వైఎస్‌ఆర్ పార్టీ గౌరవాద్యక్షరాలు విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడంపై రకరకాల వాదనలు వచ్చాయి. అనుకున్నట్టుగా జగన్ విడుదల కానందున ఆయన తరపున తాను రాష్ట్రపతికి అభినందనలు తెలిపానన్నది ఆమె అధికారిక వివరణ. దాంతో పాటే సిబిఐ 'కుట్ర'ను కూడా దృష్టికి తెచ్చామంటున్నారు. దేశాధినేతను కలిసిన తర్వాత వివిధ విషయాలు ప్రస్తావనకు రాకుండా వుంటాయని ఎవరూ అనుకోరు గాని అది పెద్ద అభ్యంతరక
రం కూడా కాదు. ఎందుకంటే
ఎవరిని కలవాలి, ఏమి చర్చించాలి అన్నది ఆయన నిర్ణయం మాత్రమే. గతంలోనూ అన్ని
పార్టీలూ సంఘాల ప్రతినిధులూ వ్యక్తులూ కూడా రాష్ట్రఫతులను కలుస్తూనే
వస్తున్నారు. ఈ భేటీకి రాజకీయ కోణాలూ వుంటాయనడంలో సందేహం లేదు. అయినా ఆ
పేరుతో దీన్ని వివాదగ్రస్థం చేయడం నిలిచేది కాదు. ఎవరిని ఎవరు ఎంత తీవ్రంగా
వ్యతిరేకించినా ఇది ప్రజాస్వామ్యం గనక అందరికీ హక్కులుంటాయి. అసహనాల వల్ల
ఫలితం వుండదు.
No comments:
Post a Comment