జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా వుంచాలన్న ఎనిమిదో అధ్యాయంపై హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి తీర్పు ప్రాంతీయ రాజకీయాలలో కొత్త ఘట్టానికి కారణమవుతుంది. న్యాయమూర్తుల విచక్షణాధికారాన్ని,న్యాయ నిర్ధేశాన్ని గౌరవిస్తూనే సమస్య సంబంధించిన కోణాలను పరిశీలించవచ్చు.నివేదిక ఇచ్చిన శ్రీకృష్ణ, తీర్ను నిచ్చిన నరసింహారెడ్డి ఉభయులూ న్యాయ శాస్త్ర పారంగతులైనా ఈ వివాదం రావడమే విచిత్రం.
నివేదికను ప్రచురించాలని ఆదేశిస్తూనే అందులోని ఆసక్తి కరమైన అనేకాంశాలను న్యాయమూర్తి వెల్లడించారు గనక దానిచుట్టూ చర్చ సాగుతున్నది.. బయిటపెట్టిన మేరకు చూస్తే అందులో పేర్కొన్న అంశాలు మావోయిజం, మత సంబంధాలు వంటివి రహస్యాలు గాని కొత్తవి గాని కాదు. వివిధ రూపాలలో
ప్రస్తావనకు వస్తున్నవే. కనక వాటిని ఎందుకు రహస్యంగా వుంచాలన్నారు? అలా అన్న తర్వాత దాని గురించి తదుపరి అధ్యాయంలో ఎందుకు ప్రస్తావనలు ఇచ్చారు? అలాగే బయిటపెట్టే పని తానే చేస్తున్నప్పుడు ఇంకా ఎవరినో ఆదేశించవలసిన అవసరం ఏముంటుంది? నివేదిక సిఫార్సులపై వ్యాఖ్యానించబోనంటూనే అది ఫలానా దానికి వ్యతిరేకంగా వుందనడం వ్యాఖ్యానం కాదా?
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎనిమిదో అధ్యాయంలో భాగాలుగా వెల్లడించిన అంశాలలోనూ అశాస్త్రీయత చాలా వుంది. ఉదాహరణకు విద్యా సంస్థలు,మీడియా యాజమాన్యాల గురించిన ఆయన వ్యాఖ్యలతో తెలంగాణా విభజన వాదులకు కూడా భిన్నాభిప్రాయం వుండదు. కాకపోతే మీడియాలో విలేకరులు తెలంగాణాకు చెందిన వారు గనక ఎక్కువ ప్రచారం ఇస్తున్నారనీ, సంపాదకులు మరో ప్రాంతం వారు మరోలా చేస్తున్నారని అనడం అవగాహనా రాహిత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మీడియాలో అనేక లోపాలు వున్న మాట నిజమే అయినా కేవలం ప్రాంతాలను బట్టి నడుస్తుందనుకోవడం అవాస్తవం. చాలా నెలల పాటు మా లాటి వాళ్లందరితోనూ అతి చిన్న సమస్యపైన కూడా చర్చలు ప్రత్యక్ష ప్రసారాలు నడిపింది మీడియా సంస్థలే. పైగా విలేకరులు సంపాదకుల చర్యలకు కేవలం ప్రాంతీయ అనుబంధాలే కారణమనడం కూడా వారి వృత్తి నిబద్దతను ప్రశ్నించడమే అవుతుంది.
ఏది ఏమైనా నివేదికను బట్టి శ్రీకృష్ణకు గాని, తీర్పు స్వభావాన్ని బట్టి న్యాయమూర్తికి గాని ఉద్దేశాలు ఆపాదించడం బొత్తిగా అనవసరమైన పని. దీనిపైన కేంద్రం నోరు మెదిపి వుంటే ఇన్ని సంవాదాలకు ఆస్కారమే వుండేది కాదు.
ravi garu... vilekharula gurinchi vyakhyaninchindi narasimhareddy kadu.. 8chapter itself comment on beat journalists. it also says media dependant on advt's. it can be managed. justice srikrishna blatantly supported corruption in written in this so called chapter through political management and media management. why he should be prosicuted in the court of law.
ReplyDeleteanother thing... all of you analysts discussing the thing that justice narsimha reddy says. when giving any judgement even hang to a culprit... the judge has to be convinced the thing himself. that mean court. he has to tell why he giving that type of judgement. narasimhareddy also done the same thing. why you are not commenting on those three points straightly. don't try to divert. just say yes are no... is it right to say for any committee - manage the political parties.. manage media.. and supress the movement by armed forces.. if you really unbiased on this please answer straigt forward.
