ఆగష్టు పదిహేను ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం అన్ని తప్పులు తడబాట్లతో సాగడం భాషాభిమానులకు మాత్రమే గాక ప్రతివారికీ ఇబ్బంది కలిగించింది. ఇక్కడ సమస్య పదాలు చదవ లేకపోవడం కాదు,ఉచ్చారణ దోషాలు నేరమనీ కాదు. ఒక రాష్ట్రాధినేత మాతృభాష విషయంలో ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. మహౌపన్యాసకుడైన చర్చిల్ అంతటి వాడు ప్రసంగాన్ని ముందుగా అకళింపు చేసుకుని బయిలు దేరే వాడని చరిత్ర చెబుతున్నది. రాజకీయ విధానాలు పాలనా సమస్యలు పరిష్కరించడం సంగతి ఎలా వున్నా వ్యక్తిగతంగా ఇలాటి చిన్న చిన్న అంశాలనైనా సరిచేసుకోకపోతే ఎలా? నిజానికి రాజకీయంగా కొన్ని కీలకమైన సానుకూల ఫలితాలు సాధించిన ముఖ్యమంత్రి ప్రసంగ పఠనంలో ఇలా అపహాస్యానికి అవకాశం ఇవ్వడం దిద్దుకోగలిగిన దిద్దుకోవలసిన పొరబాటే.వాగ్ధాటి ఒక్కటే నాయకులకు కొలబద్ద కాదు గాని వాక్శుద్ధి మనుషులను అంచనా వేయడంలో చాలా పాత్ర వహిస్తుంది. ఈ సారి అగష్టు 15 దాకా ఆగకుండా ఆ లోపలే ఈ లోపాన్ని ఆయన సరిదిద్దుకుంటారని ఆశించాలి.
Monday, August 15, 2011
ముఖ్యమంత్రి తడబాటు... దిద్దుకోవలసిన పొరబాటు ...

Subscribe to:
Post Comments (Atom)
గతం లో ఛీఫ్ విప్ గా ఉన్నప్పుడు బాగానే మాట్లాడేవాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాయరోగం వచ్చిందో? అప్పుడున్న స్వేచ్చ ఇప్పుడు లేకపోవటం వల్ల, అతి జాగర్త వల్ల కాబోలు..
ReplyDeleteఒకసారి ఈయనకు ఆస్కార్ అవార్డ్ వచ్చిన The King's Speech సినిమా చూపించాలి. అప్పుడైనా సాధన చేసి మెరుగౌతాడేమో..
రాష్ట్రకాంగ్రెస్ లో ఈమధ్య ఒక టెఱ్ఱర్ వాతావరణాన్ని సృష్టించారు అధిష్ఠానంవాళ్ళు. ఏ పనైనా సొంతగా చేస్తే, లేదా ఏ ముక్కయినా సొంతగా మాట్లాడితే తమని జగన్ వర్గం అనుకుంటారేమోనని హడిలిపోతున్నారు కొందరు కాంగ్రెస్ వాదులు. ఈ మనస్థితి వీళ్ళ తడబాట్లలో ప్రధానపాత్ర పోషిస్తోంది.
ReplyDeleteఅధిష్ఠానం ఎంత కిందామీదా పడ్డా, ఎన్ని చేసినా రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం ఏదో ఒకరోజున జగన్ గుప్పిట్లోకి వెళ్ళిపోయేది ఖాయం అనిపిస్తున్నది. By the way, నేను జగన్ అభిమానిని కానేకానని తెలియజేసుకుంటున్నాను,