Pages

Friday, March 23, 2012

పంచాంగాల పేరిట ప్రహసనాలు, ప్రవాదాలుఉగాది అంటే సంవత్సరాది గనక ఆ రోజున కొత్త పంచాంగాలు వెలువరించడం సంప్రదాయం. ఇందులో ప్రకృతికి సంబంధించిన అంశాలు నమ్మకాల విషయాలు కూడా వుంటాయి. దేశంలో నూటికి తొంభై మంది వీటిని నమ్ముతుంటారు గనక పంచాంగాలు వేసుకోవడంలో తప్పు లేదు.అయితే వాటిని రకరకాలుగా ప్రచురించి ప్రజలను గందరగోళ పర్చడం మూఢత్వం పెంచడం సరైంది కాదు. అనేక అంశాల్లో ఈ పంచాంగాలు పరస్పర విరుద్దంగా వుండటం చూస్తాం. ఒక పండుగ ఎప్పుడు చేయాలనేదానిపైనే తిరుపతి భద్రాచలం వంటి చోట్ల వేర్వేరుగా నిర్ణయాలు తీసుకోవడం సెలవులు వేర్వేరు తేదీల్లో ఇవ్వడం చూస్తుంటాము. ఇందులో ఏది నిజం ఏది కాదు అని ఎవరు చెప్పగలరు? ఒక ముహూర్తం మంచిదైనా ఇరు పక్షాలకు మంచి జరగదు కదా?
ఉదాహరణకు అణు ఒప్పందంపై ఓటింగు సందర్భంలో నాతో వున్న జ్యోతిష్యులు ఆ ముహూర్తం చాలా గొప్పదని అన్నారు. అంటే అందరికీ మంచిదేనా అంటే ఔనన్నారు.అయితే అవతలి వారికి కూడా మంచిదయ్యేట్టయితే మన్మోహన్‌కు ఎలా ప్రశ్నిస్తే కాస్త తడబడి ఏదో జవాబు చెప్పి దాటేశారు.
ఇటీవల శ్రీనివాస గార్గేయ నందన నామ సంవత్సరానికి రూపొందించిన పంచాంగంలో రజస్వల అయ్యే సమయం ఆధారంగా స్త్రీల స్వభావాలు ఫలానా విధంగా వుంటాయని ప్రకటించడం నిజంగా ఘోరం. ఆదిశక్తి తో మొదలు పెట్టి స్త్రీని
అమ్మ దేవతగా పూజించిన దాఖలాలు ప్రతి సంసృతిలో వున్నాయి.కుంకుమ కూడా రక్తానికి దగ్గరగా వుండటం వల్లనే పవిత్రత పొందగలిగింది. అమ్మ బిడ్డను గని రక్తం పోగొట్టుకుంది గనక బలులతో రక్త తర్పణ చేయాలన్నది భావం. అలాగే రజస్వల కావడం చుట్టూ అల్లుకున్న నమ్మకాలే అశాస్త్రీయం. ప్రకృతి సిద్ధమైన ప్రతి అంశానికి ఏవో అతీత భావాలు అంటకట్టిన గతాన్ని వదలి వైజ్ఞానికంగా ముందుకు సాగే బదులు వాటినే పట్టుకు వేళ్లాడ్డం అవమానకరం.దీనిపై మహిళా సంఘాల నిరసనకు మానవ హక్కుల సంఘం స్పందించడం పోలీసులు కేసు నమోదు చేయడం స్వాగతించదగింది. గతంలోనూ వివిధ తరహాల జ్యోతిష్యులు వివిధ రకాలుగా చెప్పి జనాన్ని భయభ్రాంతులను చేయడం గతంలోనూ జరిగింది.వీరి కథనాలు పరస్పర విరుద్దంగానూ వుంటాయి.ఉగాది నాడు ఏ పార్టీ పంచాంగకర్త వారికి అనుకూలంగా చెప్పడం చూస్తూనే వున్నాం. కనకనే ఇలాటి విషయాల్లో గుడ్డిగా నమ్మడం గాక కాస్త ఆలోచించడం కూడా అవసరం.

7 comments:

 1. గుడ్డీగా నమ్మే వాళ్ళే అఫెండ్ అయ్యారు, కాబట్టే గుడ్డిగా కేసేస్తే, కళ్ళులేని హక్కుల న్యాయస్థానం స్వీకరించి వుంటుంది. ఇందులో గుడ్డిగా స్వాగతించడం ఏమిటో!

