Pages

Saturday, September 8, 2012

విషాద మూర్తిపై వివాదమేల?


ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను విషాదమూర్తి(ట్రాజిక్‌ ఫిగర్‌) అని వాషింగ్టన్‌పోస్టు వార్త రాసినందుకు కాంగ్రెస్‌ వాదులే గాక కొంతమంది ఇతరులు కూడా తీవ్ర అభ్యంతరాలు వెల్లడిస్తున్నారు.ఇదేదో దేశ గౌరవానికి సంబంధించిన అంశంగా చిత్రిస్తున్నారు. నిజానికి ఈ బ్లాగులో అనేక సార్లు చర్చించినట్టు విధాన పరంగా అమెరికాకు సాగిలబడినప్పుడు, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం, భారత రాయబారి నిరుపమా రావు, షారుక్‌ఖాన్‌లతో సహా మన దేశ ప్రముఖులు అనేకమందిని అవమానించినప్పుడు మనం గట్టిగా ప్రతిఘటించింది లేదు. ఇటీవల ఒబామా చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించాలంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడినా మౌనంగానే వున్నాము.ఇన్నిటి తర్వాత మన్మోహన్‌పై ఆ పత్రిక ఢిల్లీ విలేకరి సైమన్‌ డెన్యర్‌ ఏదో రాస్తే వేశారని ఎందుకు ఉలిక్కిపడటం? గ్లోబల్‌ విలేజి అంటూ ప్రపంచీకరణను ఆకాశానికెత్తేవారు ఇలా చేయడం సబబేనా? అమెరికా విదేశాంగ ప్రయోజనాలను అక్కడి కార్పొరేట్‌ పత్రికలు ప్రతిబింబిస్తాయని ఇంతకు ముందు తెలియదా? 2అవినీతి పరులను కూడా మంత్రులుగా కొనసాగించక తప్పడం లేదని మన్మోహన్‌ స్వయంగా చెప్పుకుంటే, వరుసగా కుంభకోణాల పరంపరలో ఉక్కిరి బిక్కిరవుతుంటే ఆయనను అపహాస్యం చేయడంలో అసహజత ఏముంది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.గతంలో అమెరికా అద్యక్షుల ప్రశంసలకు పరవశించిన వారు, ఆ పత్రికల వర్ణనలకు పొంగిపోయిన వారు ఇప్పుడు విమర్శించినందుకు గింజుకుంటే ఎలా కుదురుతుంది?ఇంట గెలవకుండా రచ్చ గెలవడం ఎప్పుడూ సాధ్యమవుతుందా?

1 comment:

  1. @అవినీతి పరులను కూడా మంత్రులుగా కొనసాగించక తప్పడం లేదని...
    వరుసగా కుంభకోణాల పరంపరలో ఉక్కిరి బిక్కిరవుతుంటే ...
    అపహాస్యం చేయడంలో అసహజత ఏముంది?
    భారీ..భారీ..కుంభకోణాలను చూస్తూ కూడా ఈయన్ని సమర్ధించాలా?ఈయన మంచివాడు కాబట్టి జరిగిన అవినీతినీ ..ఆయన అసమర్ధతను..నిలదీయకూడదా?
    తప్పుడు పనులు చేస్తూ కాంగ్రెస్ ఈయన్ను అడ్డం పెట్టుకుని బండి లాగించేస్తూదిగా?

    ReplyDelete