ReplyDeletesantosh garoo,
ReplyDeletein ur anger u mis understood my comment. i reffered those comments as that of Sri krishna and opined that they are un scintific. your impression that i attributed them to Narasimha reddy is flawed. though i made remarks from another angle also. on the whole i commented on the approach of both the jurists with due regard. please read my text carefully and spare me from undue criticisim. i never subsribe to the kind of prescriptions but and only hope a democratic solution. then for heven's sake dont brand all the analysts with same brush. bias is not one of virtues and so also uncritical support or condemations of any kind. gone are the days when judiciary was considered a whole cow when jurists them selves condeming each other.thank u.
రవి గారు, మీ ఇంగ్లీష్ చాలా బాగుంది. పదాలను వాడుతున్న తీరు ఎఫెక్టివ్ గా ఉంది. మీరు ఇంగ్లీష్ లో కూడా essays రాస్తారా..? ఒకవేళ రాసివుంటే, నెట్ లో అందుబాటులో ఉంటే, దయచేసి లింక్స్ ఇవ్వండి.
ReplyDelete(అప్రస్తుత కామెంట్ కి మన్నించగలరని మనవి)
తెలంగాణావాదులు అంటే సరే .విభజన వాదులు అన్నా సరే లే అనుకొంటాం .ఈ 'తెలంగాణా విభజన వాదులు 'ఏంటో అర్థం కాలేదు .మీడియా ఏంటో ?ఎ రకంగా ప్రవర్తిస్తుందో ,ఎవరి లాభాల కోసం పనిచేస్తుందో manufacture of consent ని నేర్పుగా చేసే రాజ్యానికి దాని ప్రయోజనాలు కాపాడే కమిటీలకు చాల బాగా తెలుసు కాని ,మీరు అదేదో బుజ్జి పిల్లల అవగాహనా రాహిత్యం అంటూ సర్ది చెప్పాలని చూస్తె నమ్మే అమాయకులు ఎవరైనా ఉన్నారంటారా?
ReplyDeleteతెలంగాణా ప్రజాస్వామిక ఆకాంక్షల పట్ల మీకు అఇష్టత ఉండొచ్చు .కాని పౌర సమాజం లో ,ప్రజా పరిపాలనలో విలువలు పూర్తిగా కనుమరుగు అవుతున్న విషయం శ్రీ కృష్ణ 8 వ చాప్టర్ లో వారు రాసిన వివిధ విషయాలు వాడిన పద జాలం ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి కీలకమైన legislature ,press ని manage చేయాలనటం తేట తెల్లం చేసింది .సమాజం పట్ల నిబద్ధత కలిగిన జర్నలిస్ట్ గ ,సంపాదకుడిగా మీరు ఈ 8 వ చాప్టర్ లో ఉన్న ప్రజా వ్యతిరేఖ భావ జాలాన్ని ప్రజలకు అర్థం అయ్యేట్టి చెప్పడం సందర్బోచితం .
ముక్త 34
ReplyDeleteతెలంగాణా విభజన జరగాలని కోరేవారు గనక అలా అంటున్నాను. దానికి వేర్పాటు వాదం అనే పదానికి కొంత తేడా వుందనే భావనతో. విభజన కోరని వారిలో కూడా తెలంగాణా ప్రజలు బాగుండాలని కోరేవారు దాని వీరోచిత చరిత్రను గౌరవించేవారు అసంఖ్యాకంగా వున్నారు. వారందరినీ తెలంగాణా వ్యతిరేకులనీ, ద్రోహులనీ అనడం వల్ల ఈ పదం వాడుతున్నా. అలాగే అవకాశవాదంతో మాట్లాడేవారంతా తెలంగాణా ప్రజల హితులే కాకపోవచ్చు కూడా. విభజన అనేది కీలకం గనక ఆ మాట.. అంతే.
న్యాయమూర్తి గురించి అవగాహనా రాహిత్యం,అశాస్త్రీయం అని వాడటంలో తీవ్రత చూడాలి మీరు కూడా. అలా గాక అమ్ముడు బోవడం, మేనేజ్ చేయడం వంటి మాటలు వాడమంటారా అప్పుడు ఈ జడ్జి గురించి ఇంకేదో అంటారు. ఉపయోగం ఏముంటందని నా ఉద్దేశం.ఈ ప్రిస్కిప్షన్‌పై నాకు నమ్మకం లేదని మొదటి ప్రశ్నకు జవాబుగా చెప్పడమే కాదు, ఉదయం ఎన్‌టివిలోనూ చెప్పాను. దాన్ని మాత్రమే ఖండించాలంటే అదీ కుదరదు. ఎందుకంటే ఇతర కోణాలు కూడా వున్నాయి గనక. అన్ని అంశాలను అందరి మాటలనూ ప్రజాస్వామిక ప్రమాణాలతో చూడాల్సిందే.
