Pages

Thursday, August 9, 2012

సోనియా కోప సందేశంలో సంకేతాలేమిటి?





లోక్‌సభలో తమ పార్టీకి చెందిన తెలంగాణా ఎంపిలపై సోనియా గాంధీ బహిరంగంగా ఆగ్రహం ప్రకటించడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? అధికారాన్ని అన్ని విధాల కాపాడుకోవడానికి సహకరిస్తూ మరో వైపున ప్రాంతీయ స్మరణలోనూ పోటీ పడే టి కాంగ్రెస్‌( నిజానికి అదొక మిథ్య, టి ఎ ఆర్‌ ఇన్ని రకాలు లేవు) ఎంపిల ద్వంద్వ క్రీడకు ఇక స్వస్తి పలికినట్టే. ఆమె తమను ఏమీ అనలేదని అంటూనే ఇకపై సభలో ఆందోళనలు చేయబోమని కూడా మంచి బాలుళ్ల తరహాలో చెప్పేశారు. అంటే ప్రాంతీయ వ్యూహాలపై అధిష్టానం ఒక నిర్ధారణకు వచ్చినందునే సోనియా అలా వ్యవహరించారని అనుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఇంత కాలం నిరసన ప్రహసనాలు కూడా అధిష్టానం ఆశీస్సులతోనే జరిగాయనుకోవాలి. మా అధినేత్రి మమ్మల్ను ఏమన్నా అనొచ్చు అంటే అదొక రీతి కాని అసలేమీ అనలేదని సమర్థించుకోవడం మాత్రం హాస్యాస్పదం.
టి కాంగ్రెస్‌ వారి సంగతి అటుంచి టిఆర్‌ఎస్‌ అధినేత సంకేతాలకు ఈ పరిణామానికి ఏమైనా పొసుగుతుందేమో చూడాలి. ఢిల్లీ నుంచి ఏ మాట రాకుండా ఇక్కడ ఎవరు ఏమి చెప్పినా ఏ విన్యాసాలు చేసినా వ్యర్థమని కూడా గ్రహిస్తే మంచిది.

1 comment:

  1. నమస్తె రవి అన్న ... మీరు చెప్పినది పరిస్థితులకు అనుగునంగా వున్నవి.కంగ్రెస్స్ పార్తి తన అస్థిత్వాన్ని నిలబెత్తుకొవతానికి ప్రాంతియ ఉద్యమాలను రెచ్చగొదుతుందని అర్థమైంది. దీనిని ప్రజలు అర్థం చెసుకొవలి. muralimohan, Kurnool.

    ReplyDelete