గుజరాత్ మారణకాండలో పరమ పైశాచికమైన నరోదా పాటియా హత్యాకాండలో మాజీమంత్రిణి మాయాబెన్ కొందనాని,భజరంగదళ్ కన్వీనర్ బాబూ భజరంగ్‌జీతో సహా 32 మందికి శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జ్య్యోత్స్నా యాగ్నిక్ ఇచ్చిన తీర్పు సంచలనాత్మకమైంది. వీరే గాక బిజెపి విహెచ్‌పి వంటి సంస్థలకు చెందిన పలువురు స్థానిక నాయకులు ఈ శిక్ష విధింపబడిన వారిలో వున్నారు. కసబ్‌కు ఉరి శిక్ష ఖాయమైన రోజునే ఇది కూడా రావడం యాదృచ్చికమైనప్పటికీ నర హంతకులకు మతాల తేడా వుండదని తెలియడానికి దోహదపడింది. 2002లో గోద్రా రైలు పెట్టె ధగ్గం ఘటనను సాకుగా చూపి సాగించిన జాతి హత్యాకాండలో నరోదా పాటియా మారణహౌమం చాలా తీవ్రమైంది. ఇక్కడ 97 మంది ముస్లిములను వూచ కోత కోశారు. 2002 ఫిబ్రవరి28న విహెచ్‌పి బంద్ పిలుపుపై 5000 మంది అక్కడ చేరి రాక్షస కాండ సాగించారు.పోలీసులకు 94 శవాలు దొరికాయి. ఈ ఘోరకలితో సహా వేలాది మంది హత్యాకాండకు బలైనప్పటికీ ఇసుమంత పశ్చాత్తాపం లేని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు కూడా సమర్థించుకోవడం ఏమీ ఆశ్చర్యం కలిగించదు. అయితే ఆ తరహా మాటలే ఎల్లకాలం చెల్లుబాటవుతాయనుకోవడం కూడా పొరబాటే. తనను స్వంతపార్టీవారే ప్రధాని అభ్యర్థిగా ఆమోదించలేకపోతున్నా మోడీ కళ్లు తె రవడం లేదు.మరోవంక కార్పొరేట్ మీడియా అమెరికా సెనేట్ విదేశాంగ విభాగం వంటివి మాత్రం దేశ రాజకీయాలను మోడీ రాహుల్‌ల మధ్య పోటీగానే చూపించే ప్రయత్నం కొనసాగిస్తున్నాయి.!
Thursday, August 30, 2012
గుజరాత్ హంతకులకు గుణపాఠం

Subscribe to:
Post Comments (Atom)
Sir,నరోదా పాటియా హత్యాకాండలో ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు భారత దేశం లో న్యాయ వ్యవస్థ కుల మతాలకు అతీతంగా పని చేస్తుందనే నమ్మకాన్నీ, న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్నీ పెంచుతోంది.
ReplyDelete