Pages

Monday, August 13, 2012

కిరణ్‌ సర్కార్‌కు మరో ధర్మాఘాతం



ధర్మాన ప్రసాదరావు రాజినామా అనివార్యమైందే తప్ప అత్యున్నత ప్రమాణాలకు నిదర్శనమని చెప్పుకోవడం అర్థం లేదు. ఇప్పటికే వరస సంక్షోభాలతో అతలాకుతలమవుతున్న కిరణ్‌ కుమార్‌ సర్కారుకు ఇది తాజా దెబ్బ. గతంలో ఇలాటి సందర్భాలలో సమర్థన తప్ప లేశమైనా ఆత్మ పరిశీలన ప్రక్షాళన చేసుకోలేదు గనక ఇప్పుడైనా అలాటిదేమీ జరిగే అవకాశమే లేదు. కాకపోతే వ్యాన్‌పిక్‌ వ్యవహారంలో అక్రమాలే లేవని మొండిగా వాదించడం వాస్తవ విరుద్ధం. మొదట కుదిరిన ఒప్పందాన్ని మార్చడం దగ్గర్నుంచి ఏకపక్షంగా రస్‌ఆల్‌ఖైమా కమ్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌కు మేళ్లు చేయడం వరకూ ఇందులో అనేక రకాలైన అక్రమాలున్నాయి. ఆ భూములు ఎవరివి, ఏ ప్రాతిపదికన తీసుకుని ఎంత పరిహారం ఇచ్చారు. ఎంత చూపించారు వగైరా వాదనలన్ని హాస్యాస్పదమైనవి.ఆ రోజుల్లో ప్రకాశం జిల్లాను ప్రకంపింప చేసిన వ్యాన్‌పిక్‌ పాపం ఇప్పటికైనా బద్దలు కావడం ఆహ్వానించదగింది. రెవెన్యూ మంత్రికి ఎకరా భూమి కూడా ఇచ్చే అధికారం లేదని మంత్రి వాదించడం మరింత విడ్డూరంగా వుంది. ఇప్పటికే విచారణ నెదుర్కొంటున్న మంత్రులతో పాటు ఈయనకు కూడా (అ)న్యాయ సహాయం అందుతుందనడంలోనూ సందేహం లేదు. మొత్తానికి ఉభయ కాంగ్రెస్‌లు ఒకే కొసకు చేరుకుంటున్న తీరుకు ఇవన్నీ నిదర్శనాలు. గతంలోనే రాసినట్టు కాంగ్రెస్‌కు రాజకీయ హాని కలగకుండా చూడాలంటే వైఎస్‌ హయాంలో వ్యవహారాలన్నిటినీ సమర్థించుకోవలసిందే. ఆ క్రమంలో జగన్‌పై కేసు నీరసించినా నీరు గారినా ఏలిన వారికి పెద్ద అభ్యంతరం వుండదు.


1 comment:

  1. ధర్మాన ఆ దీనమైన ముఖం చూస్తే, ఏదో ప్రజాసేవ చేసుకునే అదృష్టాన్ని కోల్పోయినవాడిలా త్యాగమయుడుగా అనిపిస్తూ గుండెలు పిండిచేస్తున్నాడండి. సబితకు టోకన్ నంబర్ ఏమిటో A3/A4? :)

    ReplyDelete