Pages

Thursday, June 30, 2011

రస కందంలో రాజకీయ హడావుడి






రాష్ట్ర రాజకీయాలలో మరోసారి హడావుడి పెరిగింది. ప్రాంతీయ సమస్యపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న సంకేతాలు ఒకవైపున వెలువడుతున్నాయి.అయితే ఈ సంకేతాలు కేంద్ర నేతలెవరూ నేరుగా ఇచ్చినవి కావు. వారైతే చాలా సమయం పడుతుందనే అంటున్నారు.ఇంకా చర్చించలేదని విధానం రూపొందంచలేదని కూడా చెబుతున్నారు. పైకి ఇలా అంటున్నా లోలోపల తమ పార్టీ వారికి ఏవో స్పష్టమైన సూచనలు చేసే వుండాలి గనకే అలజడి పెరుగుతున్నది. తెలంగాణా ప్రాంతంలో అధికార పక్షంలో ఆందోళన పెరుగుతుంటే టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అదను చూసి రంగ ప్రవేశం చేశారు. ఏ జానారెడ్డి ఆవరణలోనైతే లోగడ జెఎసి ఏర్పాటు వగైరాలు జరిగాయో అక్కడే మరోసారి అదే తతంగం పునరావృతమైంది. కాని ఈ సారి కాంగ్రెస్‌ వారందరూ ఒకే విధంగా మాట్లాడటం లేదు. సాక్షాత్తూ ఉపముఖ్యమంత్రి రాజనరసింహ ప్రాంతీయ మండలికైనా ఒకే అని చెప్పి ఆ పైన సర్దుకున్నారు. 2009లో పరిస్థితి ఇప్పుడు లేదని డి.ఎల్‌.రవీంద్రారెడ్డి అంటున్నారు. కాని లగడ పాటి వంటి వారు అకారణ అనుచిత వ్యాఖ్యలతో వివాదాలు పెంచుతున్నారు. మరొవైపున తెలంగాణేతర ప్రాంతాల కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీ ప్రదక్షిణ ప్రహసనం మొదలెట్టారు. ఇదంతా చూస్తుంటే పాలక పక్షం రాజకీయ క్రీడ రెండు వైపులా సమాన జోరులో సాగుతున్నదని స్పష్టమవుతుంది. తెలుగు దేశం కొంత జాగ్రత్త పడుతున్నా విశ్వసనీయత నిలబెట్టుకోవడం కష్టంగానే వుంది. రాజకీయంగా ఒక మెట్టు దిగి కెసిఆర్‌ను సందర్శించి వచ్చిన నాగం జనార్ధన రెడ్డి నిరాహారదీక్ష చేస్తున్నా దాని ప్రభావం పరిమితంగానే వుంటుంది.ఏమైనప్పటికీ కేంద్రం దాగుడు మూతలు విరమించి సూటిగా ప్రకటన చేసే సమయం వచ్చిందని కొందరు అంటున్నారు గాని అది నిజమేనా? అన్నది ప్రశ్న. ఎందుకంటే అంత సున్నితంగా సూటిగా వ్యవహరించే అలవాటు గాని అవసరం గాని అధిష్టానానికి ఎప్పుడూ లేవు. కావాలని వేడి పెరగనిచ్చి ఆ పైన చల్లనీళ్లు గుమ్మరించినట్టు అటూ ఇటూ గాని వ్యాఖ్యలు చేయడమే వారి రాజనీతి. ఇప్పుడైనా జరిగేది అదే. ఇది అన్ని ప్రాంతాలతో చెలగాలమాడుతున్న కేంద్ర జాలం.అంతే.

20 comments:

  1. రవి గారూ ,
    కాంగ్రెస్ జాతీయపార్టీ అయినా ప్రాంతీయపార్టీల తరహగా కేంద్రీక్రుత నాయకత్వంలో ( నూట పది కోట్ల ప్రజల భవిష్యత్తు తల్లీకొడుకుల చేతిలో ఉంది ) ఉండటం మూలానా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవట్లేదు . తెలంగాణా ఇవ్వటం , ఇవ్వకపోవటం అనేది తెలుగుప్రజల అభ్యున్నతి కోసం జరగాలి కానీ .. కాంగ్రెస్ పార్టీ అభివ్రుద్ధి కోసం కాదుగదా ! కానీ .. కాంగ్రెస్ వారికి తెలుగుప్రజలంతా కాంగ్రెస్ వాళ్ళగానే కనిపిస్తున్నారు ! ఇదే సమస్య .

