Pages

Monday, August 29, 2011

అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సవాళ్లు



వేయి కోట్లు ఇస్తే తన ఆస్తి రాసిస్తానని తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు అనడం సమాధానపర్చడం కన్నా సమస్యల సృష్టికే ఎక్కువగా దారి తీసింది. తనపై ఆరోపణల దర్యాప్తు చేసుకోవచ్చని ఆయన చాలా సార్లు ప్రకటించారు. అంతటితోనే ఆరోపణలు ఆగిపోవు కూడా. ఆ పాలనా కాలంలో పొరబాట్లను ఏడేళ్లు అధికారంలో వున్న కాంగ్రెస్‌, ఎందుకు నిగ్గు తేల్చలేదో తెలియదు. ఎప్పుడూ సిపిఎం వేసిన పుస్తకాన్ని ప్రస్తావించడం తప్ప తమ ప్రభుత్వ నివేదికలను వారెందుకు ఉటంకించలేకపోతున్నారు? చంద్రబాబుతో సహా ఎవరిపైనైనా ప్రజాస్వామ్యంలో ఆరోపణలు రావచ్చు. వారు సంజాయిషీ ఇచ్చుకోవచ్చు కూడా. అయితే ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు మరొకరి ప్రస్తావనలు అడ్డం వేయడం వల్ల ఉపయోగమేమిటి? సాక్షిలో రామోజీ చంద్రబాబుల గురించి పేజీల కొద్ది రాయడం ప్రచారానికే ఉపయోగపడుతుంది తప్ప ఆదుకునేది కాదని నేను చాలా సార్లు అంటుంటాను. చంద్రబాబు వీర విధేయులు కూడా అనుకోకుండానే ఈ వాదనలో కూరుకుపోవడంతో చర్చలు దారి తప్పుతుంటాయి. అయితే వేయి కోట్ల ప్రతిపాదన చేయడం ద్వారా బాబు కూడా అవతలి వారి దాడికి తనే సగం అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. తన ఆస్తి ద్వారా వెయ్యి కోట్లు వస్తే దాన్ని ట్రస్టుకు రాసిస్తానని ఆయన అన్నారు. ఈ మద్య వర్తులు మారుబేరాలు లేకుండా ఆయనే నేరుగా రాసేస్తే పోతుంది కదా అని ఒక చర్చలో అన్నాను. అదీ సంగతి!

No comments:

Post a Comment