సమస్య ఏమంటే ఎవరికి వారు ఒకవైపే చూస్తున్నారు. నేను అన్ని వైపులా చూడటానికి ప్రయత్నిస్తున్నాను. తెలంగాణా అంటే కొందరు నాయకులే కానట్టు ఇతర ప్రాంతాలంటే కూడా కొందరు పెట్టుబడిదారులే కాదు. చారిత్రిక సమస్యలు రాజకీయ సంక్షోభాలు ఏకపక్షంగా చర్చించడం ఎప్పుడూ కష్టమే. మీరు అన్నట్టు సంయమనమే ఇప్పుడు సందర్భోచితం అని నేను భావిస్తాను.
అన్నట్టు మ్యానుఫాక్చరింగ్ కన్సెంట్ తెలుగులో మీడియా మాయాజాలం పేరిట అనువదించి, ముందుమాటతో వివరణ జోడించింది నేనే. అలాగే వీర తెలంగాణ మాది పుస్తకం కూడా.. ధన్యవాదాలు.
చీకటి గారూ,
ఇంగ్లీషు మెచ్చుకున్నందుకు సంతోషం. కాని నిజంగా అంతుందా? నేను తెలుగులోకి అనువదించడమే అత్యధికం. డజను పైగా పుస్తకాలు చేశాను.అలాగే పెద్ద నాయకుల ప్రసంగాలు వేదికలపై అనువదిస్తుంటాను. పీపుల్స్ డెమోక్రసీకి రాయడంతో పాటు ఎప్పుడైనా ఇంగ్లీషు పత్రికలకు ఇంటర్వూలలో చెప్పడం, ఈ మధ్య బ్లాగులో రాయడం తప్ప పెద్దగా ఇంగ్లీషు అవసరం రాదు. అయినా మీ సూచన మేరకు గతంలో రాసినవి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.ధన్యవాదాలు.
/బయిటపెట్టే పని తానే చేస్తున్నప్పుడు ఇంకా ఎవరినో ఆదేశించవలసిన అవసరం ఏముంటుంది? నివేదిక సిఫార్సులపై వ్యాఖ్యానించబోనంటూనే అది ఫలానా దానికి వ్యతిరేకంగా వుందనడం వ్యాఖ్యానం కాదా?/
ReplyDeleteరవి గారు, మొదటి సారి నిన్న జస్టిస్ నరసింహారెడ్డి వ్యాఖ్యలను విన్నప్పుడు నాకు అలానే అనిపించింది. ఆయన ఓ భాధ్యతాయుతమైన పదవున్న జడ్జిలా , హుందాగా వ్యవహరించలేదు, ఏ తెలంగాణ చెట్టుకింద న్యాయవాదిగానో అనిపించారు. ఒక డాక్యుమెంట్ సీక్రెట్ అని వున్నప్పుడు, ఆ క్లాసిఫికేషన్ అవసరంలేదని చెప్పొచ్చు, అందులోని విషయాలు ఏమంత రహస్యం కాకపోవచ్చు, కాని జడ్జిగా వుంటూ, హోం మినిస్ట్రీకి ఆ ఆదేశాలు ఇవ్వక, తానే తొలగించి బట్టబయలు చేయడం సిల్లీగా అనిపించింది. అది రహస్యమా కాదా నిర్ణయించాల్సింది హోం మినిస్ట్రీ మాత్రమే.
ఆ జడ్జిని చాలా 'అతి 'గా, వ్యక్తిగంత రాగద్వేషాలతో స్పందిస్తున్నారు. అలాంటి వారు ఆపదవికి అనర్హులు, సివిల్ కేసులకు పరిమితం చేయాలి లేదా స్వంతరాష్ట్రానికి దూరంగా బదిలీ చేయాలి.
పదవులు ఎరగా వేసి అల్లర్లను అదుపులో చేయమని సలహా ఇవ్వడం అవినీతి ప్రోత్సహించడం అనడం కన్నా కన్నా రాజకీయం అనడం సబబు. కేంద్రప్రభుత్వం బాహాటంగా చేస్తోంది, మన్‌మోహన్‌సింగ్ చెబుతోంది అదేగా! డి.ఎం.కె, తృణమూల్, తెరాస, జె.ఎం.ఎం, మజ్లిస్, శివసేన పార్టీలను అధికార పార్టీలు బుజ్జగించి ప్రభుత్వాన్ని కాపాడు కోవడం లేదా? ఇది పార్లమెంటరీ పాలనలోని తప్పనిసరి లొసుగులు.
The judge showed unusual eagerness in revealing the classified document rather than directing the Home ministry to declassify it. The conspicuous revelation is in no way helpful to the separatists as it stressed the need of being united.
