Pages

Friday, August 24, 2012

పుకార్ల పూర్వాపరాలు, చారిత్రిక పాఠాలు


షేక్స్‌పియర్‌ హెన్రీ4 నాటకంలో పుకార్లను ఒక పాత్రగా సృష్టించాడు. ' నా నాల్కపైన నిరంతరం నర్తిస్తుంటాయి దుష్ప్రచారాలు/ నేను ఏ భాషలో మాట్లాడినా సరే/ వినేవాళ్ల చెవుల్లో అబద్దాలే నింపుతాను అంటుంది ఆ పాత్ర. వాల్మీకి రామాయణంలో సీతను గురించి కూడా ఎవరో ఏదో అన్నారన్న గూడచారి మాటలపైనే రాముడు ఆమెను అడవికి పంపిస్తాడు! పురాణాలలో ఇలాటి కథలెన్నో!
ఇంతకూ పుకార్లంటే ఏమిటనే దానిపై స్పష్టమైన నిర్వచనం లేదు. వెంటనే నిర్ధారించుకునే అవకాశం లేని మాట అన్న రీతిలో దాన్ని పిలవడంపై ఏకాభిప్రాయం వుంది. ప్రచార వ్యూహంలో ఒక భాగంగా దీన్ని ఉపయోగించడం జరుగుతుందని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి.ప్రత్యర్థుల స్థయిర్యం దెబ్బతీయడానికి మామూలుగా ఇలాటివి చేస్తుంటారు. సామ్రాజ్యవాదులు, ముఖ్యంగా ఫాసిస్టులు నిరంతరం పుకార్ల ఫ్యాక్టరీలే నడిపిస్తుంటారు. అబద్దం పదిసార్లు చెబితే నిజమవుతుందన్న గోబెల్స్‌ సూక్తి ఫాసిస్టు పథకంలో భాగమే. కమ్యూనిస్టులపైన ప్రగతిశీల శక్తులపైన, తమ దాడికి లక్ష్యమైన ప్రజాసమూహాలపైన నాజీలు నిరంతరం దుష్ప్రచారాలు సాగిస్తూనే వుండేవారు. అసలు హిట్లర్‌ రాజకీయాల ఆవిర్భావమే రీచ్‌స్టాగ్‌కు(జర్మనీ పార్లమెంటుకు) కమ్యూనిస్టులు నిప్పుపెట్టారనే దుష్ప్రచారంతో మొదలైంది. ఆ కేసులో నిందితుడుగా బోనెక్కిన డిమిట్రావ్‌ దాన్ని తుత్తునియలు చేశారు. యూదులను నిర్మూలించడం కోసం హిట్లర్‌ కూటమి ఎప్పటికప్పుడు ఏవో విష ప్రచారాలు చేస్తూనే వచ్చింది. దానివల్ల వారిలో భయాన్ని జర్మన్లలో ద్వేషాన్ని కలిగించింది. ప్రాణాలు అరచేతి పెట్టుకుని బతుకుతున్న యూదులను వూచకోత కోసేందుకు ఎప్పటికప్పుడు ఏవో వదంతులు వ్యాపింపచేస్తూ వారిని ఒక చోట చిక్కించుకుని హతమార్చడం ఒక రాక్షస క్రీడగా సాగింది.
అభివృద్ధి నిరోధక పాచిక
ఇదే పద్ధతిని అమెరికా బ్రిటన్‌ తదితర దేశాలు నేటికీ అనుసరిస్తున్నాయి. స్టాలిన్‌ మావో కాస్ట్రో వంటి వారిపై తాడూ బొంగరం లేని కథలు ప్రచారం చేయడం వారికి పరిపాటి. కాస్ట్రో చే గువేరాను చంపించేశాడని పెద్ద దుమారం లేవదీస్తే దాన్ని బాగా సాగనిచ్చి తర్వాత సాక్ష్యాధారాలతో సహా సుదీర్గ ప్రసంగం చేశారు( చూడండి: నా సృతిలో చే గువేరా పుస్తకం) అసలు కాస్ట్రోనే చనిపోయాడని ఎన్నిసార్లు ప్రచారం చేశారో లెక్కేలేదు. అమెరికాలో మెకార్థిజం
కాలంలో కమ్యూనిస్టులను వేటాడేందుకు నిరంతర నిందాప్రచారాలు సాగిస్తూ వచ్చారు.కమ్యూనిస్టులు భార్యలను జాతీయం చేస్తారంటూ ి ఎలాటి విష ప్రచారాలు చేస్తున్నారో కమ్యూనిస్టు ప్రణాళికలోనే గట్టిగా సమాధానమివ్వడం చూస్తాం. ఈ విధంగా అంతర్జాతీయ రాజకీయాల్లో అభివృద్ధి నిరోధకులు మొదటి నుంచి పుకార్లను ఒక ఆయుధంగా ఉపయోగించి నూతన శక్తుల పెరుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించడం జరుగుతూనే వచ్చింది. మార్క్స్‌ కాలంలోనే ఇవి ఎంత తీవ్రంగా వుండేవంటే వాటి వల్ల ఆయన తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారని జెన్నీ మార్క్స్‌ ఒక లేఖలో రాశారు.
రాజకీయాలను పెడతోవ పట్టించేందుకు వివిధ ప్రజా బృందాల మధ్య మతాలు జాతులు భాషలు తదితర విభజనలతో విద్వేషాలు రగిలించడం ఈ కుట్రలో భాగమే. ఈ పని హేతుబద్దంగా చేస్తే చెల్లుబాటు కాదు గనక లోపాయికారిగా అసత్య ప్రచారాలతో ఆందోళన పెంచి అలజడి సృష్టించడం జరుగుతుంది. పుకార్ల షికార్లు నిజానికి షికార్‌ అంటే వేట అనే హిందీ పదం అర్థంలో బాగా సరిపోతాయి. 9/11 న డబ్ట్యుటిసి భవంతి కుప్పకూలిన వెంటనే అరబ్బులు ఆనంద నృత్యం చేశారంటూ అంతర్జాతీయ ఛానెళ్లు ఒక దృశ్యాన్ని ప్రసారం చేశాయి.తర్వాత అది కల్పితమని తేలింది.అంతకన్నా చాలా కాలం కిందట దేశంలో రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళనలో ఆత్మాహుతిచేసుకుంటున్న వ్యక్తి ఫోటో దేశమంతా ప్రచురితమైంది. తీరా చూస్తే ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే అతన్ని రెచ్చగొట్టిన వ్యక్తి పక్కనే వుండి ఫోటో తీసి అందరికీ పంపించాడని నిర్ధారణ అయింది.ఇప్పుడు మార్ఫింగులు వగైరాల వల్ల అంతకంటే మోసపూరితంగా అబద్దాలు సృష్టించడం సాధ్యమవుతున్నది. అసోం మైనారిటీల విషయంలో అదే జరిగింది.
సోషల్‌ నెట్‌ వర్క్‌!
నిజానికి పుకార్ల వ్యాప్తికి సాంకేతిక పరిజ్ఞానానికి మొదటి నుంచి సంబంధం వుంటూ వస్తోంది.అచ్చు యంత్రం వచ్చాకనే ఘటనలను చిలువలు పలువలుగా ప్రచారంలో పెట్టే అవకాశం లభించింది.ముఖ్యంగా ప్రతి మతఘర్షణ సందర్భంలోనూ మృతుల సంఖ్య గురించి అతిశయోక్తులు అనివార్యంగా ప్రచారమై పోతాయి. అయోధ్యలో కరసేవకుల మరణంపై హిందీ పత్రికలు రాసిన అభూత కల్పనలు తర్వాత కాలంలో ఆధారాలతో సహా వె ల్లడైనాయి. మీడియా పోటీలో అవి ఇంకా అనేక రెట్లు పెరుగుతుంటాయి. పత్రికలు ఛానళ్లకు కనీసం పరిశీలనావకాశం యాజమాన్యం సంపాదకుల వంటివారైనా వుంటారు. కాని ఇప్పుడు విశ్వవ్యాపితంగా విస్తరించిన సోషల్‌ మీడియా అనబడే సామాజిక సమాచార వ్యవస్థ చవకబారు సంచలనాలు సృష్టించదలచిన వారికి స్వర్గధామమై పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఫాసిస్టు శక్తులకు ప్రమాదకర అస్త్రంగా మారింది. వీటిలో సమాచారం మాత్రమే గాక చిత్రాలు వీడియోలు పాటలు మాటలు వగైరాలన్ని ఇష్టానుసారం చిత్రించి ప్రచారంలో పెట్టొచ్చు.క్షణాల మీద ప్రపంచమంతటా ప్రసారమమ్యేలా చూడొచ్చు.మానవుల రాగద్వేషాలకు ఉద్వేగాలకు ఉచ్చనీచ భావాలకు హత్తుకు పోయేలా వాటిని రూపొందించవచ్చు.అంతకు ముందు కాలంలో అతిశయోక్తులు అఘాయిత్యపు రాతలతో కరపత్రాలు ముద్రించి(చాలా సార్లు రహస్యంగా) పంపిణీ చేసే పాతకాలపు ఫక్కీని సోషల్‌మీడియా పుణికి పుచ్చుకుంది.ఇరవయ్యో శతాబ్దంలో యుద్ధ కాలంలో దురుద్దేశంతో ప్రచారం చేసిన పద్ధతులను వంటపట్టించుకున్న కుత్సిత సంస్థలు ఇంటర్నెట్‌ను దుర్వినియోగ పర్చి కట్టుకథలను పెద్దఎత్తున వ్యాపింపచేస్తున్నారు.ఏ కాస్త ఆధారం వున్నా కొన్ని సార్లు ఏమీ లేకపోయినా చిత్రాలను గొంతులను కూడా మార్ఫింగ్‌ చేసి రెచ్చగొట్టేందుకు వెబ్‌సైట్లను, ఫేస్‌బుక్‌ను ఎస్‌ఎంఎస్‌లను వాడుకుంటున్నారు.
ఇప్పుడు ఇండియాలో దాదాపు ఏడు కోట్ల మంది సెల్‌పోన్‌ వినియోగదార్లున్నారు. ముఖ్యంగా యువత అహరహం ఆ చాటింగ్‌లో మునిగితేలుతున్నారు. సందేశాలు, చిత్రాలు, స్వరాలు కూడా ఫోన్లద్వారా నేరుగా వ్యక్తులకు చేరిపోతుంది. ఇదివరలో వలె రేడియోలు, పత్రికలు,టీవీల వంటి ప్రజా ప్రచార సాధనాల అవసరం ఎంతమాత్రం లేకుండా పోయింది. పుకార్లకు వుండే లక్షణం ఏమంటే వాటిని అందుకున్న వ్యక్తి అది నిజమని నమ్మకున్నా దాన్ని మరొకరికి చేరవేయడం తప్పక జరుగుతుంది. వ్యక్తిగత విషయాల్లోనే గాక సామాజిక వదంతుల విషయంలో ఇది మరింత నిజం. ఈ క్రమంలో లక్షలాది మంది సెల్‌ఫోన్‌ వినియోగదార్లు తెలియకుండానే వదంతుల వ్యాప్తికి టెలిగ్రాఫ్‌ తీగల్లా ఉపయోగపడతారు!వాస్తవానికి సమచారం వాస్తవమైనా అవాస్తవమైనా పదిమందికీ అందినప్పుడే దాని ప్రభావం వుంటుంది. కనకనే సాంకేతిక విస్తరణ కుత్సిత వర్గాలకు గొప్పగా ఉపయోగపడుతున్నది. సెల్‌ఫోన్‌ అనేది ఒక ట్రాన్స్‌మిటర్‌గా మీడియా వ్యవస్థగా మారిపోతున్నది. అనేక సందర్భాల్లో స్పందన గలవారు పోలీసుల దౌర్జన్నాన్నో లేక మహిళలపై అత్యాచారాన్నో తమ సెల్‌ఫోన్‌లో బంధించి మీడియాకు అందిస్తే అది పెద్ద సంచలనం కలిగించడం చూస్తూనే వున్నాం.ప్రతివారూ ఫోటోగ్రాఫర్లుగా సిటిజన్‌ జర్నలిస్టులుగా మారిపోయి తమ భావాలు స్నేహితులతోనే గాక తెలియని విశ్వజనావళితో పంచుకునే అవకాశం సోషల్‌ మీడియా కలిగించింది.