    ReplyDelete
  2. ఇదే మాట ఇప్పటికి చాలామందిని అడిగాను.జెపీ గారితో సహా.
    ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే తెలుగు వారందరూ సుఖ శాంతులతో ఉంటారో చెప్పగలరా. అది వాళ్ళపని మేము చెప్పం అని దబాయించకండి.

    ReplyDelete
  3. కేంద్రప్రభుత్వం పాలన మునిసిపాలిటీ తీరు కన్నా అధ్వాన్నంగా ఉంది . ఒక ప్రకటన చేసినప్పుడు దానికి కట్టుబడి ఉండాల్సిందే . డిసెంబర్ తొమ్మిది ప్రకటన చెయ్యటం తొందరపాటు చర్య . చేసిన తరవాత ' తూచ్ ' అనే సౌలభ్యం ప్రభుత్వాలకి ఉండదు . ఇంత పెద్ద దేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ఒక మిధ్య . అందరికీ ఆమోదయోగ్యమనే అమెరికాతో అణుఒప్పందం చేసుకున్నారా ? ఇంధనధరలు పెంచేశారా ? ఎట్లాగూ ప్రాంతీయ పార్టీలవి గిట్టుబాటు రాజకీయాలు . జాతీయపార్టీలు కూడ ఆ దారినే పోతే దేశానికి ముప్పు . జేపి వాదన ప్రవాసాంధ్రులకి , పట్టణాలలోవారికి మాత్రమే అర్ధంవుతుంది . ఆయన టార్గెట్ కూడా వారే కదా ! అయినా ఆయన అభిప్రాయం ఇక్కడ అప్రస్తుతం .

    ReplyDelete
  4. రసకందం కాదు రసకందాయం

    ReplyDelete
  5. saramana గారు, డిశెంబెర్ ప్రకటన తొందర పాటు చర్య అని చెప్తూ దానికే కట్టుబడి వుండాలని వాదించటమేంటండి?. ఆ ప్రకటన కొందరికి నచ్చక పోవటం వల్లనే కదా ఇదంతా. నిజాని కేంద్రం ఏ ప్రకటన చేసినా, చెయ్యకపోయినా రాష్ట్ర నాయకులు కలవనంత కాలం ఇలాగే వుంటుంది. మన వాళ్ళతా కలిసి (అంతా అంటె అంతా అని కాదులేంది ఎక్కువమంది) మాకిలాగ కావాలని ఒక వాదనే వినిపించండి. పరిష్కారం దానంతట అదే వస్తుంది. ఒకప్పుడు కేంద్రం బలంగా వుండేది. ఇందిర లాగానో, నెహ్రూ లాగానో సంకీర్ణ ప్రభుత్వాలుండలేవు. అందుకే ఏదైనా ఒప్పించి, బుజ్జగించి చెయ్యాల్సిందే. ఆ సందు మన నాయకులెవరైనా ఇస్తున్నారా? పిడి వాదాలు తప్ప.మిగతా మూడు రాష్ట్రాలు consensus తో ఎర్పడ్డయని గుర్తుంచుకోండి. నిజానికి చిదంబరం ప్రకన అదే. agreement కొచ్చి అసెంబ్లీ నించి తీర్మానం పెట్టి పంపమని(అఖర్లెదు..ఫలానా సెక్షన్ ప్రకారం అని చెప్పకండి..నాకూ తెల్సు. రాజ్యాంగం ప్రకారం మనమందరం ప్రధానమంత్రులం కావొచ్చు, రాష్ట్రపతి గారు తల్చుకుంటె..కనీసం కొన్ని రోజులపాటైనా..అని చెప్పి చేసేస్తారా).
    అయితే already అందరూ ఒకటే కోరుకుంటున్నరని కొంచెం తప్పుడు conclusionకొచ్చిన మాట నిజం. అంతవరకు we can blame him.

    మళ్ళీ..మన రాష్ట్ర విభజన పరిష్కారం మన నాయకుల దగ్గరుంది.కేంద్రం దగ్గర కాదు. మనం కొట్టుకున్నంత కాలం వాళ్ళు పీకేదేమీ వుండదు.

