హైకోర్టు తీర్పుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన రెడ్డి చేసిన వ్యాఖ్యలలో కొత్తదనం ఏమీ లేదు. ఉండే అవకాశం కూడా లేదు. ఈ వాదనలన్ని హైకోర్టులో ఆయన లాయర్లు అనేక సార్లు వినిపించారు. ఆఖరుకు చెప్పిందే చెప్పొద్దని కోర్టు మందలించింది కూడా. ఆ తర్వాతే ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నాయంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది. దీని పూర్వాపరాలు గత ఎంట్రీల్లో పరిశీలించాము. ఇప్పుడు కొత్తగా చెప్పిన దాంట్లో కూడా ప్రతి ఎకరా కేటాయింపునకూ వైఎస్‌తో పాటు మంత్రులందరూ బాధ్యులని ఆయన అన్నారు.అదే ఘనత పథకాల విషయంలో ఇవ్వడానికి సిద్దంగా లేరు. ఆ సంగతి అలా వుంచితే చనిపోయిన వైఎస్‌ను తప్పు పట్టకూడదని ఒక వైపున చెబుతున్న జగన్ బతికున్న మంత్రుల బాధ్యత గురించి ఎలా ప్రశ్నించగలరో అర్థం కాదు.తప్పే లేకపోతే ఎవరిదీ లేనట్టే. వుంటే అందరిదీ. అందులో మృతులను మినహాయించి జీవితులైన ఉపగ్రహాలనే జవాబు దారి చేయడం ఎలా సాధ్యం? ఇక ప్రభుత్వ నిర్ణయాల వల్ల లాభం పొందిన వారు పెట్టుబడులు పెట్టారనేది ప్రాథమిక నిర్ధారణ. ఈ రెంటికీ సంబంధం లేదని ఆయన నిరూపించుకుంటే మంచిదే. రాష్ట్రానికి రాజకీయాలకు సంబంధించిన ఈ సమస్యను కేవలం రామోజీ పత్రిక ఈనాడుకూ తమ సాక్షికి మద్య వివాదంగానే చూపించడం మాత్రం వాస్తవికత అనిపించుకోదు. సుప్రీం కోర్టుకు వెళ్తారు గనక అక్కడ ఏమైనా తీర్పు వస్తే అదే అందరికీ సమాధానమవుతుంది. ఇక బిజెపికి వ్యతిరేకమని ఆయన చేసిన ప్రకటన ఆహ్వానించదగిందే గాని ఆ వూపులోనే మిగిలిన ఎవరికీ వ్యతిరేకం కాదనడం కొత్త వ్యాఖ్యానాలకు ఆస్కారమిస్తున్నది.ఇది చేసిన ప్రకటనలో వున్న అస్పష్టత తప్ప వ్యాఖ్యానించేవారి పొరబాటు కాదు.
Monday, August 15, 2011
కొత్తదనం లేని జగన్‌వాదనలు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment