Pages

Thursday, March 10, 2011

ట్యాంకు బండు విధ్వంసం




మహనీయుల ఘన సృతికే
మాసిపోని అపచారం
ప్రజాస్వామ్య విలువలపై
ప్రతీఘాత దౌర్జన్యం


కరసేవను తలపించే
ట్యాంకు బండు విధ్వంసం
రాజకీయ సంకుచితపు
వ్యూహాలకు గుణపాఠం

ప్రాంతీయ వివాదాలతో పాలక పక్షాలు సాగిస్తున్న కుటిల వ్యూహాలు రాష్ట్రాన్ని ఏ స్తితికి చేర్చాయో గురువారం నాడు ట్యాంకుబండ్‌పై బుద్ధవిగ్రహం సాక్షిగా సాగిన విధ్వంస కాండ వెల్లడించింది. ఈ అనాగరిక అరాచక చర్యలు తెలంగాణా ప్రజల ప్రజాస్వామిక సంసృతికే కళంకం తెచ్చి పెట్టాయి. తెలుగు జాతి చైతన్య మూర్తులు సామాజిక వైతాళికులు అయిన మహామహుల సృతికి మచ్చ తీసుకొచ్చాయి. కారకులెవరు ప్రేరకులెవరు విధ్వంసకులెవరు వినాయకులెవరూ
తెలియని విపరీత పరిస్తితుల్లో విచక్షణా రహితమైన విద్వేషానలం విశృంఖల విహారం చేసింది.
మిలియన్‌ మార్చ్‌ జయాపజయాలు పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తెలుగు ప్రజల మహత్తర వారసత్వాన్ని వీర తత్వాన్ని తూట్లు పొడిచే ప్రక్రియ విజయవంతంగా సాగింది. ఆఖరుకు కోదండ రామ్‌, గద్దర్లు కూడా ఏదో ఒక భాషలో విచారం వెలిబుచ్చవలసిన స్తితి కల్పించింది.
చాపకూటితో సమతను నేర్పిన నాటి పలనాటి బ్రహ్మన్న, విశ్వ నరుడ నేను అని సగర్వంగా చాటుకున్న దళిత కోకిల జాషవా, బ్రహ్మమొక్కటేనని మానవులు ఏకత్వాన్ని ఏనాడో చాటిన అన్నమయ్య ,విప్లవ కవితా ప్రవక్త శ్రీశ్రీ చెప్పాలంటే ప్రాత:స్మరణీయులైన మహనీయులందరి ప్రతిమలను తుత్తునియలు చేసి అనాగరికతను చాటుకున్న అరాచకం తాండవించింది. ఈ విగ్రహాలకు విలువ ఇవ్వడం కాదు విగ్రహాల వెనకనున్న విలువల విధ్వంసం ఇక్కడ సమస్య.నాలుగు డబ్బులు ఖర్చు చేస్తే రేపే వాటిని పునరుద్దరించవచ్చన్న మాటలు జరిగిన విధ్వంసం కన్నా తీవ్రమైనవి.
తర్వాత మహిళలతో సహా మీడియా ప్రతినిధులపైన కేమెరాలు సామగ్రిపైన జరిగిన దౌష్ట్యం మరింత అఘాయిత్యం. అను నిత్యం తమ సకల విన్యాసాలనూ వివరంగా చూపించే ప్రసార సాధనాలపై దాడి వెనక వున్నది జరిగే అమానుషత్వం దాఖలాలు లేకుండా పోవాలన్న దుశ్చింతే. ఎప్పుడో అయోధ్య కాండలో కరసేవకులనబడే వారి భయంకర కృత్యాలను ప్రజాస్వామ్య చైతన్యానికి మారుపేరైన తెలుగు నాడు రాజధానిలో సచివాలయ సమీపంలో చూడాల్సి రావడం ఆందోళన కరం.
ఇక ఈ సందర్భంలో కాంగ్రెస్‌ ఎంపిలు మధు యాష్కి, కే.కేశవరావులపై దాడి రాజకీయంగా తీవ్రమైంది. ఇప్పటి వరకూ దాడులకు గురైన నాగం జనార్ధన రెడ్డి, జయప్రకాశ్‌ నారాయణ( ఆయన కూడా సాంకేతికంగా తెలంగాణా ప్రాంత ప్రతినిధే) మధు, కెకె అందరూ ఈ ప్రాంతానికి చెందిన వారే కావడాన్ని బట్టి ఇది కేవలం ప్రాంతీయ రేఖలను బట్టి నడుస్తున్న పరిణామం కాదనేది స్పష్టం. ఈ మొత్తం సంక్షోభానికి మూల కారణం కేంద్రం సృష్టించిన అనిశ్చితి కాగా దాన్ని కొనసాగిస్తూ మరింత అజ్యం పోయడం సహించరాని విషయం. ఈ మార్చి విషయంలో కూడా ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరులో అనేక అస్పష్టతలు అవకవతవకులు వున్నాయి. వాటిని సవరించుకోకపోతే భవిష్యత్తులో మరింత నష్టం.
రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన రాజకీయ రాజ్యాంగ సమస్యను ఆ విధంగానే పరిష్కరించుకోవాలి తప్ప ఉద్రిక్తతలు విధ్వంసాలు మార్గం కాదు. అందులోనూ మహామహుల విగ్రహాల విధ్వంసం, మీడియాపైన ప్రజా ప్రతినిధుల పైన పోలీసు వాహనాల పైన దాడులు సమస్యను మరింత జటిలం చేస్తాయి.ప్రజలను మరింత ఆవేదనకు గురి చేస్తాయి.
ఈ మొత్తం పరిణామాన్ని ప్రాంతీయ కోణం నుంచి సమర్థించుకుంటూ తెలంగాణా ప్రజలకు ఆపాదించడం చెల్లుబాటయ్యేది కాదు.దీనికి నాయకులైన వారు పునరాలోచించుకోకపోతే రేపు ఇదే వారికీ జరగొచ్చు. ఉద్యమాలకూ విధ్వంసాలకు తేడా అందరికీ తెలుసు. పాలకులు కూడా రాజకీయ పాచికలపైనే దృష్టి పెట్టడం మాని పటిష్టమైన చర్యలతో ప్రజా జీవిత ప్రశాంతతను, ప్రతివారి ప్రజాస్వామిక హక్కులను కాపాడాలి. ప్రజలు కూడా ప్రాంతాలకు అతీతంగా ఇలాటి వికృతాలను ఆమోదింబచోమని చాటి చెప్పాలి. అవినీతి అధిక ధరలు వనరుల స్వాహా ఉద్యోగ రాహిత్యంతో సహా తమను వేధించే అసంఖ్యాక సమస్యల నుంచి దారి తప్పించి ఉద్వేగాలలో ఉద్రేకాల్లో ముంచి పబ్బం గడుపుకోజూసే పాలక వర్గ వ్యూహాల పట్ల అప్రమత్తంగా వుండాలి.టాంకు బండ్‌ కరసేవకుల విశృంఖల విధ్వంసం నేర్పుతున్న పాఠం అదే.