    మళ్ళీ అడుగుతున్నాను..మన రాష్ట్ర నాయకులు ఒక మాట మీద ఉండనంత కాలం..కేద్రం ఏ నిర్ణయం తీసుకుంటే మనం సుఖ శాంతులతో వుంటామో చెప్పండి. కాస్త analytical గా. I so far never heard anyone providing an amicable solution that everybody likes. SKC is the closest ..but that too was ridiculed or praised as per personal agendaa.

    ReplyDelete
  6. పావని గారూ,
    బాగా చెప్పారు. చిదంబరంగారు చాలా స్పష్టంగా డిశెంబరు తొమ్మిది ప్రకటనలో "ఆంధ్రప్రదేశ్ శాసన సభ తీర్మానం ప్రకారం" అని చెప్పి ఉన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటును సమర్థిస్తూ తీర్మానం జరగనంతవరకూ కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోదు. ఒకవేళ తీర్మానం అంటూ ప్రవేశ పెడితే ఫలితం ఏమిటన్నది సుస్పష్టం. అందువల్ల నిజంగా తెలంగాణ కావాలనుకునేవారు సీమాంధ్ర-తీరాంధ్ర ప్రజలను దూషించి పరిస్థితి చిక్కబడేలా చేయకుండా వారిని ఒప్పించుకోవాలి. సమైక్యవాదులని చెప్పుకుని తిరిగేవారు సమైక్యాంధ్ర ఉద్యమం అనేది తెలంగాణలోనూ ఉండాలని గుర్తెరగాలి.

    ReplyDelete
  7. పావని గారు ,
    నేడు భారత ప్రభుత్వం అసమర్ధ నాయకత్వంలో నడుస్తుందని అనుకుంటున్నాను . ' తప్పుడు ' conclusion కి వచ్చి ( రేపు మన దేశ రక్షణలో కూడా ' తప్పుడు ' అవగాహనకి రావచ్చు గదా ) .. తప్పించుకోటానికి వీలుగా ఉండే ప్రకటన చేసే భారత ప్రభుత్వ విధానాలు గర్హనీయం . ఈ ధోరణి ఏ విధంగా సబబు ?
    భారత ప్రభుత్వం అన్ని కోణాల్లోంచి ఆలోచించి నిర్ణయాలు చేస్తుందనే అజ్ణానంలో ఉండేవాడిని . నిజంగానే డిసెంబర్ తొమ్మిది ప్రకటన నాకు ఆశ్చర్యం కలిగించింది . అరివీరభయంకర భారత ప్రభుత్వం చంద్రబాబునో , జగన్మోహన రెడ్డినో ద్రుస్టిలో ఉంచుకుని ఒక విక్రుత రాజకీయ విన్యాసాన్ని చేస్తూండడం దురద్రుష్టం . రెండు ప్రాంతల ప్రజలు , నాయకుల మధ్య పెడుతున్న పరుగు పందెం , కుస్తీ పోటీలు రోమన్ల వినోద పైశాచికత్వాన్ని తలపిస్తుంది . ఇది నాకు బాధ కలిగిస్తుంది . ఈ విషయాన్నే నేను ప్రస్తావించాను .

