Pages

Thursday, March 31, 2011

52 గంటలు... 52.వాయిదాలు



 

దాదాపు నెల రోజులకు పైగా జరిగిన శాసనసభ ప్రస్తుత సమావేశంలో చర్చలు 52 గంటలయితే వాయిదాలు 52. ఇంత ఉద్రిక్తంగా సభ జరపడానికి ఉపసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఎంత ఓపిక చూపించి వుంటారో వూహించవలసిందే. ఆఖరున ఆయనపైనా విమర్శలు వచ్చినా ఏదో నెట్టుకొచ్చారనే భావనే మిగిలించారని చెప్పాలి. బాగా ముగిస్తే అంతా బాగేనన్నట్టు ఆఖరు రోజున మంచి మాటలతో భూ కేటాయింపులపై సభా సంఘం గురించి సూత్రరీత్యా అనుకోవడం ఒక్కటే బాగున్న సంగతి. సమావేశాలకు మూలమైన బడ్జెట్‌ మాత్రం చర్చ లేకుండానే ఆమోదం పొందేయడం అన్నిటికన్నా

Wednesday, March 30, 2011

నేరాలు- సంసృతి- మీడియా




టీవీ అనేది మార్కెట్‌ యుగానికి ప్రథమ ప్రతినిధి. టీవీ లేకపోతే మార్కెటింగ్‌ అసంభవం. టీవీ వల్లనే మనం ఉదయం వాడే టూత్‌ పేస్టు నుంచి రాత్రి వాడే ఆలౌట్లు ఇతరాల వరకూ మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే మనను కీలుబొమ్మల్లా తిప్పేసుకుంటాయి. మా వాడు ఫలానా చాక్‌ లేట్‌ తప్ప తినడనీ, కొత్త ఫ్యాషన్‌ రాగానే వెంటబడతాడని మహా ఇదిగా చెప్పుకుని మురిసిపోవడం చూస్తుంటాము. ఇదంతా మార్కెట్‌ మహిమే. భారత దేశంలో నూతన ఆర్థిక విధానాల మొదటి దశ రాజీవ్‌ హయాంలో 1984లో మొదలైంది. టీవీ విస్తరణలో అది తొలి దశ . పివి నరసింహారావు మన్మోహన్‌ ద ్వయం దాన్ని మరింత ఆధునీకరించింది 1991లో. అప్పటి నుంచి ప్రైవేటు ఛానెళ్ల దశ. ఈ క్రమంలో ప్రతిదీ టీవీ మయమై పోయింది. అంతకు ముందు పత్రికలో వస్తేనే వార్త. ఇప్పుడు టీవీలో చూపిస్తేనే ఘనత. నడత.

టీవీలలో నేర వార్తల తీరు నా ప్రసంగ ఇతివృత్తం.అయితే సమాజంలో సాధారణ సంసృతి స్వరూపాన్ని ప్రస్తావించకుండా అదొక్కటే మాట్లాడ్డం కుదరదు. సంసృతి అంటే స్థూలంగా మనం జీవించే విధానం. బ్రిటిష్‌ రచయిత మేధావి రేనాల్డ్స్‌ విలియమ్స్‌ మాటల్లో చెప్పాలంటే శారీరకంగా సంక్రమించేది గాక జీవన క్రమంలో

Tuesday, March 29, 2011

శాసనసభలా? భీషణ దూషణ సభలా?



 

ఆంధ్ర ప్రదేశ్‌ శాసనసభ గవర్నర్‌పైన,జయప్రకాశ్‌ నారాయణ్‌పైన దాడులతో మొదలై సాక్షాత్తూ మంత్రివర్యులు ప్రతిపక్షంపై లంఘించిన దృశ్యంతో ముగింపు ఘట్టానికి చేరడం నిజంగా దారుణం. శాసనసభలు అనుశాసన(క్రమశిక్షణ) సభలుగా వుండవలసింది పోయి భీషణ దూషణ సభలుగా మారడం ఆందోళన కరం. వైఎస్‌పై తెలుగు దేశం సభ్యులు పట్టుకున్న ప్లకార్డులు నచ్చకపోతే వ్యతిరేకించడం వేరు, విరుచుకుపడటం వేరు. భూమి దానమిచ్చిన వైఎస్‌ వినోభాభావే అని ఆయన భక్తులు పొగిడిన రోజున తమ్ముణ్ని అందరూ వివేకానందుడని అంటారని

Saturday, March 26, 2011

పోరాటాల విజయం



బి.వి.రాఘవులు, ఎస్‌.వీరయ్య, జి.నాగయ్య, ఎం.బాబూరావులు దళితులు గిరిజనుల ఉప ప్రణాళిక నిధులు, ఇతర ప్రజా సమస్యలపై సాగించిన నిరాహారదీక్షలు అనుకున్న విధంగానే సుదీర్ఘ విరామం తర్వాత రాజకీయ అజెండాను మలుపు తిప్పాయి. ఆలస్యంగానైనా పరిమితంగానైనా ప్రభుత్వం ప్రతిస్పందించక తప్పని స్థితి తెచ్చాయి. 22 వ తేదీన జరిగిన బహిరంగసభకు ప్రదర్శనకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అందులోనూ అణగారిన వర్గాలకు చెందిన మహిళలు యువత విస్త్రతంగా కదలిరావడం కనిపించింది. సమస్యలపై పోరాడే వారికి రాజకీయ భేదాలకు అతీతంగా సహకరిస్తామని రాఘవులు చేసిన ప్రతిపాదనను కూడా స్వాగతించారు.ఈ దీక్షల ప్రాధాన్యతపై పత్రికలు కొన్ని సంపాదకీయాలు రాశాయి. ప్రభుత్వ హామీల అమలు కోసం మలిదశ కృషిని కూడా ప్రారంభించవలసి వుంటుందని ప్రజా సంఘాలు ప్రకటించాయి.

సుదీర్ఘ కాలంగా జీతాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న కాంట్రాక్టు జూనియర్‌ కాలేజీ లెక్చరర్లకు గణనీయంగా జీతాల పెంపు లభించడం పోరాటాల ఆవశ్యకతను మరోమారు నిరూపించింది.ఇంకా కొన్ని ముఖ్యమైన కోర్కెలు మిగిలి వున్నా సాధించిన మేరకు ఉత్సాహకరంగా వున్నాయి. ఈసమస్యపైనే పిడిఎఫ్‌ ఎంఎల్‌ఎ ఎంవిఎస్‌ శర్మ నిరవధిక నిరాహారదీక్ష కూడా చేసిన సంగతి గుర్తుండేవుంటుంది. కౌలు రైతులకు రక్షణ బిల్లు కూడా పోరాటాల ఫలితమే. ఇదే రీతిలో అంగన్‌ వాడీలకు కూడా అనేక ఉద్యమాల తర్వాత వేతనాల పెంపు లభించింది. మునిసిపల్‌ కార్మికులు కూడా ఈ కాలంలోనే విస్త్రత స్థాయిలో ఉద్యమాలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత వాతావరణంలోనూ సిపిఎం ప్రజా సంఘాలు సాగిస్తున్న ఉద్యమాలకు ఇవన్నీ ఉదాహరణలు. వీటి ప్రాధాన్యత గుర్తించలేని వారు , కావాలని విస్మరించేవారు ఏం మాట్లాడినా శ్రమ జీవుల కోసం పేద మధ్య తరగతి జనుల హక్కుల రక్షణ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు ఆగేవి కావు.

పాలకవర్గ క్రీడల పరాకాష్ట






ఈ వారం ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాలలో రకరకాల పాలక వర్గ పక్షాల పాచికలాట పరాకాష్టకు చేరింది. ప్రయోజనాల ఘర్షణలో వారి ప్రహసనాలు అనేకానేక రూపాల్లో ప్రదర్శితమైనాయి. కాంగ్రెస్‌,తెలుగు దేశం,వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌,టిఆర్‌ఎస్‌లతో సహా అన్ని పక్షాలూ పరి పరి విధాల సవాళ్లను ఎదుర్కొన్నాయి. శుక్రవారం నాడు దేశ రాజధానిలో కాంగ్రెస్‌ అధిష్టానం ప్రతినిదితో ఇరు ప్రాంతాల కాంగ్రెస్‌ ఎంపిలు విడివిడిగా సమావేశమై పాత విన్యాసాలనే పునరావృతం చేశారు. తెలుగు దేశంలోనూ ప్రాంతాల వారి విభేదాలతో పాటు ఒకే ప్రాంతానికి చెందిన వేర్వేరు నాయకులు భిన్న స్వరాలు వినిపించే విచిత్ర పరిస్థితి ఎదురైంది. టిఆర్‌స్‌ కాంగ్రెస్‌ విలీనం సమస్యపై ఎడతెగని మీమాంస సాగుతుండగానే శ్రీకృష్ణ కమిటీ రహస్య అద్యాయంపై హైకోర్టు తీర్పు ప్రకంపనాలు సృష్టించింది.

