Pages

Wednesday, May 23, 2012

జగన్‌ అభ్యర్థన తోసి వేత



బుధ వారం నాడు న్యాయ స్థానాలలో జగన్‌కు ఊరట, తిరస్కరణ ఒకేసారి లభించాయి. సాక్షి ఖాతాల స్తంభనను షరతులతో ఎత్తివేయడం వూరట. మే 25న సిబిఐ ముందు హాజరు కావలసిందేనని హైకోర్టు నిక్కచ్చిగా చెప్పడం ఎదురు దెబ్బ. పైగా 46(1) సిఆర్‌పిసి కింద సిబిఐ వ్యవహరించాలని కూడా కోర్టు చెప్పింది. దీని ప్రకారం నిందితులను విచారించేందుకు మాత్రమే గాక అవసరమైతే అదుపులోకి తీసుకోవడానికి కూడా సిబిఐకి అధికారం లభిస్తుంది.తన ఎన్నికల ప్రచారం కోసం పదిహేను రోజుల గడువు కావాలని జగన్‌ చేసిన వాదనను కోర్టు తోసి పుచ్చడం వూహించిందే. గతంలోనే చెప్పుకున్నట్టు సిబిఐ విచారించేది నిందితుడి హౌదాలో తప్ప వైఎస్‌ఆర్‌ పార్టీ అద్యక్షుడుగా కాదు.ఆ ప్రాతిపదికను ఆమోదించేట్టయితే రేపు ఇతర రకాలైన నిందితులకు కూడా దీన్ని వర్తింపచేయాలని ఉటంకించే అవకాశముంటుంది.మే 28న హాజరు కావాలని సమన్లు వుండగా మళ్లీ 25న ఎందుకు పిలిచారనే ప్రశ్నకు కూడా సిబిఐ సమాధానం ఇచ్చింది.నిమ్మగడ్డ ప్రసాద్‌, బ్రహ్మానందరెడ్డి రిమాండ్‌ ఆ రోజున ముగిసిపోతున్నందున వారి సమక్షంలో జగన్‌ను ప్రశ్నించాల్సి వుందని పేర్కొంది. మరో విశేషం ఏమంటే జగన్‌ మంగళవారం చేసిన తీవ్రమైన ఆరోపణలు(అల్లర్లు ఎన్నికల వాయిదా కుట్ర వగైరా) కోర్టులో లేవనెత్తలేదు. అంటే అవి నిలబడవని భావించారా? లేక ఆధారాలు లేవనా? కనీసం ప్రధానికి రాసిన లేఖనైనా జతపర్చి వుండొచ్చు కదా? అంతేగాక తనకు ఏం జరిగినా సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపునివ్వడం నిన్నటి ధోరణికి కాస్త సవరణగా వుంది! ఆ మేరకు మంచిదే గాని వ్యూహాత్మకమైన జాగ్త్రత్త కోసం కూడా చెప్పివుండొచ్చు. అందుకే పోలీసులు 144 వ సెక్షన్‌ వగైరాలను ప్రయోగిస్తున్నట్టు ప్రకటించారు.ఈ ఉద్రిక్తతల మధ్యన ఏం జరుగుతుందో చూడాలి. చెడు ఏది జరగరాదని ఆశించాలి.సాక్షి ఖాతాల స్తంభనను ఎత్తివేసినా ఆస్తిపాస్తుల క్రయ విక్రాయాలపై నిషేదం విధించడం, చెక్కుల ద్వారానే చెల్లింపులు జరపాలని పది రోజులకోసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం ఇవన్నీ ఆంక్షలుగా వుంటాయి. ఇవి కూడా మధ్యంతర ఉత్తర్వులే. కనక అసలు తీర్పు తర్వాత ఎప్పుడు వస్తుందో చూడాలి.

6 comments:

  1. your feeling shows you are happy for this news.because you may think it will helpful to chandra babu.so your writing shows always like that in favour to babu.good work keep going

    ReplyDelete
  2. your feeling shows you are happy for this news.because you may think it will helpful to chandra babu.so your writing shows always like that in favour to babu.good work keep going

    ReplyDelete
  3. మీ వాలకం చూస్తోంటే ఇప్పుడే జగన్ను మూసెయ్యాలన్నట్టుంది.

    ReplyDelete
    Replies
    1. మంచిదే కదా. లేకుంటే జగన్ దేశాన్ని మూసేయగలడు.

      Delete
    2. జగన్‌ లేదా చంద్రబాబు ఎవరిమీదైనా ఎవరికైనా భక్తి వుండొచ్చు. నాకు ఈ ఇద్దరి మీదే కాదు వ్యక్తిగతంగా ఎవరి మీదా భక్తి ప్రపత్తులు లేవు. ఎవరూ విమర్శలకు అతీతులన్న భావన కూడా లేదు. సందర్భాన్ని బట్టి విమర్శలు విశ్లేషణలు వుండొచ్చు. లోతుగా చదివే ఓపిక వుంటే అన్ని కోణాలు అర్థమవుతాయి. వూరికే పొగడ్డం తెగడ్డం మాత్రమే చేయాలనుకునేవాళ్లను నేను సంతృప్తి పర్చలేను. సంతోషం విచారం అన్న ప్రసక్తి లేకుండా జరిగే వాటిని వ్యాఖ్యానించడం పరిశీలించడమే చేశాను. అందుకు భిన్నంగా ఒక్క ముక్క చూపించినా సమాధానమివ్వగలను.

      Delete
  4. /కనీసం ప్రధానికి రాసిన లేఖనైనా జతపర్చి వుండొచ్చు కదా? /
    :)) ప్రధాని ... కొయ్యబొమ్మను చేసి, కొట్టినా పలుకునా? విశ్వదాభిరామ వినురవేమ.

    ReplyDelete