Pages

Saturday, August 4, 2012

రాయలసీమలో బాబుకు కొత్త సవాలు



బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమ వాదంతో చేస్తున్న నిరాహారదీక్ష ఇప్పటికే చిక్కుల్లో వున్న తెలుగు దేశంకు కొత్త సవాలని చెప్పాలి. తెలంగాణాలోనూ కోస్తాంధ్రలోనూ ఇప్పటికే పలువురు ఆ పార్టీని వదలి వెళ్లారు. ఆ విధంగా చూస్తే రాయలసీమలో శోభా నాగిరెడ్డి వంటి వారు గతంలోనే నిష్క్రమించగా ఉప ఎన్నికల్లోనూ ఓటములు ఎదురైనాయి. ఇలాటి పరిస్థితుల్లో బైరెడ్డి కొత్తగా సీమ వాదం తీసుకురావడం నిరాహారదీక్షతో కార్యాచరణకు దిగడం సరికొత్త సంకటమే.తెలంగాణా ఫోరం నేతలు దీనిపై ఎలా స్పందిస్తారనేది ఒకటైతే అధినేత ఇచ్చే స్పష్టతకు దీనివల్ల కలిగే ఆటంకం మరొకటి. పైగా ఆయన కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వారు కావడం అదనపు ఇబ్బంది. ఒకవేళ కర్నూలు జిల్లా తెలుగు దేశం అద్యక్షుడు చెప్పినట్టు నిజంగానే దీన్ని వ్యక్తిగత వ్యవహారంగా తీసుకుంటే అప్పుడు బైరెడ్డి స్వంత వేదికకు బలం చేకూర్చినట్టు అవుతుంది.ఇప్పటికే రాయలసీమలో సామాజికంగా జగన్‌ వర్గం గట్టి సవాలు విసురుతున్న నేపథ్యంలో ఈ పరిణామం వల్ల మరో గండి పడకుండా ఏం చేస్తారో చూడాల్సిందే. ఈ దీక్షను ఉపేక్షిస్తే అప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ ఇలాటివే తలెత్తవచ్చు. దాంతో అధినేత ఇస్తానంటున్న స్ఫష్టతకు విలువ లేకుండా పోవచ్చు. రాయలసీమలో స్వంత పునాది పెంచుకోవాలనుకుంటున్న నాయకులు ఈ వాదనను బలపర్చే అవకాశం వుంటుంది గాని బైరెడ్డికి ఆ స్థానం ఇవ్వడానికి వారు సిద్ధపడతారా అనేది మరో ప్రశ్న. సిద్ధాంతాలు గాని నికరమైన విధానాలు గాని లేని వ్యక్తులు శక్తులు ఏదైనా చేయొచ్చు. కనక ఇది తెలుగు దేశంకు తర్వాత కాంగ్రెస్‌కు కూడా ఇరకాటమే.

1 comment:

  1. ఎంత అమాయకులండీ మీరు. బైరెడ్డి "దీక్ష" తెలంగాణాను అడ్డుకోవాలని చంద్రబాబు తదితర ఆంద్ర నాయకులు వేసే కుప్పిగంతులలో భాగమే.

    ReplyDelete