  ReplyDelete
 2. దేశంలొ నుటికి తొంబైమంది వీతిని నమ్ముతున్నరు కనుక పంచాంగాలు వేసుకొవడంలొ తప్పు లేదు "
  ఎంతమంది నమ్ముతున్నారు అనేది ముక్యం కాదు అది శాస్రీయమా, కాదా అనేది ముక్యం ఎక్కువమంది నమ్ముతున్నారు అనేదానికి అర్దం లేదు

  ReplyDelete
 3. శ్రీనివాసగార్గెయ గారి గ్రహభూమి వ్యవహారం పంచాగం మేటర్ ఒక ఆడ్డు మాత్రమే.అంతకన్నా కనబడని మీడియా వ్యాపార లక్ష్యాలు మరియు పబ్లిషర్స్ పొటిలకు ఈయన బలి.ఆంత మాత్రాన వీరిని సమర్ద్ర్ధించినట్లుకాదు .శాస్త్రం వాటిపై చర్చ సమయము కాదు.

  ReplyDelete
 4. <>
  ఎక్కువ మంది చేసింది ఏదీ తప్పు కాదా ? నాకీ వాక్యం అర్ధం కాలా రవి గారూ !

  ReplyDelete
 5. " దేశంలో నూటికి తొంభై మంది వీటిని నమ్ముతుంటారు గనక పంచాంగాలు వేసుకోవడంలో తప్పు లేదు "
  ఎక్కువ మంది చేసింది ఏదీ తప్పు కాదా ? నాకీ వాక్యం అర్ధం కాలా రవి గారూ !

  ReplyDelete
 6. పంచాంగం ఒక ప్రాచీన శాస్త్రీయ సిధ్ధాంతం...నమ్మకపోవడమం అనేది ఈ " టెక్నాలజీ" అభివ్రుద్దితో మనిషి అడ్డగోలుగా తర్కిస్తున్న విపరీతబుద్ది..

  ReplyDelete
  Replies
  1. నా వ్యాఖ్యపై పరిపరి విధాల స్పందనలు ప్రశ్నలు వచ్చాయి. మంచిదే. నేను వ్యక్తిగతంగా వీటిని నమ్మను. అయితే నమ్మే వారు వున్నారనే వాస్తవాన్ని మాత్రం పేర్కొన్నాను. ఆ కారణంగా వాటిని ముద్రించే వారు మరింత జాగ్రత్తగా వుండాలే గాని ఇష్టానుసారం రాసేయకూడదు. ఏ తరగతిని గాయపర్చకూడదు. మరీ ముఖ్యంగా మాతృమూర్తులైన మహిళలను కించపర్చే వ్యాఖ్యలు మరింత అభ్యంతర కరం. గుడ్డిగా నమ్మే వాళ్లు గుడ్డిగా వ్యతిరేకించేవాళ్లు అంటూ ఏవేవో రాసే వాళ్లకు జవాబు చెప్పనవసరం లేదు. స్త్రీల శారీరక మార్పులకూ పంచాంగానికి ఏ సంబంధం లేదు. కందుకూరి వీరేశలింగం దాదాపు నూట యాభై ఏళ్లనాడు రాసిన హాస్య సంజీవిని పేరిట రాసిన మూఢ విశ్వాసాల ఖండనను ఇటీవల మేము పునర్ముద్రించాము. దానికి నేను ముందు మాట కూడా రాశాను. అవి ఒక్కసారి చదివితే ఇప్పుడు ఆధునికులమనుకుంటున్న చాలామంది ఎంత అజ్ఞానంలో వున్నారో తెలుస్తుంది. విశ్వ విద్యాలయాల్లో కూడా జ్యోతిష్య పాఠాలను ప్రవేశపెట్టిన మన పాలకులకు ఇవేమీ సమస్యలు కాదు.
   ఎక్కువ మంది నమ్మారు గనక సరైందని కాదు గాని ఆ విషయాలపై వ్యతిరేకించే వారైనా జాగ్రత్తగా మాట్లాడాలని మాత్రం నేననుకుంటాను. ఇక్కడ వ్యక్తిగత వీరభాషణం కంటే విశ్వసించేవారిలో కూడా ఆలోచన తీసుకురావడం ముఖ్యం. ఎందుకంటే దేవుడిపై వున్న నమ్మకంతో పెద్ద సమస్య లేదు.ఆ నమ్మకాన్ని అడ్డు పెట్టుకుని అనౌచిత్యాలకు అక్రమాలకు పాల్పడే వారితోనే అసలు సమస్య.
   ఇప్పుడు స్పష్టమైందనే అనుకుంటాను.

   Delete