Pages

Friday, November 11, 2011

జగన్‌పై దర్యాప్తులో మలుపులు, మరకలుజగన్‌ సంస్థల విలువను డెలాయిట్‌ కంపెనీ పెంచి చూపించడానికి వారి ఆడిటర్‌ విజయసాయి రెడ్డి ఒత్తిడి లేదా అభ్యర్థన కారణమని సిబిఐ ముందు సంస్థ ప్రతినిధి సుదర్శన్‌ వాంగ్మూలమిచ్చారని మీడియా కథనం. ఇది సిబిఐ ఎలా లీక్‌ చేస్తుందని విజయ సాయి ప్రశ్న. అంతేగాక తాను అలా కోరలేదని ముఖాముఖి చర్చకు సిద్దమని కూడా సమర్థించుకుంటున్నారు. ఈ లేఖపై స్పందించాల్సింది సిబిఐ తప్ప ఇతరులు చెప్పగలిగింది లేదు. అయితే అదే లేఖలో ఆయన వ్యాపారాలలో విలువలు పెంచి చూపించడం మామూలేనని కూడా పేర్కొనడం గమనించదగ్గది.అదే నిజమైతే అప్పుడు ఇంత స్పందన అవసరముండేది కాదు. రాజకీయ కోణం నుంచి ఖండించడమే ఇక్కడ ముఖ్యం. అమెరికాలో ఎన్రాన్‌ కుంభకోణం నుంచి మన సత్యం కుంభకోణం వరకూ ఆడిటర్ల పాత్ర చాలా కీలకమని వారే ఎక్కువ విచారణకు గురయ్యారని గుర్తు చేసుకుంటే ఇంత చర్చ అవసరమనిపించదు. ఇక సిబిఐ లీక్‌ చేయడానికి వస్తే- గాలి కేసులో జగన్‌ను సాక్షిగానే పిలిచారని ఆయనకు ఏమీ కాదని ఇదే వైఎస్‌ఆర్‌ పార్టీ వారు అదేపనిగా చెప్పుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యమని అంత నమ్మకం దేనికని నేను చాలా చర్చల్లో ప్రశ్నించాను. ఆ విచారణ తర్వాత ఆయన బయిటకు వచ్చి చెప్పిన దానిపైనా అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇడి కూడా విచారించబోతున్నది. వ్యాపార పరమైన ఆర్థిక పరమైన లావాదేవీలలో అవకవతవకలు అక్రమాలకు రాజకీయ మద్దతుకు సంబంధం లేదని ఎవరైనా ఒప్పుకోవాలి. జగన్‌ వర్గం తరచూ రామోజీని లేదా రాధాకృష్ణను ప్రస్తావిస్తుంటుంది. కాని ఇక్కడ అధికారం ముఖ్యమంత్రి స్థానం అన్నవి కీలకంగా వున్నాయని గమనిస్తే ఈ కేసు ప్రత్యేకత తెలుస్తుంది.దాన్ని చట్టపరంగా ఎదుర్కోవాలి తప్ప ఇతరుల తప్పులు ఎత్తి చూపినంత మాత్రాన మరొకరి తప్పులు ఒప్పుగా మారవు. ఇప్పుడు విజయమ్మ కేసులో కోర్టు ఏదైనా చేయొచ్చు. అలాగే మార్గదర్శి విషయంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చట్టపరమైన చర్యలను ఎవరూ వ్యతిరేకించలేదు. ఇప్పుడు అవి ఏ స్తితిలో వున్నాయో తెలియదు. కార్పొరేట్‌ ప్రపంచ అక్రమాలపై ఇదే బ్లాగులో చాలా ప్రస్తావనలున్నాయి.వైఎస్‌పై ఎవరికి ఎంత అభిమానమున్నా ఆ హయాంలో జరిగిన అవకవతవకలను విచారించడానికి అది ఆటంకం కానవసరం లేదు. ఇదంతా కక్ష సాధింపుగానే కొట్టేయడమూ కుదరదు. అదే నిజమైతే నిజమని రుజువైతే మరీ మంచిది. కాని అ సంగతి చెప్పాల్సింది ఆయన అనుయాయులు కాదు, కేసు నడిపిస్తున్న న్యాయస్థానాలూ, విచారిస్తున నిఘా సంస్థలూ.

No comments:

Post a Comment