    ReplyDelete
  8. "ప్రమాదో ధీమతామపి" . ఆ రోజు కేంద్ర ప్రకటనకు ముందు నేపధ్యం గుర్తు తెచ్చుకోండి. ఒక్కడు తెలంగాణా వద్దన్న వాడు లేడు. ప్రతిపక్ష నాయకుడేమో ఇంకా తెల్చరేమిటి ఇక్కడ ఇల్లు కాలిపోతుంటే అని టీవీ ముంది అరుపులు, పత్రికలేమో చలి కాచుకోవటం తప్ప విభజన మంచిదా కాదా , కావాలనే వారి మాటల్లో నిజమెంతా, కానిదేంతా అన్న విశ్లేషణ లేనే లేదు. కనీసం జనాభా లెక్కల్లాంటి అతి బేసిక్ విషయాలను కూడా నోటి కొచ్చినట్టు పెంచి పారేస్తుంటే అది కాదు ఇది అని చెప్పే ఓపికా, విషయ పరిజ్ఞానం, భాద్యతా ఏదన్నా అనుకోండి..అంత మాత్రం
    కూడా ఒక్క పత్రిక చేస్తే ఒట్టు. అసలు మనకు journalism అంటేనే ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పొయ్యటం అనే ఏక సూత్ర అజెండా. మరి రోగి కోరేది..వైద్యుడు ఇవ్వాల్సిందీ (పత్రికలూ, ప్రతిపక్షాల దృష్టిలో) ఒకటే అయినప్పుడు అదే చేస్తే తప్పేముంది. తర్వాత ప్రాంతాల వారీగా అడ్డం తిరుగుతారని ఊహించలేక పోవటం కాస్త తెలివి తెక్కువతనం అవ్వోచేమో కానీ.. పాపం,మూర్ఖత్వం, ఆటలాడుకోవటం ఇలాంటి మాటలంటే నాకు ఒప్పుకోబుద్ధి కావట్లేదు.
    నిజానికి ఇప్పుడెంచేస్తే బావుంటుం దనేది ఎవ్వరికీ తెలియదు. కాకపొతే అధికారంలో ఉన్నవారు అందరికీ ఎక్కువ చులకన కాబట్టి ..రాళ్ళదెబ్బలు కాచుకోక తప్పదు.
    కొన్న వందల so called objective విశ్లేషణలు, మేధావుల వాదనలు(అంటే తిట్టటం అనే లెండి..అందులోనే మనిషికో ప్రత్యేకత) విన్నా, చదివా, చూసా. ఒక్కరంటే ఒక్కరు ఇప్పుడు కేంద్రం ఏమి చేస్తే ఎక్కువ మంది సంతోషిస్తారో , పరిస్తితి ఇప్పటికన్నా బాగుంటుందో చెప్పిన మనిషి లేడు. ఈ బ్లాగు రచయితతో సహా.

    ReplyDelete
  9. కేంద్రం ఏమి చేయాలో మనం చెబితే చేస్తుందనుకోవడం ఒక భ్రమ. వాళ్ల అంటే పాలకవర్గాల ప్రత్యేకించి పాలకపక్షాల ప్రయోజనాలకు అనుగుణంగానే వ్యవహరిస్తారు. ఇందులో పెద్ద విశ్లేషణలు అవసరం లేదు. వారి వ్యూహాలను విశ్లేషించి ప్రజలను అప్రమత్తం చేయడం తప్ప ఈ బా ్లగు రచయితతో సహా ఎవరైనా చేయగలిగింది లేదు. డిసెంబరు 9 ప్రకటనకు శ్రుతి మించిన ప్రాధాన్యత ఇచ్చినవారు ఇరు వైపులా వున్నారు.దాన్ని జారీ చేసిన చిదంబరమే ఇప్పుడు దాన్ని తలుచుకోవడం లేదు. ఇంకా ఇతరులు ఏం చెబితే ఏం విలువ వుంటుంది? నా వరకు నేను 2009 డిసెంబర్‌ 10 ఉదయం ఎన్‌టివి చర్చలోనే చిదంబరం ప్రకటన పరిమితులు, పాలక వర్గ పాచికలు గురించి చెప్పాను. కేంద్రం సరిగ్గా వున్నట్టు ఇతర ప్రాంతాల వారు అడ్డు పడ్డం వల్లనే ఆగిపోయినట్టు చేసే విమర్శలు పూర్తిగా నిజం కాదు. కేంద్రం కోరిందే రెండు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం. ఆ పని పూర్తయిన తర్వాత చేతులెత్తేసింది, అంతే. ఇప్పుడు 14-ఎఫ్‌పై అన్ని పార్టీలూ కలసి తీర్మానం చేసినా ఇంత కాలం ఎందుకు రద్దు చేయడం లేదు? కనక కేంద్ర పాలకులను తక్కువ అంచనా వేస్తే అంత కన్నా అమాయకత్వం వుండదు. వారు ఏం చేయాలో తెలియక వూరుకున్నారనుకుంటే అవివేకం కూడా. ఇదొ బృహత్‌ రాజకీయ క్రీడ.వారు అనుకున్నది వారికి అనుకూలమైన సమయంలో చేస్తారు, అంతే. ఇప్పుడు నిర్ణయం వెలవడబోతుందన్న వాతావరణం కూడా పూర్తిగా నిజం కాకపోవచ్చు. కాంగ్రెస్‌, తెలుగు దేశం లేకుండా ఒక్క టిఆర్‌ఎస్‌ ఒక్కటే ఎంత ప్రభావం చూపగలుగుతుందనేది మరో ప్రశ్న. వాళ్ల సమస్యలు వాళ్లకున్నాయి. బహుశా ఈ రోజు కాంగ్రెస్‌ వారి సమావేశానంతరం చాలా విషయాలు స్పష్టమవుతాయి.
    రసకందాయం అనాలని తెలుసు. కావాలనే అలా రాశాను.ధన్యవాదాలు.

