Pages

Friday, May 11, 2012

రాజకీయం చేసిన ప్రభుత్వం



సాక్షి పరిణామాలపై నా అభిప్రాయాలు నిన్న వివరంగా రాశాను. అయితే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రకటనలు నిలిపేస్తూ ఉత్తర్వు జారీ చేయడం అనవసరమైన అవాంఛనీయమైన చర్య. ఇలాటి వాటిని ఎవరిపై ఎవరు తీసుకున్నా ఆమోదించకూడదు.ఈ కారణంగానే మొదటి రోజు కన్నా రెండవ రోజు ఖండనలు పెరిగాయి. అయితే అదే సమయంలో పాత్రికేయులు కూడా పాలక వర్గ నేతల రాజకీయయ చర్చలు తమ ఆందోళనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాల్సి వుంటుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ రాజకీయంగా వ్యతిరేకించే తీరుకు పత్రికా సంఘాలు మాట్లాడే తీరుకు మధ్యన తేడా లేకపోతే విశ్వసనీయత దెబ్బ తింటుంది. అలాగే సాక్షి సిబ్బంది యాజమాన్యం కూడా రాజకీయ తేడాలకు మీడియా యుద్దాలకు అతీతంగా మద్దతు పొందడంపై కేంద్రీకరించాలే గాని పాక్షిక వాదనలకు లోనైతే చర్చ దారి తప్పుతుంది. అంతిమంగా నష్టం కలిగేది ఉద్యోగులకే. ఏ మీడియా సంస్థ మంచి చెడ్డలేమిటి గొప్పలు తప్పులు ఏమిటి అన్నది ఇక్కడ చర్చనీయం కాదు. అది వేరే సందర్భం. సాక్షి మనుగడకు ఉద్యోగుల భద్రతకు ముప్పు లేకుండా కలగనివ్వకుండా చూసుకోవడంపై కేంద్రీకరించాలంటే మరింత విశాల దృక్పథంతోనూ వృత్తిగత కోణంతోనూ వ్యవహరించాలి. సాక్షికి ముందు సాక్షికి తర్వాత అని నాటకీయంగా చెప్పాల్సినంత గొప్ప తేడాలేమీ చూపనక్కరలేదు. ఎవరి ప్రయోజనాలు వారివి ఎవరి పద్దతులు వారివి. అంతిమంగా మీడియాధిపతులంతా ఒక్కటే. వారి పరమార్థం రాజకీయార్థిక ప్రయోజనాల సాధనే అన్నది అందరికీ వర్తిస్తుంది. సందర్భం సాక్షిదైనా మరొకరిదైనా ఒకే విధంగా మాట్లాడాలి. యాజమాన్యం రాజకీయాలు వ్యూహాత్మక కోణాలు ఈ ఆందోళనతో కలగాపులగం కాకుండా చూడాలి.
.......................
తోక: కొన్ని కార్యక్రమాలు ముఖ్యంగా మా అబ్బాయి పెళ్లి కారణంగా దాదాపు నెల రోజులు బ్లాగులోకి రాకున్నా - వచ్చిన వెంటనే స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు

9 comments:

  1. అకౌంట్లను స్థంభిప చేయడం న్యాయమే అని నిన్న అని ఈరోజు అదే ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి పోషించకపోవడం అధర్మము అనడం అనే సన్నాయి నొక్కులు ఏ న్యాయమో అర్థం కావదం లేదు.
    వేల కోట్లు భక్షించిన అనకొండలకు ఒక్క ప్రకటనల భక్ష్యము లక్ష్యమా!

    దొంగ పత్రికలకు ప్రకటనలను నిలుపుచేయడం అన్యాయమైతే, కోర్టులున్నవి, దొంగ సొమ్ము వుంది... కేసేసుకోవచ్చుగా!

    ReplyDelete
  2. congratulations on your son's wedding.

    ReplyDelete
  3. తొలుత మీకు,యువజంటకు నా శుభాకాంక్షలు .సాక్షిలో పనిచేస్తున్న సిబ్బంది,ఆ పత్రిక లోకి పెట్టుబడులెలావచ్చాయో తెలియనంత అమాయకులా?దోపిడీ దొంగలముఠాలో చేరడం ఎంత ప్రమాదకరమో తెలియదా?ఒకసారి దొంగలముఠాలో చేరినతర్వాత దాని పర్యవసానానికి వాళ్ళే బాధ్యత వహించాల్సిందే!

    ReplyDelete
  4. నమస్తే సార్. మీ వ్యాసం చాలా బాగుంది..

    ReplyDelete