రాజ్యాంగ పరంగా ప్రతిభా పాటిల్ ప్రథమ మహిళ అయినప్పటికీ రాజకీయ వాస్తవాల రీత్యా అతి శక్తివంతమైన ప్రథమ మహిళ సోనియా గాంధీ. ఆమెకు అనారోగ్యం ప్రాప్తించి ఆపరేషను దాకా వెళ్లడం అనూహ్య వార్తగా వచ్చింది.అయితే మీడియాలో ఇలాటి సూచనలు వస్తూనే వున్నాయి.నేడున్న వైద్య పరిజ్ఞానంతో ఆమె చికిత్స జయప్రదం కావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కాకపోతే ఈ లోగా పార్టీ వ్యవహారాల కోసం నలుగురితో వేసిన కమిటీ రాహుల్ నాయకత్వ శకానికి నాంది పలుకుతున్నట్టు కనిపిస్తుంది. ప్రణబ్, చిదంబరం వంటి వారిని కాదని తన తనయుడినే నియమించడంలో సోనియా స్పష్టమైన సంకేతాలే ఇచ్చారు. ఇది ప్రస్తుత దశలో చూపించే ప్రభావం కంటే భవిష్యత్తుకు ఇచ్చే సూచనలే ప్రధానమైనవి. నిజానికి రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని ఆహ్వానిస్తూ కాంగ్రెస్ వందిమాగధులు ఎప్పటినుంచో హడావుడి చేస్తున్నారు.సోనియా గాంధీ ప్రధాని పదవి తిరస్కరించినప్పటి నుంచి ఆమె లక్ష్యం రాహుల్ రాజ్యమేనని కూడా రాజకీయ పరిశీలకులందరికీ తెలుసు. ఆ క్రమంపై అధికార ముద్ర పడటానికి ఈ సందర్భం ఉపయోగపడింది.అంతే.
Friday, August 5, 2011
రాహుల్ అధినాయకత్వానికి అరంగేట్రం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment