సంస్కరణల జ్వరంతో వూగిపోతున్న మన్మోహన్ సింగ్ సర్కారు తాజాగా బీమా వ్యాపారంలో 49 శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. ఉద్యోగులకు రావలసిన పెన్షన్ నిధులలోనూ ఎఫ్‌డిఐలకు ద్వారాలు తెరిచి ప్రమాదంలోకి నెట్టింది. సరళీకరణ వల్ల ఉద్యోగ భద్రత ఎలాగూ హరించుకుపోగా పదవీ విరమనాంతరం కూడా వారికి భద్రత లేకుండా చేసే చర్చ ఇది. బీమా రంగం అనేక ప్రతికూల నిర్ణయాల తర్వాత కూడా 2011612 లో
11 దందల కోట్లకు పైగా లాభం
సంపాదించింది. ఇక ప్రీమియం ఆదాయం చూస్తే అంతకు ముందు ఏడాది కంటే 25
శాతంపైగా పెంచుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోగా పోటీ పెంచుతున్న
నేపథ్యంలోనే ఎల్‌ఐసితో నాలుగు సంస్థలు ఇంతటి విజయాన్ని సాధించాయి. దీన్ని
మరింతగట్టి చేసుకునే బదులు 49 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతినివ్వాలని
నిర్ణయించడం చిరకాలంగా అమెరికా చేస్తున్న ఒత్తిడి ఫలితమే. ఒబామా స్వయంగా ఈ
మేరకు ప్రకటన చేయడం చూశాం. ఎన్నికల సంవత్సరంలో భారతీయులను ప్రత్యేక
లక్ష్యంగా చేసుకుని ఆయన దాడి చేస్తుంటే మన ప్రభుత్వం మాత్రం దేశ
ప్రయోజనాలను హారతి పళ్లెంలో పెట్టి అప్పగిస్తున్నది.
No comments:
Post a Comment