Pages

Tuesday, August 16, 2011

అరెస్టు అప్రజాస్వామికం.. ఆందోళన కరం



అవినీతిని ఒక్కసారిగా అరికట్టే మంత్రదండమేదీ తన వద్ద లేదన్న ప్రధాని దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారేపై రాజదండం ఝళిపించారు. నిరాహారదీక్ష సంకల్పాన్ని అడుగడుగునా అడ్డుకోవడమే గాక ఆఖరుకు ఆయనను దీక్షకు ముందే అరెస్టు చేసి అసహసనం ప్రదర్శించారు. అదే సమయంలో ఆయన నిరాహారదీక్ష మొదలైతే ఎలాటి పర్యవసానాలు కలుగుతాయో అన్న భయం కూడా ప్రభుత్వాన్ని పీడిస్తున్నది. అందుకే అన్నాపై దండకాలు చదివి దండయాత్రకు దిగారు. శాంతియుతంగా నిరాహారదీక్ష తలపెట్టిన ఆయనను ముందుగా అరెస్టు చేయడమంటే ప్రజాస్వామిక హక్కును కాలరాయడమే.దీనిపై దేశవ్యాపితంగా వ్యక్తమైన స్పందన చూసి(దాన్ని పరీక్షించడం కూడా ఒక ఉద్దేశం కావచ్చు)ఇప్పుడు విడుదల చేశారు గాని ఇందులో పెద్ద ఔదార్యం ఏమీ లేదు. అనివార్యంగా చేసిన నిర్ణయమే అది.ఏమైనా అవినీతి వ్యతిరేక పోరాటంలో అన్నా హజారే స్థానం మరింత బలపడటానికి ఈ చర్య దారి తీయడం తథ్యం. దాంతో పాటే ప్రజాస్వామిక హక్కులను పరిరక్షించుకోవాలన్న సృహ కూడా ఇనుమడిస్తుంది. అన్నా తో ఏ విధమైన తేడాలున్నా ఈ సమయంలో ఆయన ఇచ్చిన స్పూర్తికి అందరూ అభినందనలు అందజేస్తారు.

No comments:

Post a Comment