    ReplyDelete
  10. "కేంద్రం ఏమి చేయాలో మనం చెబితే చేస్తుందనుకోవడం ఒక భ్రమ." - రవి గారూ, మనం చెప్పింది కేంద్రం చేస్తుందా లేదా అనేది తరవాతి సంగతి. అసలు మనం ఏం చెబుతున్నాం అనే దాని గురించి పావని గారు మాట్టాడుతున్నారు. మీరు కేంద్రం చేసేదాన్ని విశ్లేషిస్తున్నారు, బానే ఉంది. కానీ ఏం చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందో, ఎక్కువమంది ప్రజలకు మేలు జరుగుతుందో మీవంటి పెద్దలు చెప్పాలి కదా! కేంద్రం దాన్ని పాటిస్తుందా లేదా అనేది పక్కన పెట్టండి. ముందు మీరు చెప్పండి.. నిర్ణయం చేసే స్థానంలో మీరే ఉంటే ఏం చేస్తారు?

    ReplyDelete
  11. చదువరి గారూ,

    1. ఇప్పుడు చూస్తున పరిణామాలలో పాలక వర్గ పాచికలను అర్థం చేసుకోవడమే ఎక్కువ అవసరం.
    2.వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ కూడా నేను రాష్ట్రాల విభజనతోనే ప్రజల అభివృద్ధి సాధ్యమని గాని, మౌలిక సమస్యల పరిష్కారమవుతాయని గాని భావించను. టిఆర్‌ఎస్‌ ఇటీవల వచ్చింది గాని అంతకు ముందు నుంచి మూడు ప్రాంతాలలోనూ ఇలాటి భావాలు వ్యాపింపచేసింది కాంగ్రెస్‌ వారేనని చరిత్ర చెబుతుంది.ఇప్పుడు కూడా వారు అన్ని ప్రాంతాలతో చెలగాటమాడుతున్నారనే నా భావన
    3. రాజకీయాలు ప్రాంతీయ రేఖలను బట్టి మాత్రమే నడుస్తాయని నేను అనుకోవడం లేదు. కావాలనుకున్నప్పుడు ఈ రేఖలకు అతీతంగా కలవగలరూ,కలహించుకోగలరు కూడా. కనకనే తెలంగాణా సీమాంధ్ర వంటి పదబంధాలు కేవలం ప్రజలను దారి తప్పించడానికే పనికి వస్తాయి. దోచుకునే వారు దోపిడీకి గురయ్యేవారు రెండు చోట్ల వున్నారు. ప్రాంతీయ సమతుల్యత దెబ్బ తీసింది కూడా ఈ శక్తులే తప్ప సామాన్య ప్రజలకు సంబంధం లేదు.రేపు ఒకటిగా వున్నా వుండకపోయినా ఈ శక్తులు ఒకటిగానే ప్రయోజనాలు నెరవేర్చుకుంటాయి.
    4.ఇలాటి పరిస్థితుల్లో ఇదమిద్దంగా ఇలా చేస్తే బావుంటుందని నేను అనుకోవడం లేదు. వాళ్లు పెట్టిన చిచ్చును చల్చార్చవలసిన బాధ్యత వారిపైనే వుంటుంది తప్ప ఇది విభజనకు అనుకూలత వ్యతిరేకత సమస్య కాదు. కాంగ్రెస్‌ ఏమనుకుంటుందో ఇప్పటికే స్పష్టమై పోయిందికూడా. చేసేదేదో పారదర్శకంగా అవగాహనా పూర్వకంగా చేస్తే అకారణ ఉద్రిక్తతలు నివారించబడతాయి. అంతే.
    5.ప్రజలు విడిపోయారు అని అంటుండగానే ఎన్జీవోలతో సహా వివిధ తరగతుల ఉద్యోగులు కార్మికులు అనేక సమస్యలపై కలసి పోరాడి కోర్కెలు సాధంచుకుంటూనే వున్నారు. ఈ రోజు అంగన్‌ వాడీల జీతం పెంపును చూడండి. అలాగే పెట్రో ధరల పెంపు రైతాంగ సమస్యల వంటివి ఉమ్మడిగానే భరిస్తున్నారు. కనక మీరు నన్ను ఈ పాలక పార్టీల చట్రంలో పరిష్కారాలు చెప్పమంటే కష్టమే. కనీసం మీ ప్రయోజనాల మేరకైనా ఏదో ఒక పరిష్కారం చెయ్యండి అని నేనంటున్నాను. పరిష్కారం నా చేతుల్లో వుంటే ముందు ఈ చైతన్యం ప్రజలకు కలిగించి అందరికీ న్యాయం కలిగేలా చర్యలు తీసుకుంటాను. రకరకాల స్వార్థ రాజకీయ వ్యూహాలకు పగ్గాలు వేస్తాను.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  12. తమపై వచ్చే ఆరోపణలను మీడియా ఎన్నటికీ అంగీకరించదు. అసలు తమపై వేలెత్తి చూపితేనే ప్రజాస్వామ్యం మీద దాడిగా అభివర్ణిస్తుంది. వేలేత్తినవాడి నోరు మరి లేవకుండా మూస్తుంది. ఏదో ఒక రాజకీయ పక్షానికి తోకలా పనిచేయటం మినహాయించి స్వతంత్రంగా పనిచేయటం తెలుగు మీడియా ఎప్పుడో మర్చిపోయింది. ఎవరో ఒకరిని తిట్టిపోయటమో లేదా భజన చేయటమో మినహాయిస్తే 'విషయం' ఏమిటనేది చెప్పటం ఎప్పుడో మర్చిపోయాయి.