ఈ సులభతర సమాచార విస్పోటనం ఎంతగా ఆహ్వానించదగినదో దీన్ని దుర్వినియోగపర్చితే కలిగే అపాయం కూడా అంతకన్నా కొన్నిరెట్లు ఎక్కువగా వుంటుంది. హద్దూ ఆపూలేనంతగా విస్తరించిన ఈ సోషల్‌ మీడియాకు గతంలోని నియంత్రణలు లేదా నియమ నిబంధనలు సరిపోవడం లేదు. పైగా దీన్ని వినియోగించేవారు అందుకునేవారు కూడా గతంలో వలె నిరక్షరాస్యులు కాదు, విద్యాధికులు అందులోనూ ప్రధానంగా యువతరం. గతంలో ప్రభుత్వం లేదా పరిణత సంపాదకులు పాత్రికేయులు తీర్చిదిద్దిన సమాచారం అందుకుని స్పందించే తీరుకు ఇప్పుడు తామే సమాచార సృష్టికర్తలై సంధానం చేసే స్థితికి మధ్య చాలా తేడా వుంది.
సెల్‌ ఫోన్‌ విశ్వరూపం
అయితే సెల్‌ఫోన్‌ వాడేవారంతా విద్యాధికులే కాదు. అవసరం ఒకటైతే ఆకర్షణగా కూడా అది తయారైంది. కొనే స్తోమత లేని వారు సెకండ్‌ హాండ్‌ లేదా డూప్లికేటు రకాలు కొని వాటితోనే సంతృప్తి చెందుతున్నారు. తరచూ ఫుట్‌పాత్‌లపై నివసించేవారు కూడా సెల్‌ఫోన్లో మాట్లాడుతూ డొక్కు టీవీనైనా చూస్తుండడం ఆశ్యర్యం కలిగిస్తుంది.ఇంత శక్తివంతమైన సాంకేతిక పరికరం స్వంతంగా అందుబాటులోకి రావడం చాలా మందికి ఇదే ప్రథమం.ఇదేమీ గొప్ప అభివృద్ధి కాదు గాని ఒక సామాజిక ధోరణి.ఇటీవలనే కేంద్రం పేదలకు సెల్‌ఫోన్లు ఇవ్వాలన్న ప్రతిపాదన చేసిందంటే దాని ఆకర్షణ ఎంతబలంగా వున్నదో తెలుస్తుంది.దేశ జనాభాలో ఇప్పటికీ అత్యధికులకు అది అందుబాటులో లేకపోయినా ఏదో రూపంలో ప్రతిచోటా వుంటుంది.ముఖ్యంగా వలస కార్మికులు జట్టుగా వచ్చేవారు ఏదో విధంగా సెల్‌ఫోన్‌ సంపాదించి తమ వూళ్లతో సంబంధాలు సంభాషణలు కొనసాగిస్తూ సంతృప్తి చెందుతుంటారు. అయితే వారికీ దాని పరిమితులు పరిధులు తెలియవు కనక అమితమైన ఆందోళనకు గురిెకావచ్చు నిజానికి చదవురాని వారికన్నా విద్యాధికులే ఎక్కువగా గురవుతారని ఉదాహరణలు చెబుతున్నాయి.ఇలాటి సంఘటనలు ప్రపంచమంతటా వుంటున్నాయి
పుకార్ల బెడద వందల ఏళ్ల నుంచి వుంటూ ఆధునిక యుగంలోనూ కొనసాగుతున్నా సోషల్‌ మీడియా కారణంగా దాని తీవ్రత పెరిగిందని ఈ సందర్భం మరోసారి నిరూపిస్తోంది.మన ఫోన్ల నుంచి సమాచారం లీకైతే వ్యక్తిగత స్వతంత్రానికి భంగం కలిగిందని ఫిర్యాదు చేయొచ్చు. అలాగాక మన ఫోన్లకు అనూహ్యంగా అజ్ఞాత శక్తుల నుంచి వదంతులు బెదిరింపులు హెచ్చరికలు వచ్చి పడితే ఏం చేయాలన్నది పెద్ద సవాలే. ఎందుకంటే అలాటి వాటికి అందరి స్పందనా వొకే విధంగా వుండదు. అందరూ బయిటపెడతారని కూడా లేదు. ఒక వేళ అలాటివి బయిటకు వచ్చి చక్కదిద్దే చర్యలు తీసుకోవాలనుకున్నా ఈ ఘటనలో వలెనే జరగాల్సిన నష్టం జరిగే పోతుంది. ఎస్‌ఎంఎస్‌ల నిషేదం, నెట్‌వర్క్‌ల మూత వంటివి పరిష్కారం కాదు. పైగా దాన్ని ఉపయోగించి మంచి ప్రయత్నాలపైనే దాన్ని ప్రయోగించే అవకాశం ఎక్కువగా వుంటుంది. ఎందుకంటే ఫాసిస్టు తరహాకు పేరు మోసిన దుష్ట శక్తులు దురభిమాన సంస్థలు ఎలాగూ వక్ర వ్యూహాలనే అనుసరించి ప్రజలను భయభ్రాంతులను చేసి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తూనే వుంటాయి. కావలసింది పారదర్శకమైన ప్రజాస్వామిక మైన సమాజం,సర్కార్లు మాత్రమే.
సంఘ పరివార్‌ ద్వంద్వ వ్యూహం
ఈ మొత్తం వ్యవహారంలో ఆరెస్సెస్‌ సంఘ పరివార్‌ ద్వంద్వనీతి కూడా గర్హనీయమైంది. అస్సాంలో బంగ్లాదేశ్‌ ముస్లిం శరణార్థుల సమస్యను అతిగా చిత్రించి వాతావరణం కలుషితం చేయడంలో వారి పాత్ర ప్రధానమైంది. బోడొలలో అన్ని విశ్వాసాలు కలిగిన వారూ వున్నా వారు హిందువులే అయినట్టు బంగ్లా శరణార్థులు వలసదారులంతా ముస్లిములైనట్టు దీన్ని మత వివాదం చేసింది వారే.బెంగుళూరులో ముగ్గురు మహిళలు ఒక రైలు పేల్చివేతకు బాంబు పెట్టినట్టు వదంతి ప్రబలింది. తీరా చూస్తే అది ఒక హిందూత్వ సంస్థ కార్యకర్త వెబ్‌సైట్‌ నుంచే వచ్చింది.ఇలా ్టకల్లోలానికి కారణమైన వెబ్‌సైట్లలో 20 శాతం హిందూత్వ శక్తులు సృష్టించనవేనని దర్యాప్తులు చెబుతున్నాయి. ఒరిస్సాలో క్రైస్తవ మిషనరీ గ్రహం స్టెయిన్‌ కుటుంబాన్ని హత్యచేసిన ధారాసింగ్‌ ఆరాధకులు కూడా ఇటువంటిది నడుపుతున్నారు. హైదరాబాద్‌లో ముస్లిములు ఆగష్టు 15న పాకిస్తాన్‌ పతాకాన్ని ఎగరేశారంటూ ఒక వీడియో ప్రదర్శించారు. చూస్తే అది పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో జరిగిన వేడుక అని తేలింది. ఇలాటి కుటిల చర్యలు చాలా జరుగుతున్నాయి. దేశవ్యాపితంగానే అలాటి ప్రచారం చేస్తూనే వున్నారు.వారికి బలమైన బెంగుళూరు ముంబాయిలలోనే సమస్య తీవ్రంగా ముందకొచ్చింది. హైదరాబాదులో కూడా ఇలాటి ప్రదర్శన ఒకటి తీశారు. మళ్లీ వారే బెంగుళూరులో వెనక్కు వెళ్తున్న వారికి తోడు నిలిచినట్టు బొమ్మలు వెబ్‌సైట్లలో తెగ ప్రదర్శిస్తున్నారు.మేము రక్షణ కల్పిస్తామంటూ ఉదార భంగిమ అభినయిస్తున్నారు. ప్రజల మధ్య వైషమ్యాలను పెంచేందుకు పాచికలు వేసే వారి ఆటకట్టించాలంటే పాలక పార్టీలు అవకాశవాద రాజకీయాలు మానుకుని నిజమైన జాతీయ సమైక్యత కోసం కృషి చేయాలి. అప్పుడు ఒక మతం వారికి మరో మతస్తులు ఒక ప్రాంతం వారికి మరో ప్రాంతీయులు భయపడే అవసరం వుండదు. (ఇంటర్నెట్‌, ఇంగ్లీషు పత్రికల సమాచారం సహయంతో)