ప్రాంతీయ వ్యూహాలు- పార్టీలు

రాష్ట్ర రాజకీయ భవితవ్యంపై మే నెలలో అయిదు రాష్ట్రాల ఎన్నికల ముగిసే వరకూ ఎలాటి ప్రకటన రాదని అంటూనే ఆ లోగా వీలైనంత వ రకూ వివాదాలు పెంచేందుకు ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. అధికార కాంగ్రెస్‌ నేతలైతే తెలంగాణా, సీమాంధ్రల పేరిట విడివిడిగా మాట్లాడుతూ

Thursday, March 24, 2011

అతి రహస్యం బట్టబయలు- న్యాయాధీశుల పోకడలు






జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా వుంచాలన్న ఎనిమిదో అధ్యాయంపై హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి తీర్పు ప్రాంతీయ రాజకీయాలలో కొత్త ఘట్టానికి కారణమవుతుంది. న్యాయమూర్తుల విచక్షణాధికారాన్ని,న్యాయ నిర్ధేశాన్ని గౌరవిస్తూనే సమస్య సంబంధించిన కోణాలను పరిశీలించవచ్చు.నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ, తీర్ను నిచ్చిన నరసింహారెడ్డి ఉభయులూ న్యాయ శాస్త్ర పారంగతులైనా ఈ వివాదం రావడమే విచిత్రం.

నివేదికను ప్రచురించాలని ఆదేశిస్తూనే అందులోని ఆసక్తి కరమైన అనేకాంశాలను న్యాయమూర్తి వెల్లడించారు గనక దానిచుట్టూ చర్చ సాగుతున్నది.. బయిటపెట్టిన మేరకు చూస్తే అందులో పేర్కొన్న అంశాలు మావోయిజం, మత సంబంధాలు వంటివి రహస్యాలు గాని కొత్తవి గాని కాదు. వివిధ రూపాలలో

విలీనం ప్రతిపాదన వివాదం- నిజం!





కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ విలీనం గురించి కె.సి.ఆర్‌. సానుకూలంగా మాట్లాడినట్టు మీడియాలో చర్చ వచ్చినప్పుడు టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు గట్టిగా ఖ ండించారు గాని సమగ్రంగా ఖండించలేదు. అలాటి చర్చ పార్టీలో జరుగుతున్నట్టు వివిధ సందర్భాల్లో తెలుస్తూనే వుంది.ఎంఎస్‌వో లతో కె.సిఆర్‌ ఖచ్చితంగా ఏమన్నారనే మీమాంస పక్కనపెడితే అలాటి అంశాలు ప్రస్తావనకు రావడంలో అసహజం గాని ఆశ్చర్యం గాని ఏమీ లేదు. ఆ మరు రోజు కూడా చర్చల్లో పాల్గొన్పపుడు అధికారికంగానే ఆ పార్టీ ప్రతినిధులు అలాటి ప్రస్తావన వచ్చినట్టు,ఎంఎస్‌వోల ప్రశ్నలకు జవాబు చెప్పినట్టు కూడా స్పష్టంగానే చెప్పారు అంత కంటే ఆసక్తికరం ఏమంటే - అంత గట్టిగా ఖండించిన మరురోజునే ఆయన కాంగ్రెస్‌ నుంచి ప్రతిపాదన వస్తే తెలంగాణా ప్రజాభిప్రాయాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని బహిరంగంగానే ప్రకటించడం. ఒక పార్టీతో విలీనం వంటి మాటను పరిశీలిస్తామని చెప్పడం చిన్న విషయమేమీ కాదు. ఖండించడంలో వున్న తీవ్రత నిజమైతే అందుకు అస్కారం కూడా వుండదు. ఎవరు ఎవరితోనైనా విలీనం కావడానికి పూర్తి అధికారం అవకాశం వున్నప్పుడు ఇంత వివాదం దేనికనే ప్రశ్న అనివార్యంగా తలెత్తుతుంది.టిఆర్‌ఎస్‌ చారిత్రిక దశ ముగిసిందని గద్దర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాంతాలతో సంబంధం లేని వైరుధ్యాలనే సూచిస్తున్నాయి. రాజకీయార్థిక విషయాలు కేవలం ప్రాంతాలను బట్టి నడుస్తుంటాయనేది నిజం కాదని, విభిన్న రాజకీయ శక్తుల ప్రయోజనాల ఘర్ణణలోనూ, అంతిమంగా ఆర్థికాదిపత్య వర్గాల వ్యూహాల ప్రకారం నడుస్తుంటాయనేది ఇక్కడ మరోసారి రుజువవుతున్న పరమ సత్యం. ఇన్ని వివాదాల తర్వాత కూడా ఇప్పుడే విలీనం ప్రతిపాదన పరిశీలిస్తామని చెప్పారంటే రాజకీయ ప్రయోజనాలెంత బలంగా పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. అయితే అది వారి పార్టీ గనక వారిష్టం. ఈ వ్యవహారంలో ప్రజల అభీష్టం ప్రకారం నడుస్తామని చెప్పడం మరో మెలిక మాత్రమే. ఈ విలీన వివాద ప్రహసనం ఎలా ముగిసేదీ చూడాలి.

Saturday, March 19, 2011

వికీ లీక్స్‌పై వింత వాదనలు



కేంద్రప్రభుత్వంపై అమెరికా వొత్తిళ్లనూ, విశ్వాస తీర్మానం సందర్భంలో వారి ఓట్ల కొనుగోలు భాగోతాలను వికీలీక్స్‌ బయిటపెట్టిన తర్వాత మన్మోహన్‌ సింగ్‌ సర్కారు మరీ గిజగిజలాడుతున్నది. అవి దౌత్య పరమైన పత్రాలు గనక మనం ఖండించడం ధృవీకరించడం సాధ్యం కాదని ప్రణబ్‌ ముఖర్జీ అంటే వాటిని గుర్తించడమే లేదని ప్రధాని కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ రక్షణ కోసం ప్రలోభాలను ప్రయోగించిన సంగతి ప్రపంచమంతటికీ తెలిసినా ఈ అమాయక భంగిమ దాల్చడం విపరీతమే.వికీలీక్స్‌ కేబుల్స్‌లో విషయాలు అసత్యమని ఇంతవరకూ అమెరికానే అనడం లేదు. వరుస కుంభకోణాలతో పరువు కోల్పోయిన ప్రభుత్వం హాస్యాస్పద సమర్థనలు కట్టిపెట్టి సరైన సంజాయిషీ ఇవ్వడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతికంగానే ప్రభుత్వ నేత అయిన మన్మోహన్‌ను తెర పై చూపించి తమ బాధ్యత నుంచి తప్పకోవాలని కాంగ్రెస్‌ అధినేతలు భావిస్తే అది అసాధ్యమే. జపాన్‌ సునామి విలయంలో అణు ధార్మికత ముప్పు వికీలీక్స్‌లో అణు ఒప్పందం భాగోతం వెల్లడి ఏకకాలంలో జరగడంతో నాటి వామపక్షాల వాదన ఔచిత్యం అందరూ గుర్తించే అవకాశం లభిస్తున్నది.

పాక్షిక వ్యూహాల మధ్య ప్రజా ప్రతిధ్వని



సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, ఎస్‌.వీరయ్య,జి.నాగయ్య, ఎం.బాబూరావులు దళిత గిరిజన తదితర ప్రజా సమస్యలపై చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష ఇటీవలి రాజకీయాలలో కొత్త మలుపు. పాక్షిక వ్యూహాల వల్ల అనిశ్చితిలో కూరుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్‌లో అణగారిన ప్రజల సమస్యల పట్ల సమగ్ర దృక్కోణాన్ని ఆవిష్కరించే సమరశీల ప్రయత్నంగా దీన్ని అభివర్ణించవచ్చు. జగన్‌ తిరుగుబాటు, విభజన ఉద్యమం ఈ రెండు సమస్యల చుట్టూనే పరిభ్రమింపచేస్తూ అసలు అంశాలను మరుగు పర్చే కుటిలయత్నం పాలకపక్షం చేస్తున్నది. రాష్ట్ర భవిష్యత్తుపై రాజకీయ నిర్ణయం ఇప్పట్లో వెలువడటం కష్టమని స్పష్టమైన తర్వాతనైనా

నిజాయితీకి నీరాజనం-క్రాసింగ్‌ ప్రహసనం






ఇటీవలి కాలంలో శాసనమండలికి వివిధ నియోజక వర్గాల నుంచి ఎన్నికలు జరిగాయి.మరికొన్ని జరగబోతున్నాయి. రకరకాల రాజకీయ శక్తుల మధ్య తేడాను ఈ ఎన్నికలు కూడా విదితం చేశాయి.యుటిఎప్‌, జన విజ్ఞాన వేదిక వంటి ప్రజాస్వామిక సంస్థలకు చెందిన వారి నిజాయితీకి నీరాజనం పట్టారు ఓటర్లు. రాజకీయ పునరావాస కేంద్రంగా ధనరాశల అధిపతులకోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పునరుద్ధరణ జరిగిన మండలిలో ఈ తరహా ప్రతినిధులు ప్రముఖ స్థానం సంపాదించడం గత సారి జరిగిన గొప్ప పరిణామం. చెప్పుకోవడానికైనా చుక్కా రామయ్య వంటి ఆరోగ్యకరమైన ఆదర్శ వ్యక్తులు సభలో ప్రవేశించగలిగారు. వారిలో భాగమైన ఎంవిఎస్‌ శర్మ, వి.బాలసుబ్రహ్మణ్యం ఘనమైన సంఖ్యాబలంతో తిరిగి ఎన్నిక కాగా కొత్తగా శ్రీనివవాస రెడ్డి,డాక్టర్‌ గేయానంద్‌ కూడా

Thursday, March 17, 2011

విధ్వంస పర్వంలో వితండం



ట్యాంకు బండ్‌పై తెలుగు ప్రముఖుల విగ్రహాల విధ్వంసం ప్రజాస్వామిక భావనల పట్ల గౌరవం వున్నవారంతా నిశితంగా ఖండించవలసిన చర్య. మీడియా ప్రతినిధులపై దాడి, కెమెరాల విధ్వంసం ఇంకా దారుణమైనవి. ఇదే ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు నాయకులపై దౌర్జన్యం గతంలో ఇక్కడి ఇద్దరు ఎంఎల్‌ఎలపై జరిగిన దానికి కొనసాగింపు. వీటిని ఖండించడమంటే తెలంగాణా ప్రజలను లేదా ఉద్యమాన్ని అవమానించడంగా చేసే వ్యాఖ్యలు రెండు విధాల పొరబాటు. ఒకటి - జరిగిన దాన్ని పరోక్షంగా సమర్థించడం, రెండు - తమ నిర్వాకాన్ని ప్రజలందరికీ ఆపాదించడం. మార్చ్‌ నిర్వాహకులు విగ్రహ విధ్వంసం అసమంజసం అంటూనే అదేదో తెలంగాణా సాంసృతిక ఆధిపత్యంపై పోరాటానికి వ్యక్తీకరణ అంటూ ఆమోద ముద్ర

Sunday, March 13, 2011

ప్రజల చైతన్యంపైన అపారమైన నమ్మకం




1. విధ్వంసంపైన దాడులపైన చేసే విమర్శలు సంబంధిత శక్తులకు వర్తిస్తాయి తప్ప సాధారణ ప్రజలకు కాదు. టాంకు బండుపై విధ్వంసం చేసిన వారిని, ఆ చర్య తీరును ఖండించడం తెలంగాణా ప్రజలను లేదా ప్రాంతాన్ని ఖండించడం అనుకోవడమే అర్థ రహితం.
తెలంగాణా ప్రజల లౌకిక ప్రజాస్వామ్య పోరాట సంప్రదాయాలకూ ఈ అరాచక పోకడలను సంబంధం లేదన్నది నా ప్రధాన వాదన.(లౌకిక ప్రజాస్వామిక అన్నది ఒక ప్రయోగం) ప్రాంతాల వారిగా రాజకీయాలు నడపడం స్వార్థ రాజకీయ వేత్తల పని. మొత్తం పరిణామాలను ఒకే కొలబద్దతో చూడటం ప్రజాస్వామిక పద్దతి.వూరికే వుద్రేకపడి దూషణలకు దిగే మిత్రులు కాస్తయినా వాస్తవికంగా ఆలోచిస్తే తెలంగాణా ప్రజల పేరిట కుటిల రాజకీయాలు సాగుతున్న వైనాన్ని తెలుసుకోగలుగుతారు.
తాలిబాన్లన్న మాట నేను వాడలేదు. మొదట స్పందించిన మిత్రుడు వాడితే అసహనానికి పాల్పడిన వారిని ఏ పేరుతో పిలిస్తే అది వర్తిస్తుందన్నాను తప్ప ప్రజలను అనలేదు. అనను కూడా. ప్రజల చైతన్యంపైన నాకు అపారమైన నమ్మకం వుంది.వారే ప్రజాస్వామిక విలువలను పరిరక్షించుకోగలరు.

2.విగ్రహ విధ్వంస సందర్భాన్ని కుటిల రాజకీయాల వుచ్చులో తమ ప్రాణాలు తామే తీసుకున్న అమాయక సోదరుల యువకుల ఆత్మాహుతిని ఒకే గాట కట్టడం మరింత అర్థ రహితం. మనుషుల ప్రాణాల విలువ ఎప్పుడూ ఎక్కువే. వాటిపై అధికార రాజకీయాలు నడిపే వారు అందుకు సమాధానం చెప్పాలి.
రాష్ట్ర విభజనపై నిర్ణయం రాజకీయ సమస్య తప్ప ప్రాణాలు తీసుకోవలసిన అంశం కాదు. దేశంలో ఎక్కడైనా సరే విధానాలు మారని విభజనలు యువత భవిత మార్చేదేమీ వుండదు. ప్రాణ చైతన్యంతో పోరాడటం నేర్చుకుంటే ప్రజల జీవితాలు మారతాయి తప్ప ప్రాణాలు తీసుకోవడం వల్ల కాదు.
చరిత్రలో వీర తెలంగాణా సాయుధ పోరాటంతో సహా మహత్తర ప్రజా పోరాటాలు ఉద్యమాలు చాలా జరిగాయి. ఏనాడూ ఇలాటి విషాదం చూడలేదు. ఈ పరిస్తితిని ఎలా నివారించాలన్నది అసలు ప్రశ్న.

3. చర్చలో విస్త్రతంగా పాల్గొన్న మిత్రులకు కృతజ్ఞతలు తెల్పుతూనే రెండు మాటలు. నేను రాసిన దానిపైన వ్యాఖ్యలు చేయడం మెరుగు తప్ప మీలో మీ వాదోపవాదాలకు దీన్ని వేదికగా చేసుకోవద్దని మనవి.
ఎవరి భావాలు ఏవైనా ఒకరినొకరు దూషించుకోవడానికే అయితే బ్లాగులూ చర్చలూ ఎందుకు? అందుకోసమే ఉద్దేశించే వారికి ఇకపై జవాబులుండవు.

Thursday, March 10, 2011

బ్లాగు మిత్రులకు....


1. దాడిని ఖండించడంపై ఏకాభిప్రాయం స్పష్టం.కర సేవకులైన తాలిబాన్లయినా, లేక శివ సైనికులైనా అసహనం, విధ్వంసం, అప్రజాస్వామిక ధోరణలు గురించిన ప్రస్తావన ఇది. సందర్భాన్ని వదలి దానిపై సంవాదం మరల్చడం సమస్యను దారి తప్పిస్తుంది.
2.తెలుగు ప్రజల ప్రత్యేకించి తెలంగాణా ప్రజల లౌకిక ప్రజాస్వామిక సంప్రదాయాలకు ఇది పొసగదనీ, ఈ ఘటనలపై నాయకత్వం వహిస్తున్నామనుకునే వారితో సహా అందరూ ఆందోళన చెందడం అవసరమనీ నా అభిప్రాయం.
3.కొందరు వ్యాఖ్యాతలు అనుచిత పదాలు వాడినా నేను స్పందించ దలచ లేదు. అలాగే చర్చల్లో కొందరు నేతలు ఆత్మహత్యలకూ విధ్వంస కాండనూ పోటీ పెట్టి మాట్టాడ్డంలోనూ ఔచిత్యం లేదు. ఇంత కన్నావిలువైన ప్రాణాలను తామే తీసుకునే పరిస్తితి కల్పించిన దోషం కూడా ప్రధాన పార్టీల నేతలదే. ఇదిగో అదిగో అంటూ భ్రమలు గొల్పిన వారూ ఇందుకు బాధ్యులు కాకపోరు.
4. అన్నిటినీ మించి రాష్ట్ర విభజనపై నిర్ణయం రాజకీయ సమస్య కాగా దాన్ని ఆవేశకావేశాల వైపు,భావోద్వేగాల వైపు మరల్చి రాజకీయ సోపానాలు వేసుకున్న నేతలు మరింతగా బాధ్యత వహించక తప్పదు.ఇప్పటికే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. ే ఈ ధోరణులు రేపు వారి పైకి మరలినా ఆశ్చర్యం లేదు.
5.ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంసం గురించి కొన్ని సంస్థలు కొందరు వ్యక్తులు చాలా సార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో పోలీసులు వాటిని రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్నది కూడా ప్రశ్నార్థకమే.

