
నాగం జనార్థనరెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించడం వూహించదగిందే. ఈ రాజీనామాలు తెలుగు దేశం పార్టీ నుంచి నిష్క్రమణల ఫలితాలు, ఫిరాయింపుల చట్టంతో ముడిపడినవి కూడా. ఇవి ఆమోదించినంత మాత్రాన మిగిలిన 80 మందివి కూడా గుండుగుత్తగా ఒప్పేసుకుంటారని కాదు. ప్రాంతీయ సమస్యపైన ఉద్వేగాలతో రాజీనామా చేసిన వారందరివీ ఒప్పుకుంటే సభలో మూడో వంతు వరకూ ఖాళీ అయిపోతుంది. ఇందులో టిఆర్‌ఎస్ వారు రాజీనామా చేసి మళ్లీ గెలిచి వచ్చారు. వారు కొత్తగా నిరూపించవలసింది ఏమీ లేదు.కాంగ్రెస్ తెలుగు దేశం సభ్యులు రాజీనామాలిచ్చినా వాటికోసం పట్టుపట్టకపోవచ్చు.ఇక జగన్ వర్గం 29 మంది పరిస్థితి కీలకమవుతుంది. వీరు కూడా తటపటాయింపులో పడినట్టే. తమ రాజీనామాలతో ప్రభుత్వం అస్థిరత్వానికి గురవుతుందన్న అంచనా ఆనాడు వుండొచ్చు గాని అలా జరగలేదు. జగన్ పై కేసుల దర్యాప్తు వగైరాల వల్ల ఒక విధమైన ఆత్మరక్షణ స్థితిలో పడిపోయారు. ప్రభుత్వం కొంత వరకూ నిలదొక్కుకుంది. ప్రాంతీయ కల్లోలాలు కూడా కొంతైనా సర్దుకున్నాయి.ఇలాటప్పుడు రాజీనామాల పేరిట అధికారానికి దూరమయ్యేబదులు క స్పీకర్ పేరిట తప్పించుకోవచ్చు. జగన్‌కు బాగా సన్నిహితులైన అర డజను మందిని మినహాయిస్తే తక్కిన వారంతా ఈ మార్గానికే మొగ్గుచూపే అవకాశం వుంది.ఇక మనోహర్ సామూహికంగా రాజీనామాలు ఆమోదించేసి కొత్త దృష్టాంతాలు సృష్టించరనే అనుకోవాలి. ఆయన నిర్నయాన్ని ముందస్తుగా నిర్దేశించే అవకాశం ఎవరికీ వుండదు గనక వేచి చూడవలసిందే.
No comments:
Post a Comment