తెలంగాణా సమస్యపై కేంద్రం నాటకాలను చెలగాటాలను రాజకీయ పార్టీలు అనేక సార్లు విమర్శించాయి.కాగా ఇప్పుడు సాక్షాత్తూ ఆ కేంద్రమే నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కూడా సూటిగానే ఖండించక తప్పలేదు. తాను సరైన సిఫార్సు చేయనందువల్లనే నిర్ణయం తీసుకోలేకపోయినట్టు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని తేల్చిపారేశారు.తనను తోచిన సిపార్సులు చేయమన్నందునే ఆరు మార్గాలు సూచించానని ఒకటే అడిగితే ఒకటే చెప్పేవాణ్నని కూడా అన్నారు. ఆయన సిఫార్సులు వచ్చిన మొదట్లో నైతే తెలంగాణా విభజన వాదులు కూడా తమకు అనుకూలంగా వుందన్నట్టు వాదించేవారు. ఇతర విషయాలు బయిటకు వచ్చిన తర్వాత వైఖరి మార్చుకున్నారు. ఇంతకూ కేంద్రమే ఏదైనా చేయాలనుకుంటే కమిటీలు కమిషన్లు అడ్డం వస్తాయా? అయితే కెసిఆర్ మాత్రం ఇప్పుడు తన గడువును మరో నెల పొడగించి ప్రకటన వస్తుందనే చెబుతున్నారు. ఆయన రాజకీయావసరాలు ఆయనవి.
Friday, October 5, 2012
శ్రీకృష్ణ సత్యాలు

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment