Pages

Saturday, March 19, 2011

వికీ లీక్స్‌పై వింత వాదనలు



కేంద్రప్రభుత్వంపై అమెరికా వొత్తిళ్లనూ, విశ్వాస తీర్మానం సందర్భంలో వారి ఓట్ల కొనుగోలు భాగోతాలను వికీలీక్స్‌ బయిటపెట్టిన తర్వాత మన్మోహన్‌ సింగ్‌ సర్కారు మరీ గిజగిజలాడుతున్నది. అవి దౌత్య పరమైన పత్రాలు గనక మనం ఖండించడం ధృవీకరించడం సాధ్యం కాదని ప్రణబ్‌ ముఖర్జీ అంటే వాటిని గుర్తించడమే లేదని ప్రధాని కొట్టి పారేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ రక్షణ కోసం ప్రలోభాలను ప్రయోగించిన సంగతి ప్రపంచమంతటికీ తెలిసినా ఈ అమాయక భంగిమ దాల్చడం విపరీతమే.వికీలీక్స్‌ కేబుల్స్‌లో విషయాలు అసత్యమని ఇంతవరకూ అమెరికానే అనడం లేదు. వరుస కుంభకోణాలతో పరువు కోల్పోయిన ప్రభుత్వం హాస్యాస్పద సమర్థనలు కట్టిపెట్టి సరైన సంజాయిషీ ఇవ్వడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతికంగానే ప్రభుత్వ నేత అయిన మన్మోహన్‌ను తెర పై చూపించి తమ బాధ్యత నుంచి తప్పకోవాలని కాంగ్రెస్‌ అధినేతలు భావిస్తే అది అసాధ్యమే. జపాన్‌ సునామి విలయంలో అణు ధార్మికత ముప్పు వికీలీక్స్‌లో అణు ఒప్పందం భాగోతం వెల్లడి ఏకకాలంలో జరగడంతో నాటి వామపక్షాల వాదన ఔచిత్యం అందరూ గుర్తించే అవకాశం లభిస్తున్నది.

6 comments:

  1. మీరు అసలైన వింత వాదన ను విస్మరించారు:
    "పోయిన లోక్‌సభ విషయాలను ప్రస్తుత లోక్‌సభ చర్చించరాదు" - ప్రణబ్ ముఖర్జి, ప్రధాని కావాల్సిన అభ్యర్థి, ఆర్థిక శాఖామాత్యులు.
    పోయిన లోక్‌సభ సభ్యుడు మీ పాకెట్ కొట్టేసి, ఇప్పటి లోక్‌సభలో కూర్చుంటే, అతను నేరస్థుడు కానట్టే అన్నమాట! అందుకే ఈ దేశంలో చట్టం అలా చట్టుబండలవుతోంది.

    ReplyDelete
  2. vismarinchaledu gani smarinchaledu. endukante kottiveyalemu anna mata chala mukhyamandi... paraspara viruddhamaindi.. gata sabha ledane vadana sanketikanga tappu kadu.. naitikanga pedda tappu

    ReplyDelete
  3. yes every one is realising the relevance of the left views

    ReplyDelete
  4. రవిగారు, శుభోదయం. నా ఉద్దేశంలో గతంలోని అనుభవాల దృష్ఠితోనైనా ఇలాంటి
    నాయకుల్ని ఎన్నుకోవడం మన ప్రజల తప్పు. ఓ సినిమాలో సిరివెన్నెల అంటారు.
    "నిగ్గతీసి అడుగు ఈ సిగ్గులేని జానాల్ని" అని.

    ReplyDelete
  5. వికీ లీక్స్‌ విషయంలో వామపక్షాల వాదనకు వచ్చే బలం కాంగ్రెస్‌,బిజెపిలకు రాదు.ఎందుకంటే ఉభయులూ అమెరికాకు అనుకూలత విషయంలో సమాన భాగస్వాములే. బిజెపి తమకు వర్తించేవి మినహాయించి అవతలి వారికి మాత్రమే అన్వయించమంటే కష్టం కదా... అమెరికా మౌలిక విధానాలకు అంతర్జాతీయ ఆధిపత్య వ్యూహాలకు సంబంధించిన అనేకాంశాలు ఇప్పటికీ లీక్స్‌లో రాలేదన్నది నిజమే. ఆసాంజేకు కూడా ఏవో ఆలోచనలు వుంటాయి కదా..వికీలీక్స్‌లో విదేశాంగ భాగోతంపై లోగడ నేను రాసిన వివరమైన వ్యాసం పాత పోస్టుల్లో చూడొచ్చు.

    ReplyDelete
  6. Ravi Garu,I am just seeing your blog for the first time. It is interesting to read content. Congratulations.
    Jwala

    ReplyDelete