18 comments:

  1. మీ విశ్లేషణ బాగున్నా.. కర సేవకులతో పోల్చడం సరికాదు.. వాళ్లు కేవలం అయోధ్య కట్టడాన్నే ధ్వంసం చేసారు.. వీళ్ళను తాలిబాన్లతో పోలుస్తున్నారు అందరూ...

    ReplyDelete
  2. దీనికి భాద్యులైన వారిని గుర్తించి (ఏదో వొక కెమెరా లో సాక్ష్యం వుండే వుంటుంది )
    ఖటినం గా శిక్షించక పొతే ముందు ముందు మరింత గా రెచ్చి పోయి విద్వాన్సాలు సృష్టించి ,
    ఆపై చిత్రికరించారేమో అని టీవీ కెమెరాలను ద్వంసం చేసే కొత్త ట్రెండ్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు .

    ReplyDelete
  3. I agree with what you have written here.
    What they have done is of Talibanic nature. I wonder who got this stupid idea of destroying cultural icons, in the name of a separate state? Unbelievable!!!

    BTW, it would be helpful for the reader, if you can split it into multiple paragraphs.

    ReplyDelete
  4. విలువలు విద్వంసం అయ్యాక, నిగ్రహం + విచక్షణ కోల్పోయాక ఇహ విగ్రహాలు ఓ లెక్కా..? కేంద్ర,రాష్ట్రాల అనిశ్చత స్థితికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం..

