Pages

Monday, August 29, 2011

జగన్‌కు భాజపా మద్దతులో మతలబులు


సిబిఐ దర్యాప్తులు, దాడులతో అష్ట దిగ్బంధనంలో చిక్కిన జగన్‌కు భారతీయ జనతా పార్టీ నేతలు సంఘీభావం తెల్పడం వూరట కన్నా ఇబ్బందినే కలిగిస్తుంది. ఆయనపై రాజకీయ కక్షతో దాడులు చేస్తున్న కాంగ్రెస్‌ను విమర్శించడమే తమ ఉద్దేశమని బిజెపి చెప్పొచ్చు గాని దాన్ని ఎవరూ తీవ్రంగా తీసుకోరు.ఎందుకంటే ఏ సమయంలో ఏ మాట ఏ అర్థమిస్తుందో తెలియని అమాయకులు వుండరు. అవినీతి ఆరోపణల విషయంలో బిజెపి ఎప్పుడూ పెద్ద పట్టింపుగా వుండదు గనకే ఈ సమయంలో కూడా సూటిగా వత్తాసు పలికింది. పైగా ఉభయులకూ మధ్య అనుసంధాన కర్తగా గాలి జనార్థనరెడ్డి అటు సంఘ పరివారానికి ఇటు వైఎస్‌ పరివారానికి ఉమ్మడి మిత్రుదుగా వుండనే వున్నారు.అయితే కడప ఉప ఎన్నికల నుంచి సిబిఐ దర్యాప్తు తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూల వరకూ జగన్‌ తాను బిజెపిని వ్యతిరేకిస్తానని,ఇంకా చెప్పాలంటే అదొక్కటే తనకు వ్యతిరేకమని(జాతీయ సా ్తయిలో అని జోడింపు) ఢంకా బజాయించి చెప్పారు. ఆయనే ఇప్పుడు బిజెపిని చూసి కాంగ్రెస్‌ సిగ్గు తెచ్చుకోవాలని అంటున్నారు. అంటే బిజెపి మాటలను ఆహ్వానిస్తున్నారన్న మాట. ఆయన తరపున వాదించింది కూడా బిజెపి ఎంపి రామ్‌జెత్మలానీనే కావడం గమనించదగ్గది. సుడిగుండంలో ఆసరాగా బిజెపి ఆయనకు కనిపిస్తే ఆ పార్టీ స్థితి ఇంకా ఘోరం. ఎన్‌డిఎ అని గొప్పగా చెప్పుకునే కూటమిలో ఇప్పుడు శివసేన,జెడి(యు) తప్ప పెద్ద పార్టీలేవీ లేవు. అందుకే ఎక్కడ ఎవరు దొరుకుతారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నది. జనాదరణ గల జగన్‌తో జట్టు కడితే రాష్ట్రంలో మళ్లీ నాలుగు సీట్లు తెచ్చుకోవచ్చన్న ఆరాటం ఆ పార్టీది. కాకపొతే ఈక్రమంలో ఉభయులూ విశ్వసనీయత పోగొట్టుకుంటున్నారనేది నిజం.

6 comments:

 1. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 2. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 3. నది లో కొట్టుకు పోయే వాడికి గడ్డిపరక కూడా పెద్ద ఆసరా గా కనబడుతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాగూ తమ పార్టీకి ఉనికి లేదు. కనీసం తెలంగాణా లో టీఅరెస్ తోనూ, కోస్తా, రాయలసీమలలో వైయస్సార్ కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకొని రాబోయే ఎన్నికలు అనే గండాన్ని ఈదడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం అంటే ఇదే. ఎదుటివారు ప్రధానమంత్రి తో సహా అందరూ దొంగలుగా కనబడతారు కానీ తమని నమ్ముకొన్న బంట్లకు, తాము సమర్ధించే జగన్ లాంటి అవినీతి పరులకు నిజాయితీ వీరి కళ్లకు కొట్టొచ్చినట్లు, లేదా వారిని వేధింపులకు గురి చేస్తున్నట్లు కన్పిస్తుంది. భారతీయ జనతా పార్టీకి కొంచెం కన్ను మసక అందుకనే ఈ విధమైన ప్రవర్తన.

  ReplyDelete
 4. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 5. This comment has been removed by a blog administrator.

  ReplyDelete
 6. This comment has been removed by a blog administrator.

  ReplyDelete