ReplyDeleteThough he himself did that job for them, this ‘out-of-turn favour’, didn’t satisfy the separatists, who filed the case. :)
రవి గారు,
ReplyDelete>>>అలాగే బయిటపెట్టే పని తానే చేస్తున్నప్పుడు ఇంకా ఎవరినో ఆదేశించవలసిన అవసరం ఏముంటుంది?
జడ్జి గారు కేవలం కొన్ని పాయింట్స్ మాత్రమే కోట్ చేశారు, పూర్తి పాఠం ఇంకా రహస్యంగానే ఉంది. పూర్తి పాఠం బయట పెట్టమనే తీర్పు ఉద్దేశం.
తీర్పులో తాము తీసుకున్న నిర్ణయాలను బలపరచే అంశాలను ఉటంకించడం తీర్పులలో సర్వ సాధారణం. పైగా దాపరికం అవసరం లేదని తీర్పరే భావించినపుడు ఆ అంశాలను ఉటంకించడం అసహజమేమీ కాదు.
I see many distortions and omissions of what skc said in our news reports. go through this to know actual quotes of skc
ReplyDeletehttp://hc.ap.nic.in/orders/wp_1569_2011.html
/పైగా దాపరికం అవసరం లేదని తీర్పరే భావించినపుడు ఆ అంశాలను ఉటంకించడం అసహజమేమీ కాదు. /
ReplyDeleteరేప్ చేసినోడికి శిక్ష వేస్తే చాలు, రేపు ఎలా చేస్తారో చేసి ఉటంకించాల్సిన అవసరంలేదని ఈ తెలంగాణ న్యాయశాస్త్రంలో వుండదేమో! :))
ఉరి శిక్ష వేసి, జడ్జిగారే తలారిగా మారి కోర్ట్ ఆవరణలో ఉరేసేదాక కేసు కోజ్ చేయరన్నమాట! బాగుంది ఈ ఆటవిక న్యాయం. :D సినిమాల్లో కూడా ఇలా జరగదు, ప్రైవేట్‌గా శిక్ష తనే అమలు పరిచినట్టు కొన్ని సినిమాలు వచ్చాయిD
Snkr
ReplyDelete>>>రేపు ఎలా చేస్తారో చేసి ఉటంకించాల్సిన
చేయడానికి ఉటంకించడానికి తేడా తెలుసుకోండి.
ఏ కేసులో అయినా తీర్పు చెప్పేటప్పుడు అందులో విషయాలను చర్చించకుండా చెప్పడం జరగదు. ఆయా విషయాలను కోట్ చేస్తూ అవి రహస్యంగా ఉంచే అవసరం లేదని నిర్ణయించడం జరిగింది.
>>>జడ్జిగారే తలారిగా మారి కోర్ట్ ఆవరణలో ఉరేసేదాక కేసు కోజ్ చేయరన్నమాట! బాగుంది ఈ ఆటవిక న్యాయం. :D సినిమాల్లో కూడా ఇలా జరగదు
అదే జరిగిందిగా, 8వ అద్యాయం రూపంలో!
హరి,
ReplyDeleteమీరు తెలంగాణాకు అనుకూలంగా(అందులో వ్యతిరేకంగా వున్నా) చెప్పాడని గుడ్డిగా సమర్థిస్తున్నారు కాని, ఆ జడ్జి తీర్పు చదివేటప్పుడు, టెక్నికల్‌గా అందులోని పాయింట్లను చెప్పేశాక, క్లాసిఫై చేయాల్సిన అవసరం లేదని ఇచ్చే తీర్పుకు అర్థం ఏముంటుంది? తీర్పు ఇవ్వడానికి అందులోని అంశాలను బహిర్గతం చేయనవసరం లేదు. ఉటంకించాల్సినవి అలాంటి పాత కేసులు, తీర్పులు, అందులోవున్న విషయాలు కాదు. అది శాంతిభధ్రతల సమస్య ఐతే ఈ జడ్జి భాధ్యత వహించి ఉరిశిక్ష విధించుకుంటారా? తీర్పు ఇచ్చాక ఎక్కడ సుప్రీం కోర్టుకు వెళ్ళతారో అనే చెత్త ఆలోచనలేకుంటే అంత ఆవేశానికి లోనవ్వాల్సిన అంశం కాదు.
It is clear violation of basic ethics/coduct of any responsible State/Central Officer. He has set a bad example in judiciary. Law ministry should take appropriate action against such political motivations among civil/judicial services.
In this case I don't care whether it is pro seperation or against seperation. A donkey should not take responsibility of a dog and try to bark without giving it an opportunity to bark & vice versa. :)