బ్లాగు మిత్రులకు- చిన్న పేరాలు, తేలికైన వాక్యాల గురించి పదే పదే వస్తున్న సూచనలు ఇకపై పాటిస్తాను. సమయం లేక పోవడం వల్ల పత్రికల్లో రాసిన వ్యాసాలను యధాతథంగా ఇవ్వడం ఈ సమస్యకు కారణం. దీనికోసం ప్రత్యేకంగా రాస్తాను.
ఇకపై ఇంగ్లీషులోనూ కొన్ని వ్యాఖ్యలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
రెండు రోజులు వుండటం లేదు గనక తాజా పర్చడం,జవాబులివ్వడం ఆ తర్వాతే.

Tank bund Vandalism and hurt Telugu Spirit



      

                  The unprecedented vandalism that marked  million march in Hyderabad on 10, march  shocked everybody alike. In fact those who respect Telangana sentiment are more hurt because this is not part of the  democratic traditions of heroic Telangana.
The most preplexing part is that all the Peoples representatives attacked so far are from the same region ! Earlier it was Nagam, Latter it was JP(who technically is from the region) now Madhu yashki and kk. It only shows that impatience know

ట్యాంకు బండు విధ్వంసం




మహనీయుల ఘన సృతికే
మాసిపోని అపచారం
ప్రజాస్వామ్య విలువలపై
ప్రతీఘాత దౌర్జన్యం


కరసేవను తలపించే
ట్యాంకు బండు విధ్వంసం
రాజకీయ సంకుచితపు
వ్యూహాలకు గుణపాఠం

ప్రాంతీయ వివాదాలతో పాలక పక్షాలు సాగిస్తున్న కుటిల వ్యూహాలు రాష్ట్రాన్ని ఏ స్తితికి చేర్చాయో గురువారం నాడు ట్యాంకుబండ్‌పై బుద్ధవిగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండ వెల్లడించింది. ఈ అనాగరిక అరాచక చర్యలు తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక సంసృతికే కళంకం తెచ్చి పెట్టాయి. తెలుగు జాతి చైతన్య మూర్తులు సామాజిక వైతాళికులు అయిన మహామహుల సృతికి మచ్చ తీసుకొచ్చాయి. కారకులెవరు ప్రేరకులెవరు విధ్వంసకులెవరు వినాయకులెవరూ

అవాంఛనీయం.. అప్రజాస్వామికం





Wednesday, March 2, 2011

రుజాగ్రస్త జాహ్నవీయం




ఎదురు దెబ్బలు నిజం కావచ్చు.విచ్చిన్నాలు సత్యం కావచ్చు. కూలిన సామ్యవాద సమాజాలు సాక్ష్యం ఇవ్వొచ్చు. ఇవన్నీ నిజమైనా- సోవియట్‌ తూర్పు యూరప్‌ విచ్చిన్నాల తర్వాత కూడా - సామ్రాజ్యవాద సంసేవకులు, స్వేచ్చా విపణి భాష్య కారులు దాన్ని చీల్చి చెండాడాలని ముచ్చట పడటంలో ఆ సిద్ధాంత బలం సాక్షాత్కరిస్తుంది. మార్క్సిజం దేవతా వస్త్రం లాటిదనే విభూత భాష్యం. జాహ్నవీ దండకంలో తాజా సుభాషితం.కమ్యూనిస్టు సిద్ధాంతంపై కాలకూట విషం కక్కడానికి అంకితమైన జాహ్నవి అనే ఈ బురఖా కలం ముసుగు తొలగించి