    ReplyDelete
  5. తెలుగు జాతి చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సన్నివేశం .దుక్ఖ బరితమైన సందర్బం .ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు జాతి ఒక సమస్యను పరిస్కరించుకోలేని భావ దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది. అవును మీరు చెప్పింది నిజమే. ఈ రోజు జరిగింది కేవలం విగ్రహ విద్వంసం మాత్రమే కాదు .విలువల విద్వంసానికి సూచన కూడా .అన్ని పార్టీ లు ఎన్నికల మానిఫెస్టోలో జై తెలంగాణా అంటాయి .డిసెంబర్ ఏడున తెలంగాణా తీర్మానం పెట్టమంటాయి .డిసెంబర్ 9 ప్రకటన రాగానే 10 న రాజీనామాల డ్రామా స్టార్ట్ అవుతుంది .కొన్ని వందల బలిదానాలు పరిహాసం అవుతాయి .విలువల విద్వంసానికి ,ప్రజాస్వామ్య పతనానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏమైనా ఉంటుందా ?ఈ రోజు అందరం సిగ్గు పడాలి .ఒక ప్రాంత ప్రజలు అనేక సంవత్సరాలుగా పరిపాలన విభజనని ముక్త కంతంతో కోరుకోంటుంటే ,మనం మీ డిమాండ్ న్యాయ మైనదని అనేక సార్లు చెప్పి వారి చేత వోట్లు వేయించుకొని హటాత్తుగా మాట మారుస్తాము .మేధావులం అని చెప్పుకోనేవారం ప్రజాస్వామిక ఉద్యమాలను వెటకారం చేస్తాము .శాంతియుతంగా పోరాడుతున్నవారిని విచక్ష్సన కోల్పోయేలా చేస్తాము .పరిపాలన విభజనతో ఆగిపోయేదాన్ని మనుష్యుల విభజన దాక తెస్తాము .అవును ఈ రోజు తెలుగు జాతి చరిత్రలో చీకటి రోజు .మన దివాలాకోరుతనానికి మన జాతి మహనీయుల ఆత్మ క్షోబించే రోజు .

    ReplyDelete
  6. please give telengana. after some time it will become historical blunder.

    ReplyDelete
  7. "...కరసేవను తలపించే...."

    వోలేటిగారితో నా ఏకీభావం వ్యక్తపరుస్తున్నాను. ఎడారులమీదుగా వచ్చిన దురాక్రమణదారులు బలవంతంగా కట్టిన కట్టడాన్ని ధ్వంసం చెయ్యటాన్ని, టాంక్ బండ్ మీద జరిగిన విధ్వంసాన్ని ఒకేలాగ చూడటం ఏమీ బాగాలేదు. అలా ఒకే గాటన కట్టి, ఆంధ్రా ప్రాంతం వారిమీద "దురాక్రమణదారులు:, "వలసవాదులు" అని చేయబడుతున్న అరోపణలతో మీరు ఏకీభవిస్తున్నారా? అలా ఏకీభవించి ఒకే రాష్ట్రంలో ఒకే భాష మాట్లాడుతున్న వారిమద్య సృష్టించబడ్డ వైషమ్యాలను సమర్ధిస్తున్నారా?

    ReplyDelete
  8. కర సేవనో, కర్రసేవనో ఆ పదం మీరు రాజకీయ కక్కుర్తి కారణాలకోసం వాడుకున్నా, ఈ విషయంలో అది ఖచ్చితంగా ఖండనీయం.

    ReplyDelete
  9. అప్పుడు జరిగిన దానికి దీనికి పోలిక ఉంది అంటారా ? అక్కడ అన్న ఒక పద్దతి ఉంది ఒక మతం వాళ్ళ కట్టడాన్ని వేరేవాళ్ళు కుల్చారు ..ఇప్పుడు ఒకే జాతికి చెందిన వాళ్ళం మన గొప్ప దానాన్ని తెలియ చెప్పే వాళ్ళ మిద కోపమా ? నన్నయ ,అన్నమయ్య ,సర్ కాటన్ దొర ,కృష్ణ దేవరాయులు ,బళ్ళారి రాఘవ ,గురజాడ ,శ్రీ శ్రీ ఏమి చేసారు వీళ్ళని ..తెలంగాణ కి అడ్డు చెప్పరా ? అడ్డు చెబుతున్న వాళ్ళని ఏమి చేయ కుండ వీళ్ళ మీద దాడి ఏమిటి ? రామ రావు గారు ఎంతో ఉన్నతం గా అలోచించి పెట్టిన విగ్రహాలు అవి ...ఎన్నో సంవత్సరాల తెలుగు జాతికి జరిగిన మానభంగం ఇది ....

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. కొమొరం భీం, మల్లేష్, కెసిఆర్, విజయశాంతి, కాకా, తక్కువైతే మీ విగ్రహం కూడా పెట్టుకోండి. టాంక్బండ్ కూలి పోయే వరకూ. ఇంకొకరు పెట్టడం ఏమిటి, మీరు పెట్టండి. చందాలెత్తండి. కావాలనుకుంటే కెసిఆర్, యాష్కి, కేశవరావు, వెంకటస్వామి ఒకటి కాదు 100 విగ్రహాలు పెట్టించగలరు, మాయావతి లాగా. మీలాంటి మేధావులు అడగాలే కాని విగ్రహాలకేం కొదువ. పెట్టిన విగ్రహాలు కూల్చడం అనాగరికం అని మీకు అర్థమైన రోజు, రాష్ట్రం 23 రాష్ట్రాలుగా విభజిద్దాం. చేసిన దిక్కుమాలిన పని, పైగా సమర్థన! సిగ్గులేకపోతే సరి.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. బాబ్రీ మసీదుకు టాంక్ బండ్ మీద విగ్రహాలకు లంకె పెట్టడం ఏమన్నా అర్థంవుందా? అది ఇక్కడ అప్రస్తుతం. ఆసంస్య, ఈసమస్య ఒకటి కాదు.

    కొమొరం భీం విగ్రహం పెట్టమని మీరు ఆందోళన చేశారా? విగ్రహం పెడితే కలిసుంటాం అన్నారా? ఆహా హర్టింగా వుంటుందేం?! మరి ఆర్థర్ కాటన్, కృష్ణదేవరాయలు తెలంగాణతో సంబధంలేని గొప్పవాళ్ళ విగ్రహాలను కూల్చి టాంక్ బండ్‌ను కంపు చేయడం, తలాతోక లేని మాటలతో సమర్థించడం మనసుకు హర్టింగ్ కాక హాయిగా వుంటుందా? ప్రతి వ్యాఖ్యకూ నేను ప్రతివ్యాఖ్యానించను, మీరు లక్కీ అనుకోండి. :)

    ReplyDelete
  14. కొమరంభీమ్ ని కెసిఆర్ ని ఒకే గాటన కట్టి మాట్లాడటం కంటే సిగ్గు మాలిన పని ఇంకొకటుందా ?అసెంబ్లీ సాక్షి గ తెలంగాణా తీర్మానం పెట్టమని మాట మార్చిన నాయకులకు సిగ్గుందా?అసలు సమస్యని వదిలేసి శబ్ద ఆడంబరం లో సంతృప్తి చెందుతున్న మేధావులకు సిగ్గుందా ?అయోధ్య కాండ కు ప్రజాస్వామిక తెలంగాణా ఉద్యమానికి పోలిక తెచిన కుహన మేధావులకు సిగ్గుందా ?అరిసి గోలపెట్టి ప్రజాస్వామిక ఆకాంక్షలను అనిసివేయొచ్చు అనుకొనే ఆటవికులు ఉండే చోట అనాగరిక సంఘటనలు జరిగితే ఆశ్చర్య పోవలిసింది ఏముంది .

    ReplyDelete
  15. @snkr ". ట్యాంక్ బండ్ ని కంపు చేయటం " కాలేజీ రోజుల్లో ట్యాంక్ బండ్ కంపు గురించి అందరు అంటుండేవారు ,అప్పుడు పెద్దగా అర్థం కాక పోయేది .మీ వ్యాక్యలు చుసిన తరువాత కొంచం అర్థం అవుతుంది .ఐనప్పడికి మల్లి ఒక సారి వెళ్లి చూడాలి కంపు పెరిగిందో ,తగ్గిందో .
    మాయావతి గురించి మాట్లాడేస్తున్నారు .అది బ్లాగ్లో anonymous names తో రాసేసినంత తేలిక కాదేమో .

    ReplyDelete
  16. This comment has been removed by the author.

    ReplyDelete
  17. This comment has been removed by the author.

    ReplyDelete
  18. Telu'godu' http://www.youtube.com/watch?v=embu3Jpbj-w ( Presented by Visalandhramahasabha http://www.facebook.com/visalandhra?sk=app_4949752878 )

    ReplyDelete