    ఓ పేరుగొప్ప టివి చానెల్ నిర్వహిస్తున్న చర్చలో 'తెలంగాణలో ఎవడైనా జైతెలంగాణ అనాల్సిందే లేకుంటే భౌతిక దాడులకు దిగుతాం' అని వ్యాఖ్యానించిన ఓ రాజకీయ పిపీలికాన్ని కనీసం ప్రశ్నించిన పాపాన పోయింది లేదు. అదే చానెల్ విలేఖరిని ట్యాంక్బండ్ మీద విరగ తన్నితే 'ఉద్యమానికి మద్దదిస్తున్న మా మీదే దాడులా?' అని వారి ప్రత్యెక సంపాదకీయంలో వగచటం మాత్రం వచ్చింది. విలువలు అనే పదాన్ని వాడటానికి మీడియా ముందు సిగ్గు పడాలి.

    సరైన గణాంకాలతో అసలు ఒక చర్చ అంటూ ఎప్పుడు జరిగింది? వచ్చిన విద్వాంసులు తమతమ భాషాప్రావీణ్యం చూపించుకోవటం మినహా! ఒక తెలంగాణవాదితో నిస్పక్షపాత విశ్లేషణేమిటో నా బొంద.

    నాకు ఒక విషయం అర్థం కాలేదు రవిగారూ, 'అసలు మనోభావాలనేవి కేవలం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమా ఈ దేశములో?' తెలంగాణ ఇవ్వకుంటే ఇక్కడ 'పార్టీ' భూస్థాపితం అని బడాయికి పోతారు. అసలు వ్యతిరేకత లేదనుకున్న మిగిలిన ప్రాంతాలలో రోజురోజుకూ పెరుగుతున్న నిరశన దెబ్బకు తలలో సైతాను తిరిగినట్లయ్యింది తల పండిన రాజకీయనాయకులకు సైతం.

    ఈ విషయంపె తేల్చాల్సింది, అసలు దోషులు నావరకూ 'కాంగ్రెస్' 'తెలుగుదేశం' 'లోక్ సత్తా'.
    MIM: సమైక్యవాదం
    CPI(M) సమైక్యవాదం
    CPI తెలంగాణ
    TRS: తెలంగాణ

    ReplyDelete
  13. ...కదా.మరి కేంద్రం ఛెస్తున్నది అదే కదండీ.

    ReplyDelete
  14. ala anukunte mee ishtam.ajyam posinde kendram ani marchipote ela? atoo itoo kuda... azad lanti wallaku ippudu chebutunna matalu gatmloteliyava? pavani garoo evari patranu batti vallanu anchana veyali. ok.

    ReplyDelete
  15. నిజం నిష్టూరంగానే ఉంటుంది, రవి గారు. వెంటనే తెల్చలేము, అందర్నీ ఒప్పించాలి అన్నాడు, ఆజాద్. నాకేమి తప్పు కనిపించలేదు. ముందు తెలియదా, అంటారా?
    అవును, తెలియదనుకుందాం . ఏమిటైతే? Better late than never.అయినా ఇప్పుడు అంట మెంటండీ ..మొదటి రోజే చిదంబరం చెప్పింది అదే కదా..
    "..pass a resolution from your assembly and send it to the center". It means arrive at a consensus.
    సూటిగా చెప్పండి..
    ఇవ్వరు..వింటారా?
    ఇస్తారు..వింటారా?
    ఏదీ చెప్పరు..వింటున్నారా?

    ReplyDelete
  16. @Pavani
    రవిగారు పైన యిలా పేర్కొన్నారు.. "వ్యక్తిగతంగానూ రాజకీయంగానూ కూడా నేను రాష్ట్రాల విభజనతోనే ప్రజల అభివృద్ధి సాధ్యమని గాని, మౌలిక సమస్యల పరిష్కారమవుతాయని గాని భావించను"
    మరి యింతసూటిగా రవిగారి తన అభిప్రాయాలు చెప్పిన తరువాతకూడా వారి దగ్గరనుండి ఎటువంటి సమాధానం కోసం ప్రయత్నిస్తున్నారో బొత్తిగా అర్థమవటంలేదు.
    ఇక్కడ పావని గారి ఏ ఉద్దేశం తో అడుగుతున్నారో అర్థమవటంలేదు.. యిది యెలా వుందంటే, పార్లమెంటులో రాష్ట్రవిభన చట్టంచేయడానికి సంపూర్ణ మెజారిటీ (కాంగ్రేస్, భాజాపా కలుపుకొని) కలిగివున్నప్పటికీ, రాష్ట్రంలో తెలుగుదేశం వల్లమాత్రమే రాష్ట్రవిభజన జరగడంలేదు అని ప్రచారం చేస్తున్న తెరాస లాగే మీవాదన కనబడుతుంది(నేనేమీ రెండుకళ్ళ సిధాంతానకేమి సమర్ధకుడను కాను).

    ReplyDelete
  17. నా ప్రశ్న విభజనపై రవి గారి సొంతభిప్రాయం గురించి కాదు. ప్రస్తుతం కేంద్రం ఏ డెసిషన్ తీసుకుంటే అందరూ సుఖంగా ఉంటారు-అనేదాన్ని గురించి.

    కేంద్రం ఇప్పుడు తెలంగాణా ఇవ్వమంటే మంచిదని రవి గారు చెప్తున్నారని మీ అభిప్రాయమా?
    నాకలా అనిపించటం లేదు. ఆయనా అందరిలాగే కాస్త చలి కాచుకుంటూ, కాసిని చిత్ర విచిత్ర విశ్లెషణలు చెసుకుంటూ కేంద్రం ఏమి చెప్పినా,చెప్పక పోయినా, సగమే చెప్పినా, అంతకనా తక్కువో ఎక్కువో చెప్పినా ఏకటాని కత్తులు నూరుతున్నారు. అంతే.

    రవి గారు, ఏమనుకోకండి.

    ReplyDelete
  18. This comment has been removed by the author.

    ReplyDelete
  19. @Pavani
    మంటవేసినప్పుడు చలికాగడం అనేది అసహజలక్షణమేమీ కాదు! నేను పైనచెప్పిన ఉదాహరణలాగే వుంది మీ ఉధేశం కూడా.
    మంటపెట్టడం గురించి చర్చించకుండా చలికాగడం గురించి మీ ఆందోళన యెందుకో? అంటే కేంద్రం మంటపెడితే వొల్లు కాల్చుకోవాలే తప్ప చలికాగకూడదనేకదా మీఉధేశం.

    కేంద్ర/కాంగ్రేస్ నాన్చుడుదోరణిని వారి సభ్యులే ఛీత్కరిస్తున్న ఈ సమయాన్న, మీళ్ళాంటి వారి బలం ఈ ప్రభుత్వానికి చాలా అవసరం.
    మీరనుకుంటున్నట్లు ఎటువంటీ విశ్లేషణలు మీరు విన్నకర్లా, మీలాంటి ఆలోచనా ధృక్పదం ఈ ప్రభుత్వాలకి అవసరం... నిర్మమోహటంగా నిసిగ్గుగా కొనసాగించుకోండి. యిలా అన్నానని ఏమీ అనుకోవద్దు :-)

    ReplyDelete