14 comments:

  1. ఆహాఁ.. పోనీ అది నిజమనుకున్నా, తక్కిన 80% తసమదీయులవా? ప్రస్తావనే లేదు. :P

    కమ్మూనిస్టులు దుష్ప్రచారాలు చేయలేదా/చేయరా? :)) కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది.

    ReplyDelete
  2. /కమ్యూనిస్టులపైన, ప్రగతిశీల శక్తులపైన,/

    కమ్యూనిస్టులు, ప్రగతిశీలక శక్తులు(!?!) అని విడిగా చెబుతున్నారు, వారు వీరు వేరేనాండి?! :D

    ReplyDelete
    Replies


    1. ఎంత ఠంచనుగా చదివి స్పందిస్తారు శంకర్‌(?) నిజంగా ధన్యవాదాలు. ప్రగతిశీలులందరూ కమ్యూనిస్టులు కానక్కర్లేదు. ఇతరుల్లోనూ పురోగామి భావాలు గలవారుంటారు. 20 శాతం అని స్పష్టంగా పేర్కొన్నాక తక్కిన 80 శాతం ఇతర దుష్ట శక్తులు ఇచ్చి వుంటారని స్పష్టమవుతుందనే అనుకుంటున్నాను.పాకిస్తాన్‌ను అనడం కన్నా దానికి ప్రాణం పోసే అమెరికాను అనడం ఇంకా కష్టం. మన దేశంలో చాలా మంది చేస్తున్నట్టుగా ఈ రెంటినీ విడివిడిగా చూడటం సాధ్యం కాని పని.
      ఫాసిస్టులు మత జాతి దురభిమానులు పుకార్ల వ్యాప్తిని ప్రధానంగా ఉపయోగించుకున్నారని అందరూ అంగీకరిస్తారు. అసోం పరిణామాలపై సంపాదకీయాలలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా హిందూ తదితర అనేక పత్రికలు ఫాసిస్టు శక్తుల ప్రస్తావన చేశాయి. కమ్యూనిస్టుల ప్రస్తావన వారెవరూ చేయలేదు.(స్టాలిన్‌ హిట్లర్‌ ఒకటేననే వారినని చేయగలిగింది ఎలాగూ వుండదు) మామూలుగానే వ్యవస్థపై ధ్వజమెత్తే తిరగబడమని చెప్పే కమ్యూనిస్టుల వంటి వారికి చాటుమాటు ప్రచారాలు చేసే అవసరం రాదు. అభ్యుదయ భావాలు గల వారెవరూ అసత్యాలు ప్రచారం చేయరు. అది అభివృద్ధి నిరోధకులు చేసే పని. కమ్యూనిస్టులపై ఇతరత్రా విమర్శలు ఆరోపణలు వున్నాయి గాని ఈ తరహాలో వున్నాయనుకోను. నాకు తెలిసినంత వరకూ మమతా బెనర్జీ కూడా చేయలేదు. సంఘ పరివార్‌ విషయమంటారా నాకే వ్యక్తిగత అనుభవాలున్నాయి. వారి దగ్గర కొన్ని శాశ్వత కథనాలు, కొన్ని తక్షణ కథనాలు వుంటాయి. కాదు వారికి మత దురభిమానం లేదు అని మీరనుకోదలిస్తే అభ్యంతరం లేదు.

