Pages

Thursday, March 10, 2011

బ్లాగు మిత్రులకు....


1. దాడిని ఖండించడంపై ఏకాభిప్రాయం స్పష్టం.కర సేవకులైన తాలిబాన్లయినా, లేక శివ సైనికులైనా అసహనం, విధ్వంసం, అప్రజాస్వామిక ధోరణలు గురించిన ప్రస్తావన ఇది. సందర్భాన్ని వదలి దానిపై సంవాదం మరల్చడం సమస్యను దారి తప్పిస్తుంది.
2.తెలుగు ప్రజల ప్రత్యేకించి తెలంగాణా ప్రజల లౌకిక ప్రజాస్వామిక సంప్రదాయాలకు ఇది పొసగదనీ, ఈ ఘటనలపై నాయకత్వం వహిస్తున్నామనుకునే వారితో సహా అందరూ ఆందోళన చెందడం అవసరమనీ నా అభిప్రాయం.
3.కొందరు వ్యాఖ్యాతలు అనుచిత పదాలు వాడినా నేను స్పందించ దలచ లేదు. అలాగే చర్చల్లో కొందరు నేతలు ఆత్మహత్యలకూ విధ్వంస కాండనూ పోటీ పెట్టి మాట్టాడ్డంలోనూ ఔచిత్యం లేదు. ఇంత కన్నావిలువైన ప్రాణాలను తామే తీసుకునే పరిస్తితి కల్పించిన దోషం కూడా ప్రధాన పార్టీల నేతలదే. ఇదిగో అదిగో అంటూ భ్రమలు గొల్పిన వారూ ఇందుకు బాధ్యులు కాకపోరు.
4. అన్నిటినీ మించి రాష్ట్ర విభజనపై నిర్ణయం రాజకీయ సమస్య కాగా దాన్ని ఆవేశకావేశాల వైపు,భావోద్వేగాల వైపు మరల్చి రాజకీయ సోపానాలు వేసుకున్న నేతలు మరింతగా బాధ్యత వహించక తప్పదు.ఇప్పటికే ఆ ఛాయలు కనిపిస్తున్నాయి. ే ఈ ధోరణులు రేపు వారి పైకి మరలినా ఆశ్చర్యం లేదు.
5.ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల విధ్వంసం గురించి కొన్ని సంస్థలు కొందరు వ్యక్తులు చాలా సార్లు ప్రకటనలు చేసిన నేపథ్యంలో పోలీసులు వాటిని రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఎందుకు చేయలేదన్నది కూడా ప్రశ్నార్థకమే.

బ్లాగు మిత్రులకు- చిన్న పేరాలు, తేలికైన వాక్యాల గురించి పదే పదే వస్తున్న సూచనలు ఇకపై పాటిస్తాను. సమయం లేక పోవడం వల్ల పత్రికల్లో రాసిన వ్యాసాలను యధాతథంగా ఇవ్వడం ఈ సమస్యకు కారణం. దీనికోసం ప్రత్యేకంగా రాస్తాను.
ఇకపై ఇంగ్లీషులోనూ కొన్ని వ్యాఖ్యలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.
రెండు రోజులు వుండటం లేదు గనక తాజా పర్చడం,జవాబులివ్వడం ఆ తర్వాతే.

6 comments:

  1. తాజా పర్చడం ? :D

    ReplyDelete
  2. praSnalu emi levu ippuDu samadhaanamE kaavalsiMdi avunu vakf boardlanu,churchi lanu sommuladakkundaa ttd nunchi dabbulu dochi haj yatralaku,israel yatralaku pampe telugu loukikukulu normusukoni indlalo nidrapondi ...telakapalli vaari telividi......veera mana medhavulu ---thu..siggu chetu

    ReplyDelete
  3. దాడిని కండించే విషయం లో ఎవరికైనా మరో అభిప్రాయం ఎందుకు ఉంటుంది .కర సేవకులైనా ,తాలిబన్లైన ,సివసైనుకులైనా ,కంమునిస్ట్ లైనా ,మాఓఇస్ట్ లైనా ,అసహనం విద్వంసం అప్రజాస్వామిక ధోరణులు కనబరిచినప్పుడు అందరం వెతిరేఖిన్చాల్సిందే .కాకా పోతే పాక్షిక సత్యాలను ప్రచారం చేస్తే నే ఇబ్బంది .
    నిన్న జరిగిన్ సంఘటన ద్వారా లౌకిక సంప్రదాయాలు ఎ రకంగా దెబ్బ తిన్నాయి?నాయకత్వాన్ని సంఘటన స్థలానికి చేరుకోనియక పోవటంవల్ల ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందని అందరు అంటుంటే ,మీరు నాయకత్వం వహించిన వాళ్ళు ఆందోళన చెందలంతారే.అంటే మీ ఉదేశ్యం పోలీసులు మరియు ప్రబుత్వం అనా?
    ఆత్మహత్యలకు విద్వంసకాండ కు పోటిపెట్టి మాట్లాడటంలో ఔచిత్యం లేదు.నిజమే .కాని విస్మరించి మాట్లాడటం న్యాయం కాదు .ప్రధాన పార్టీ లదే దోషం .అధీ నిజమే .పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నప్పుడు నిజాలను ప్రజలకు చెప్పి న్యాయం పక్షాన నిలబడాల్సిన మేధావులు పాక్షిక సత్యాలను ప్రచారం చెయ్యటం ,సొంత సైన్యం మరియు సరిహద్దులు లేని పరిపాలన విభజనని భూతద్దంలో చూపించి ప్రజలను భయ బ్రాన్తులకు గురి చేయటం అమానుషం .

    ReplyDelete
  4. రవి గారు..

    ట్యాంక్ బండ్ దాడి అందరూ ఖండించాల్సిందే.. ఈ విషయంలో తెలంగాణా ప్రజలు కూడా ఇదే ఉద్దేశ్యంతో ఉన్నారని అనుకుంటున్నాను.

    మీ శ్రీశ్రీ జయభేరీ చదివాను(మిమ్మల్ని పుస్తకావిష్కరణ సభలో కలిసాను), చాలా బాగా శ్రీశ్రీ గురించిన అన్ని విషయాలు పొందుపరిచారు. మీరు రాజకీయానికి సంభందించి శ్రీశ్రీని సిపియం దృష్టితో చూసినట్లుగా అనిపించింది.

    విశాఖ విరసం సభలకి నేను కూడా హాజరయ్యాను, అందులో హరగోపాల్ గారు శ్రీశ్రీ ఎందుకో తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించాడు అంటే ఆ సభలో మరెవరో తర్వాత కాలంలో ఆయన తెలంగాణాకి మద్దతు తెలిపాడు అన్నట్లుగా మాట్లాడారు. ఈ రెండింటిలో ఏది నిజమో నాకు తెలియట్లేదు.

    ఏది ఏమైనా శ్రీశ్రీ లాంటి మహానుభావుల విగ్రహాలను ధ్వంసం చేయడం ఉగ్రవాదంతో సమానం. దేశం ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా ప్రభుత్వాలు అనుసరించే ప్రపంచబ్యాంకు విధానాలు, బూర్జువా వ్యవస్థ మారనప్పుడు ప్రయోజనం శూన్యమని నా నమ్మకం. మీరేమంటారు??

    ReplyDelete
  5. శరత్‌ చంద్ర గారూ,

    శ్రీశ్రీ జయభేరి చదివినందుకు సంతోషం. మిగిలిన అన్ని విషయాలూ సాకల్యంగా పరిశీలించినట్టే సిపిఎం పట్ల శ్రీశ్రీ స్పందనను కూడా ఒక క్రమపద్దతిలో అందించే ప్రయత్నం చేశాను, అంతే. ఎందుకంటే పరంపరగా వెలువడిన సంపుటాలలో ఈ భాగాలు సరైన కోణంలో రాలేదు గనక. మీరు రాష్ట్రం విషయంలో శ్రీశ్రీ వైఖరి గురించి ప్రొపెసర్‌ గారు మాట్టాడింది రాశారు. నిజమే. శ్రీశ్రీ సమైక్యతనే కోరుకున్నాడు. ఆ అంశంపైనే విరసంతో విభేదించాడు, చాలా రాశాడు కూడా. నేను ఆ వివరాలన్ని ఏకరువు పెట్టలేదు కాని ఇప్పుడు వారు విభజన కోసం కృషి చేయడమే ఆయన ఆశయాలకు నివాళి అంటుంటారు. కనక ఆయన రాతల ఆధారంగా వాస్తవిక అంచనా అందించేందుకు యత్నించాను. ఈ కారణంగా కొందరు నాపై ముద్రలు వేసినా సత్యం మారదు కదా..
    త్వరలో శ్రీశ్రీ జయభేరి ద్వితీయ ముద్రణ వస్తుంది. అప్పుడు ఏవైనా సవరణలు వుంటే చేసి మెరుగుపర్చడానికి ప్రయత్నిస్తాను. మీరు కూడా పంపించగలరు.

    ReplyDelete
  6. రవి గారు,


    పుస్తకంలో అదనపు సమాచారం కోసం అంకెలు ఉన్నచోట సమాచారాన్ని ఆ అధ్యాయం చివరన కాకుండా ఆ పేజీ కింద ఇవ్వగలిగితే చదువరులకు సౌకర్యంగా ఉంటుంది. ఇది పెద్ద విషయం కాకపోయినప్పటికీ చదువుతున్న సమయంలో కాసింత ఇబ్బంది కలిగించేదే! దీనిని కొంచెం దృష్టిలో పెట్టుకోగలరు.

    ప్రస్తుతం మా నాన్నగారు ఆ పుస్తకాన్ని చదువుతున్నారు, ఆయన అభిప్రాయాలు కూడా మీకు త్వరలో తెలియజేస్తాను.

    ReplyDelete