Pages

Monday, August 13, 2012

జగన్‌పట్ల కిరణ్‌ మెతక వైఖరి? తెలుగు దేశం కొత్త వ్యూహం?



వైఎస్‌ జగన్‌ పట్ల ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఆయన ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తూ పరోక్షంగా సహకరిస్తున్నాయనే భావం రాజకీయ వర్గాలలో బాగా పెరుగుతున్నది. ప్రతిపక్షాలు మీడియా ప్రతినిధులు గాక అచ్చంగా అధికార పార్టీ ముఖ్యులే ఈ మాట పదే పదే అంటున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. ఇటీవల జగన్‌ పార్టీకి చెందిన ఒక సీనియర్‌ నాయకుడు(ఇక్కడ కొత్తవారే) దీనిపై ఆసక్తికరంగా స్పందించాడు. ఢిల్లీతో రాజీకి వచ్చారని అంటే అక్కడ వస్తే ఏం లాభం, యుపిఎ అంతంత మాత్రంగా వుంది, ఇంకా ఇక్కడ రాజీ పడటమే మాకు ఎక్కువ ఉపయోగం అని ఆయన అన్నాడు. మంత్రులను తద్వారా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే మాకు కూడా మద్దతు నివ్వక తప్పదని ఆయన ధీమా వెలిబుచ్చారు. పైగా ఇటీవలి కాలంలో కరెంటు ఫీజులు వంటి సమస్యలపై కేంద్రీకరణ పెరిగి జగన్‌పై విమర్శలను అందరూ తగ్గించడం కనిపిస్తుంది. ఆయనను ఎంత విమర్శించినా లాభం కలగడం లేదని అర్థమైన తెలుగు దేశం జగన్‌ తెలంగాణా రెండు సమస్యలను పక్కకు పంపించేందుకై వర్గీకరణ, తెలంగాణాపై స్పష్టత, బిసి డిక్లరేషన్‌ వంటి అజెండాలను తీసుకువస్తున్నది. ఇందులో వ్యూహం మరేదైనా వున్నప్పటికీ ఆచరణలో అదే జరుగుతున్నది. ఇదంతా జగన్‌ పార్టీకి నెత్తిన పాలు పోసిన చందమవుతుంటే వారు పార్లమెంటు ఎన్నికల అభ్యర్థులను ఖరారు చేస్తున్నామంటూ కథనాలు వదులుతున్నారు! అదీ సంగతి.

No comments:

Post a Comment