      Delete
    2. రవి గారూ,
      రెండు విషయాలు:
      1. ప్రతీ పేరాలో అమెరికా వ్యతిరేకత కమ్యూనిస్టుల శాశ్వత కథనం కాదంటారా?? అమెరిక వ్యతిరేకత కాకుండా రకరకాల వర్గాలుగా విడిపోయిన కమ్యూనిస్టుల మధ్య మరొక సైద్దాంతిక సారుప్యం ఉందంటారా??
      2. కొన్ని నెలల క్రితం కేరళ సీపీయం నాయకుడు ఒకరు తమ పార్టీ తరఫున రాజకీయ హత్యలు చేశామని చెప్పుకున్నాడు. యూట్యూబ్లో వీడియోలు కూడా ఉన్నాయి. అతను అసత్య ప్రచారం చేశాడని మీరనుకుంటున్నారా? అసత్య ప్రచారం చేసుంటే అలాంటి వాడిని కొన్ని దశాబ్దాలపాటూ కమ్యూనిస్టు పార్టీ కీలకసభ్యుడిగా ఎలా ఉంచుంకొంది?? అసలు అతడిని కమ్యూనిస్టుగా మీరు గుర్తిస్తారా??

      -Karthik

      Delete
    3. SNKR, "progressive forces" is a term that reds allot to those with whom they ally temporarily from time to time (e.g. Mensheveks in the October revolution).

      Delete
  3. Instead of placing curbs on Internet & SMS, why can't Govt. use the same technology to reassure people?

    ReplyDelete
    Replies
    1. certainly sir. i suggested that also. curbs should be minimal and temporary.

      Delete
    2. "Those who would give up Essential Liberty to purchase a little Temporary Safety, deserve neither Liberty nor Safety"

      Benjamin Franklin

      Delete
  4. you can write tons of material for 20% but not a single line about 80% , why readers should interpret ,

    ReplyDelete

  5. కమ్యూనిష్టుల మీద ఆరోపణలు లేవా? అసలు భారత చరిత్రనే వక్రీకరించి రాశారన్న పెద్ద ఆరోపణలు ఎదుర్కుంటున్నది కమ్యూనిష్టు చరిత్రకారులే. మీ వక్రీకరణతో పోలిస్తే ఆరెస్సెస్ వక్రీకరణ ఎంత చెప్పండి. మీ ద్వంద్వనీతి ముందు వారిదెంత? వారికి కనీసం నిబద్ధత అయినా ఉంది. మీ కమ్యూనిష్టులకి అది కూడా లేదు. పెట్టుబడిదారులు ఆడవాళ్లతో కులుకుతారు అని కారల్ మార్క్సే రాసాడు. అటువంటి విషప్రచారాలు మీరు మొదలుపెట్టి అవతలివారి మీదకి నెట్టడం ఎంతవరకూ సబబు?

    ReplyDelete
  6. ధన్యవాదాలు.

    కమ్యునిస్టు భావాలు లేదా RSS భావాలు ఉండడానికి దీంతో ఏమి సంబధం? ఇక్కడ అసలు సమస్య చట్టం ప్రకారం నేరం అయిన పని చెయ్యడానికి భయపడకపోవడం, చట్టం అంటే ఎందుకు గౌరవం లేదు అంటే, నేరం చేసినా మనకు ఏమి కాదు అనే ధీమా కారణం కాదంటారా?
    దేశం లోకి చొరబాట్లు, వ్యక్తుల లేదా సమూహాల మీద హింస ప్రయోగించడం, తప్పుడు పుకార్లు వ్యాప్తి చెయ్యడం (సోషల్ మీడియా ద్వార అయినా సంప్రదాయ పద్దతుల్లో అయినా) అన్ని చట్టం ప్రకారం నేరమే. ఇవి యే భావాలు లేదా సిద్దాంతాలు ఉన్న వాళ్ళు చేసినా తప్పే అని నా అభిప్రాయం.

