Pages

Thursday, November 10, 2011

ఇక ఎస్సార్సీ ముచ్చట



ఈ రెండు రోజులలోనూ కేంద్ర కాంగ్రెస్‌ తరపున ఇద్దరు ముగ్గురు నాయకులు మాట్లాడినప్పటికీ సారాంశంలో పెద్దగా తేడా లేదు.రాష్ట్ర విభజన తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందన్నట్టుగా కొందరు చేసిన వూహాగానాలు జోస్యాలు నిజం కావడం లేదని క్రమంగా స్పష్టమవుతున్నది. ఆ విషయం అలా వుంచి రాష్ట్ర భవిష్యత్తుపై ఎలాటి కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం కూడా కనిపించడం లేదు. డి.శ్రీనివాస్‌తో లేదా మరొకరితో అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయొచ్చన్న మాట మాత్రం కాంగ్రెస్‌ ఎంపిలు, ఎంఎల్‌ఎలు జనాంతికంగా చెబుతున్నారు. అందుకు ఒప్పుకునేది లేదంటూనే అసహాయత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తీవ్రమైన చర్యలేమీ తీసుకుంటామని వారిలో ఎక్కువ మంది చెప్పడం లేదు.
ఇంతకూ కాంగ్రెస్‌ ఎస్‌ఆర్‌సి గురించి చెప్పే మాటలు తెలంగాణా సమస్యకు వర్తిస్తాయా లేదా ? ఈ ప్రశ్నకు ఆ మాట్లాడిన నాయకులు కూడా జవాబు చెప్పలేరు. కావాలనే అంత గందరగోళంగా వ్యాఖ్యలు చేశారు. ఆజాద్‌ చెబుతాడని వాళ్లన్నారు. అయితే ఆజాద్‌ మాత్రం ప్రభుత్వం తరపున హౌం మంత్రి చేసే ప్రకటనే కాంగ్రెస్‌ అధికార వైఖరి అన్నారు.అంటే ఇప్పటికీ ఇన్ని అనర్థాలు అనిశ్చితుల తర్వాత కూడా కాంగ్రెస్‌ రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ వైఖరిని చెప్పబోవడం లేదన్నమాట.గత అరవై ఏళ్లలో అన్ని చోట్లా అన్ని సందర్బాల్లో ఆ పార్టీ ఇలాగే ప్రవర్తించింది. ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో మరింత ఎక్కువగా. ఇదమిద్దంగా ఏమీ చెప్పకుండా డాటేయడమే కాంగ్రెస్‌ మార్కు రాజకీయమన్నమాట. ఈ దశ లో దీనిపై ఇంతకన్నా మాట్లాడాల్సింది లేదు. కాకుంటే కేంద్రం మీద అపారమైన నమ్మకంతో తేదీలు ప్రకటించిన వాళ్లు, గడువులు ప్రకటించిన వాళ్లు కూడా ఈ విషయంలో కాస్తయినా అత్మ విమర్శ చేసుకుంటారా?
చివరగా మాయావతి విషయం. ఇన్నేళ్లు పాలించినప్పుడు తీసుకోని నిర్ణయం ఎన్నికల ప్రాంగణంలో ఎందుకు వచ్చిందంటే ఎన్నికల కోసమే! మమతా డార్జిలింగ్‌(గూర్ఖాలాండ్‌)విషయంలో ఎన్నికల ముందు తర్వాత చేసింది ఇంతకన్నా భిన్నమేమీ కాదు. ఇప్పుడు ఎస్‌ఆర్‌సి వేసేస్తారని కాదు.మరో ఏడాదో ఆరు నెలలో దాని చుట్టూ చర్చ తిప్పుతారంతే. ప్రాంతీయ కమిటీకి గాని ఎస్సార్సీకి గాని తెలంగాణా నిర్ణయంతో సంబంధం లేదని నమ్మబలుకుతుంటారు కూడా. ఈ గజిబిజి రాజకీయ అనిశ్చితికి ప్రజల ఆందోళనకు ఎలా కారణమవుతుందనేది వారికి ఏ మాత్రం అవసరం లేదు. అందుకే ప్రాంతాల పేరిట రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే వారి పట్ల అప్రమత్తంగా వుండాలి.

3 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete