Pages

Tuesday, December 21, 2010

తెలుగు తెర ఆనంద బ్రహ్మ

 

ఏం సినిమాకు వెళ్దాం?
ఫలానా సినిమాకు
బాగుంటుందా?
బ్రహ్మానందం వున్నాడు కదా...

ఆయన పాతికేళ్ల హాస్య రసానందమై,, ప్రేక్షకులు హృదయానందమై,నిర్మాతల కనకానందమై అలా అలా అలరాలుతూ రజతోత్సవ సన్నివేశం చేరుకున్నారు. ఓ ఎనిమిది వందల పై చిలుకు చిత్రాలు చేసేసి సహస్రాధికానికి సాగిపోతున్నారు. కమెడియన్‌ అని ద్వితీయ స్తానంలోకి నెటిyవేయబడే విదూషక పాత్రను తారాపథంలో నిలిపి నిన్నటి హాస్య నట చక్రవర్తుల సరసన తిరుగులేని
పీరyం వేసుకున్నారు. తలుచుకుంటే చాలు నవ్వొచ్చేంత బలంగా ప్రేక్షక జన ప్రేమ పాత్రుడై పోయారు. ఆనందంలో బ్రహ్మానంద శైలి సృజించి మరెవరూ దరిదాపుల్లో రాకుండా కొండెక్కి కూచున్నారు.
కస్తూరి శివరావు తెలుగు కమెడియన్లలో మొదటి ప్రసిద్ధుడు. తర్వాత రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్య, పద్మనాభ'ం రమణారెడ్డి,బాలకృష్ణ,పేకేటి, వేలు వీరభ'ద్రరావు తదితరులు. కొన్ని చిత్రాల్లో ప్రధానంగా కనిపించినా తర్వాత కనుమరుగైన వారు, పెద్దగా ప్రకాశించలేక పరిమితుల్లో వుండిపోయిన వారు ఇంకా అనేకులు. హీరోలుగానూ వేస్తూనే హాస్యం పండించిన వారు మరికొందరు. ప్రసిదిÊధ పరంగా వీరందరిలో అగ్రగణ్యులు రాజబాబు,రేలంగి. ఆ తర్వాత అంతకంటే ప్రఖ్యాతి పొందింది నిస్సందేహంగా బ్రహ్మానందమే. హాస్యానికి ఆయన కొత్త నిర్వచనమై నిలిచాడు. సన్నివేశానికో సంభాషణలకో పరిమితమైన హాస్యాన్ని హావభావాల వైపు మరల్చడమే ఆయన ప్రత్యేకత, ప్రతిభ' కూడా. రాజబాబు కనిపించగానే జనం నవ్వేవారు.ఆయన నటనలో హడావుడి, కంగారు అందుకు ప్రధాన కారణం. ఎవరినో పిలుస్తూ సోఫాల కింద వెతకడం, అరుబాబోరు అనడం ఇవన్నీ రాజబాబు శైలి. రేలంగి రమణారెడ్డి వంటి వారిది ప్రధానంగా సన్నివేశ గతమైన హాస్యం. ఒకరికి తెలియకుండా ఒకరు రావడం, దొరికి పోవడం, మీద పిండిపోసుకోవడం, మాటలతో మస్కా కొటyడం ఇలాటివే వారి పాత్రల్లో ప్రధానం. జంధ్యాల సృషిyంచిన సుత్తివేలు-వీరభ'ద్రరావులు కూడా ప్రధానంగా సంభాషణా ప్రధానమైన హాస్య నటులే. వారి తర్వాత ఆయన అందించిన బ్రహ్మానందం మాత్రం ఈ అన్ని లక్షణాలనూ కలబోసుకున్న విశిషy కళామూర్తి. ఆయన హాస్యాభినయాన్ని ఒక మూసలో కుదించడం సాధ్యం కాని పని.ఆ విధంగా ఆయన తన సృషిyకర్త జంధ్యాల గీసిన గీతలను దాటిపోయి నవ్వుల నట చక్రవర్తిగా ఎదిగాడు.
1985 ఫిబ్రవరిలో తాతావతారం చిత్రం ద్వారా తెరంగ్రేట్రం చేసిన బ్రహ్మానందం తొలిసారిగా ప్రేక్షకుల దృషిyలో పాతుకు పోయింది అహా నా పెళ్లంట చిత్రంతో. అంతకు ముందు ఆయన ఏడు చిత్రాల్లో నటించాడు. అవన్నీ చిన్నా చితక పాత్రలే. కాని వాటిలోనే ఎక్కడో ఆయనలోని ప్రతిభా విశేషం ప్రకాశించి వుండబటిy రామానాయుడు వంటి ప్రథమ శ్రేణి నిర్మాత కంట్లో పడ్డాడు. అహా నా పెళ్లంట లో పిసినారి కోట సహాయకుడి పాత్రలో నటించడానికి వేలు కు ఖాళీ లేకపోవడంతో ఈయనను రప్పించి అరగుండు అన్నారు. అంతే.. ఆయన తెలుగు వారి కడుపులో నొప్పి తెప్పించే పెద్ద గుండులా వుండిపోయారు. అ ంతకు ముందు హాస్యం అంటే ఏ సన్నివేశాలో డైలాగులో గుర్తు చేసుకునే వారు ప్రేక్షకులు., కాని బ్రహ్మానందం అనే పేరు గుర్తుకువస్తే చాలు పరిశుభ్ర'మైన నవ్వుల జల్లుకురిసినటుy అనుభ'ూతించే స్తితికి చేరారు.
ఇంతకూ ఈ బ్రహ్మానందుడంటే ఏమిటి? తను కంగారు పడుతూ ఎదిటి వారిని కంగారు పెటేy కంగాళీ పెద్ద మని'ా? అర్తంపర్థం లేకుండా మాటాyడుతూ అవతలి వారి మెదడు తినేసి కిందపడేలా చేసే అమాయకుడా? లేక అవతలి వారి మాటలకు తనే కిందపడి గిజగిజ కొటుyకునే అరÊభ'కుడా?గుడ్డలు చించుకుని పరిగెత్తే విచిత్ర వర్తనుడా? మేకపోతు గాంభీర్యంచూపించే బడాయి బాబాయా? ఉత్తుత్తి కోపంతో వూగిపోతూ వూపిరాడకుండా తిట్ల దండకం చదివే ముక్కోపి స్వరూపుడా? చేతగాని చేషyలతో వెర్రినవ్వులతో నెటుyకొచ్కే వెంగళప్పడా? భార్యను అనుమానించే సందేహ మందేహుడా? భార్యను చూసి వణికిపోయే భ'యస్తుడా? చిరంజీవిలా వున్నావంటే నమ్మేసి చిందులేసే మతిలేని దాదానా? నెల్లూరు పెద్ద రెడ్డి పేరు చెప్పి దందా చేసే చోటా చోరుడా? అడ్డగోలు పారవాలు చెప్పే అవివేకపు ఆచార్యుడా?అక్షర శుద్ధి లేని అజానపు అయ్యవారా?తరాల అంతరాలు లేకుండా కథానాయకుల పక్కన నిలబడి వారి విజయాలకు నవ్వుల వత్తాసు నిచ్చే విదూషక శేఖరుడా?
చెప్పాలంటే ఇవన్నీ వినోదాల బ్రహ్మానందుడి విశ్వరూపాలు. అర గుండు నుంచి అనంతంగా సాగుతున్న అరగుండు హాస్య యాత్రలో అన్నీ రసగుళికలు. తెలుగు తెరను అంతగా నవ్వులతో అలంకరించి హాస్యాభిషేకం చేసిన సారÊథక నటుడు బ్రహ్మానందం నట జీవిత రజతోత్సవం కళాభిమానులకూ హాస్య ప్రియులకూ మహదానందకర దృశ్యం.
మనీ, లిటిల్‌ సోల్జర్స్‌, నువ్వు నాకు నచ్చావ్‌, వినోదం,బావగారూ బావున్నారా,సంతోషం,మన్మధుడు, పోకిరీ, భ'ళారే విచిత్రం, అనగనగా ఒక రోజు, జల్సా, ఆయనకు ఇద్దరు చెప్పాలంటే ఉదాహరణలూ ఉటంకింపులూ అక్కర్లేనంతగా జన హృదయాల్లో ఆయన పాత్రలు ముద్రితమైపోయాయి. అరుదుగా అయిషyంగా తప్ప హాస్యంలో అశ్లీలత రానివ్వని ప్రతిభా సంపన్నుడు రావడం వల్ల తెలుగు సినిమా హాస్యం కొత్త పుంతలు తొక్కింది. తర్వాత వచ్చినసుధాకర్‌, అలీ, సునీల్‌, వేణు మాధవ్‌, నరేష్‌, ధర్మవరపు, ఎంఎస్‌ నారాయణ తదితరులందరి చేరికతో హాస్య రసావి'ా్కరం పరిపూరÊణమైందంటే అందుకు నాంది ప్రస్తావకుడు మాత్రం బ్రహ్మానందమే. తేదీలలో ముందు వెనకలు ఎలా వున్నా ఆయన వచ్చాక హాస్యపు వరవడి మారింది.పరిధి పెరిగింది. జీవితంలో పెరిగిన వేగం, వైవిధ్యం,కపటత్వం, బూటకత్వం, పిరికి తనం, మురికి తనం వీటన్నిటినీ వ్యంగ్య హాస్య భ'రతంగా పొటyల్లో కూరి కూరి గిలిగింతలు పెటేy బ్రహ్మానందం మరో పాతికేళ్లు ఇలాగే నవ్వుల జల్లుల్లో ఓలలాడించాలని కోరుకుందాం... అందుకోసం ఈ నవ్వుల ఖజానాకు ఇచ్చిన నజరానాలే పద్మశ్రీ, డాకyరేట్‌, గిన్నీస్‌ రికార్డు, అన్ని. అవే పాత్రలు అంతగా వేసి వేసి విసుగెత్తలేదా అని విలేకరి అడిగితే అదేం లేదు అంటూనే మీకో రహస్యం చెబుతాను.. డబ్బులు కూడా ఇస్తారు కదా అని కొంటెగా అనగల ఆయన నిజానికి హాస్య రస రహస్యాలను ఔపోసన పటేyశాడు మరి!
..... నవ్వహో బ్రహ్మానందం!

2 comments:

  1. 'Babai Hotel' goorchi prastaviste bagundedi !

    ReplyDelete
  2. @ artcom sekhar

    nenu kavalane danni pratyekanga rayaledu. manchi cheddalela unna ayana careerlo adoka abberation anukunta.. mee comment chala latega choosanu.. sorry.

    ReplyDelete