    ReplyDelete



  7. ఆరెస్సెస్‌ లేదా హిందూత్వ సంస్థలు 20 శాతమైనా ఎందుకు చేశాయని మీరు ప్రశ్నించరా? ఇకపోతే దేశ వ్యతిరేకులైన 80 శాతం మంది గురించి విడిగా చెప్పాలా? విజ్ఞత వున్నవారెవరైనా తీవ్రంగా ఖండిస్తారు. ఆ విషయం కూడా ప్రత్యేకంగా పేర్కొని 'దేశభక్తి' నిరూపించుకోవలసిన అవసరం ఎవరికీ ప్రత్యేకంగా వుండదు. అమెరికా అంటున్నప్పుడు ఆధిపత్య పోకడలు పోతున్న సామ్రాజ్యవాదం అని తప్ప ఆ దేశం పట్ల వ్యతిరేకత కాదని గుర్తించాలి. అలాగే పాకిస్తాన్‌ అన్నప్పుడు అక్కడి సైనిక నిరంకుశ పాలకులు (వారికి ప్రధానంగా దన్నుగా వున్నది కూడా అమెరికానే కాదా?) అని అర్థం తప్ప ఆ దేశ జన బాహుళ్యం అది కూడా మత ప్రాతిపదికన అసలు కాకూడదు. ఆహార ధాన్యల ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే భారతీయులు ఎక్కువగా తింటున్నారని, ఇంధనం ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే ఇండియన్లు ఎక్కువ వాహనాలు వాడుతున్నారని నోరు పారేసుకున్నది అమెరికా పాలకులే కదా? కాశ్మీర్‌ వేర్పాలు వాదులకు మానవ హక్కుల యోధులని కీర్తించింది, ఖలీస్తాన్‌ వాదులకు ఆశ్రయం కల్పించింది అమెరికా ఖండంలోనే కదా?ఆఖరుకు అద్వానీని కూడా విమనాశ్రయంలో అవమానించింది, ఇటీవల మన రాయబారి చీర కట్టుకుంది గనక నిలదీసి వేధించింది ఎవరు?చెప్పాలంటే చాలా వున్నాయి. ఇక్కడ ప్రస్తావన దేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న వారి గురించే తప్ప మరొకటి కాదు. అలాగే ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో కోన్ని ఆంక్షలు అంటుంటే హక్కులు ముఖ్యమన్న మాట తెచ్చింది కూడా అమెరికానే కావడం గమనించండి. ఎవరి దేశం వారికి గొప్ప తప్ప మనదే గొప్ప అనుకోవడం లేదా మరో దేశాన్ని విమర్శించడమంటేనే గుడ్డి వ్యతిరేకత అనుకోవడం పొరబాటు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఎడిటోరియల్‌ను నేను ఉటంకిస్తే వారికి కమ్యూనిజంతో సంబంధమేమిటి? అంతర్జాతీయంగా ఆధిపత్య వ్యూహాలను, దేశ విదేశాల్లో జాతి దురభిమాన మత రాజకీయాలను నేను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తాను. అలాగే కమ్యూనిస్టులను ఎవరైనా వ్యతిరేకిస్తే అది వారి ఇష్టం. నా సమాధానంలో ఆ వెసులు బాటు ఇదివరకే ఇచ్చాను. అయితే ఆ విమర్శల కారణంగా నేను రాసేది పొరబాటై పోతుందును కోవడం లేదు. సమస్యను బట్టి కాస్త వివరంగా చాలా వ్యాఖ్యలకు కలిపి ఈ సమాధానం..

    ReplyDelete
    Replies
    1. 20 % గురించి మేథావులు మాట్లాడుతూనే ఉన్నారుగా?
      ఇప్పటికి గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడతారు కానీ గోద్రా రైల్ దహనం గురించి ఎంత మంది మాట్లాడారు

      Delete



  8. నేను రెంటినీ ఖండిస్తాను. రెంటినీ ఓకే రకంగా చూడలేను. రె ంటికీ సంబంధం వుందా లేదా వుంటే ఎంత అన్నది పరిశీలనార్హం అంటాను. ఒకదానికి మరొకటి సమర్థన కాదని కూడా అంటాను. వాజ్‌పేయి కూడా అప్పట్లో అదే భావించారు. కాదని మీరనుకుంటే నిరభ్యంతరంగా అనుకోండి..

    ReplyDelete