Pages

Friday, August 12, 2011

14 ఎఫ్‌ రద్దు సానుకూల పరిణామం



ఎట్టకేలకు ఎడాదిన్నర ఆలస్యంగానైనా కేంద్రం సూచనపై రాష్ట్రపతి 14 ఎఫ్‌ను రద్దు చేయడం హర్షణీయం. గత రెండేళ్ల ప్రతిష్టంభనలో వినిపించిన మొదటి స్పష్టమైన సానుకూల పరిణామం ఇది.ఇందుకు చొరవ తీసుకున్న ముఖ్యమంత్రిని అభినందించవచ్చు. ప్రాంతాల మధ్య ప్రజ్వలనానికి దీన్ని కూడా సాధనంగా చేసుకోవాలని అఖరి నిముషం వరకూ ప్రయత్నించిన కేంద్రం ఆలోచనలు విఫలమయ్యాయంటే ప్రజల సంయమనమే కారణం.దానిపై వేడి పెంచేందుకు అటూ ఇటూ కూడా ప్రయత్నాలు జరిగాయి.ఇంకా జరుగుతాయి కూడా. 14 ఎఫ్‌ కు చారిత్రిక నేపథ్యం ప్రత్యేకతలు ఏమిటి అన్న చర్చ అప్రస్తుతం. మిగిలిన వుద్యోగ నియామకాలు వేటికీ లేని మినహాయింపు నగర పోలీసు శాఖకే కొనసాగించడంలో తర్కం ఏమీ లేదు. దీని వల్లచుట్టుపక్కల జిల్లాలకే లాభం కలగడం వగైరా వాదనలన్ని చట్టం ముందు నిలిచేవి కావు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలు జోన్స్‌ సమస్యపై ఏ వైఖరి తీసుకున్నాయో దాని ప్రకారం 14 ఎఫ్‌ వుండటానికి అవకాశం లేదు. ఇంత కాలం తర్వాతనైనా రద్దు చేసినందుకు హర్షిస్తూ రేపటి పరీక్షలు ప్రశాంతంగా ముగిసిపోతాయని ఆశించాలి. ఇతర ప్రాంతాలలో నేతలు కూడా దీనిపై ప్రతిష్టంభన లేదా సంఘర్షణ పెరగకుండా చూడాలి. ఇంతకూ ప్రభుత్వ ఉద్యోగాలే తగ్గిపోతున్న నేటి తరుణంలో కొన్నివందల వుద్యోగాల కోసం ప్రాంతాలు ప్రజలు వివాదపడాల్సిన అవసరమే లేదు. ఇది దేశ వ్యాపిత సమస్య కూడా. కనక యువత విద్యా ఉద్యోగావకాశాల కోసం ఉపాధి విస్తరణ కోసం అందరూ కేంద్రీకరించి పోరాడటం మంచిది.

No comments:

Post a Comment