Pages

Sunday, April 24, 2011

మోడీని వెంటాడుతున్న మారణహౌమ ఫలం




హౌమం చేసిన వారికి ఫలం దక్కుతుందనేది నమ్మకం. మారణహౌమం చేసిన వారైనా సరే ఆ ఫలాన్ని అనుభవించిక తప్పదు. పురాణ కాలంలో వలె కథల్లో కావ్యాల్లో వలె గాక ప్రజాస్వామ్య యుగంలో రాజ్యంగం ఆ పని చేయవలసి వుంటుంది. అయితే 2002లో గుజరాత్‌లో మైనారిటీలపై సాగిన ఘోర హత్యాకాండకు మాత్రం ఆ సూత్రం ఇంకా అమలు కావలసే వుంది.అయితే తాజాగా గుజరాత్‌ ఐపిఎస్‌ అధికారి సంజరు భట్‌ దాఖలు చేసిన అఫిడవిట్‌తో మోడీ మరోసారి ఇరకాటంలో
పడిపోయారు ఆ నాడు ముఖ్యమంత్రిగా వున్న నరేంద్ర మోడీ ప్రత్యక్ష పరోక్ష ప్రోద్బలం దీని వెనక వుందని నిరూపించే ఆధారాలు అనేకం వున్నా నాటి ఎన్‌డిఎ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే ఆయనను కాపాడింది. ఒక దశలో ప్రధాని వాజ్‌పేయి కొంత గొంతు కదిపినా ఆయనే వెనక్కు తగ్గాల్సివచ్చింది తప్ప సంఘ పరివార్‌ మోడీని అంటుకోలేదు. . గొద్రా ఘటన తర్వాత ఆగ్రహంతో వున్న హిందువులకు దాన్ని వ్యక్తీకరించే అవకాశమివ్వాలని ముస్లింలకు గుణపాఠం నేర్పించాలనీ మోడీ పోలీసు అధికారులతో జరిపిన సమావేశంలో చెప్పారని భట్‌ సుప్రీం కోర్టుకు చెప్పారు. పదవిలో వున్న ఐపిఎస్‌ స్వయంగా ఈ మాట చెప్పడంతో మోడీ సర్కారు సంజాయిషీ చెప్పుకోక తప్పని స్తితి. ఇంతకు ముందు ఆర్‌.బి.సుకుమార్‌ అనే అదనపు డిజిపి కూడా ఈ మేరకు సుప్రీం కోర్టులో ఇలాటి అఫిడవిట్‌నే వేశారు.
ఆ రోజు సమావేశంలో తను ఎందుకు ఎలా పాల్గొన్నదీ ఎవరెవరు ఉన్నదీ సంజరు భట్‌ సోదాహరణంగా తెలియజేశారు. దీనిపై మోడీ చాలా నిరుత్సాహానికి గురైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయినా నష్ట నివారణ చర్యలలో భాగంగా నాటి డిజిపి చక్రవర్తితో భట్‌ అక్కడ లేడని ప్రకటన చేయించారు. కాని ఆయన అక్కడే వున్నాడని సాక్ష్యమిచ్చేందుకు మరో పోలీసు అధికారి కూడా వున్నాడు.అయితే కె.డి.పంత్‌ అనే ఆ సాక్షి ప్రస్తుతం మీడియాకు అందుబాటులోకి రాలేదంటున్నారు. ఏది ఏమైనా నాటి ఘోరకృత్యాలలో మోడీ పాత్ర ప్రోత్సాహం ప్రోద్బలం ఏమిటన్న దానిపై దర్యాప్తు జరిపంచవలసిందే. బాబరీ మసీదు కూల్చివేతకు అద్వానీ, జోషి వంటివారిపై కేసులు పెట్టి విచారించడమైనా జరిగింది గాని మోడీపై అది కూడా జరగలేదు. ఈ ఉపేక్ష రాజ్యాంగ మూల సూత్రాలకే విఘాతం కలిగించే విషయం.

5 comments:

  1. "ఆ రోజు సమావేశంలో తను ఎందుకు ఎలా పాల్గొన్నదీ ఎవరెవరు ఉన్నదీ సంజరు భట్‌ సోదాహరణంగా తెలియజేశారు. దీనిపై మోడీ చాలా నిరుత్సాహానికి గురైనట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయినా నష్ట నివారణ చర్యలలో భాగంగా నాటి డిజిపి చక్రవర్తితో భట్‌ అక్కడ లేడని ప్రకటన చేయించారు. కాని ఆయన అక్కడే వున్నాడని సాక్ష్యమిచ్చేందుకు మరో పోలీసు అధికారి కూడా వున్నాడు.అయితే కె.డి.పంత్‌ అనే ఆ సాక్షి ప్రస్తుతం మీడియాకు అందుబాటులోకి రాలేదంటున్నారు."

    మీ ఊహ అమోఘం రవి గారూ. ఒక ఐపీయస్ ఆఫీసర్ సంజయ్ భట్ నోటి తీట వొదిలించుకోడానికి వాగిన వాగుడు మీకు సోదాహరణం గా అనిపించింది, అదే అతనికంటే పై అధికారి చక్రవర్తి గారు చెప్తే ఎవరో చెప్పించినట్లు. మధ్యలో మోడీ నిరుత్సాహానికి గురి అయ్యారంట అది మీరు కలలో చూశారంట. మనిషి ఎదిగిపోతున్నాడు కదా, ఒక రాయి వేసి చూద్దాం అనుకోవడం నిఖార్సయిన జర్నలిజం అనిపించుకోదు రవిగారూ... ఒక్కసారి ఆలోచించండి మీరు చెప్పినదాంట్లో నిజంగా నిజం ఎంతో, కుహనా లౌకికవాదుల కల్పితం ఎంతో.

    ReplyDelete
  2. మధ్యలో ఈ 'కేడీ' పంత్ ని వశపరచుకోడానికి తెర వెనుక ఏమేమి చేస్తున్నారో అమ్మగారూ, 'అన్న'గార్లూ...

    ReplyDelete
  3. too early to conclude. Lets wait and watch ..

    ReplyDelete
  4. @Csivaajee garu, I agree with you. I dint expect such 'too early conclusion' from senior journalist Ravi gAru.

    ReplyDelete
  5. after all it is not a new issue nor i passed any hasty comments except stressing the need for a comprehensive investigation. there is no quetion of any imagination.. Sanjay bhatt is a serving officer and chakravarti is not.we havo to take that also into account. disappointment(nirutsaham) is a mild word used in the media. i also refered Advani and Vajpayee.
    let we wait for the reaction from s.c...

    ReplyDelete