు. అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోయే స్తితి వుంటేనే బలపరుస్తామని వారిలో ఒకరన్నారు. స్పీకర్‌ కార్యాలయం ఈ ఎంఎల్‌ఎలు రాజీనామాల విషయంలో పట్టుదలగా లేరనీ పిలిస్తే రావడం లేదనీ కథనాలు విడుదల చేసినా ఒక్కరంటే ఒక్కరు నేరుగా ఖండించలేదు(ఇది రాసే సమయానికి) ఇదంతా నిస్పందేహంగా వూపు తగ్గడాన్నే సూచిస్తుంది. నా దయాదాక్షిణ్యాల వల్ల ప్రభుత్వం బతుకుతున్నదనీ మొదట, ఇంకా బతకనిస్తే దేవుడు క్షమించడాని తర్వాత వ్యాఖ్యానించిన జగన్‌ క్రమేణా తన బలం చాలదని కూడా బహిరంగంగానే చెప్పారు.అయినా తమ వెంట రాజీనామా చేసిన వారే గాక మొత్తం అరవై మంది వరకూ వున్నారని ఆ పార్టీ నేతలు సర్వసాధారణంగా చెబుతూ వచ్చారు. అవన్నీ ఇప్పుడు వాస్తవం కాకపోగా వున్నవారంతా కూడా నిలబడటం లేదని అర్థమవుతున్నది.తెలుగుదేశం వైఖరి ఇందుకు కారణమని వైఎస్‌ఆర్‌ పార్టీ వారు చేసే వాదన తర్కవిరుద్ధమైంది. తమ ప్రధాన ప్రత్యర్థి తమ వ్యూహం అవసరాల మేరకు నడుచుకోలేదని చెప్పడం రాజకీయాల్లో చెల్లదు. జగన్‌పై కేసుల దర్యాప్తు వగైరాలే ఇందుకు కారణమై వుండాలి. జగన్‌ వర్గం మెత్తబడిన తర్వాత తెలుగుదేశం అవిశ్వాసం రాజకీయ ప్రదానమే తప్ప పడగొట్టేంత దృశ్యం వుండదు. కనక ప్రస్తుతానికి కిరణ్‌ కుమార్‌కు గండం లేనట్టేనా?

No comments:

Post a Comment