ఆదివారం జరగనున్న ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలలో ఎలాటి నాటకీయమైన మలుపులు వుండక పోవచ్చు. తెలంగాణా ప్రాంతంలో టిఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న మాజీ కాంగ్రెస్, తెలుగు దేశం అభ్యర్థులే విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో టిఆర్‌ఎస్ మాత్రమే ఏకైక పాత్రధారిగా సూత్రధారిగా వుండే దశ ఇప్పుడు లేదు. ఇతరులను రానివ్వకుండా చేసే పరిస్తితి కూడా లేదు. అవన్నీ నిజమే అయినా ఇప్పటికీ ప్రత్యేక రాష్ట్ర నినాదం ప్రభావమే ప్రధానంగా పనిచేస్తుంది గనక దానికి ప్రధాన ప్రతినిధులుగా కనిపించే టిఆర్‌ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని దాదాపు అన్ని పార్టీల నేతలూ అంగీకరిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో బిజెపి గెలుస్తుందని బలమైన కథనాలు వున్నా ఈ ప్రచారాలే దాని ఓటమికి కారణం కావచ్చు. ఎందుకంటే చాలా కాలంగా ఒక పార్టీని ఓడించాలన్నా గెలిపించాలన్నా వ్యూహాత్మక ఓటింగు విధానం బిజెపికి వ్యతిరేకంగానే ఎక్కువగా వినియోగించబడుతున్నది. అందులోనూ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా మైనారిటి నిలబడటం వల్ల పూర్తి స్థాయిలో ఓటర్ల సమీకరణ వుంటుంది. స్టేషన్ ఘనపూర్‌లో కూడా అన్నిచోట్ల వచ్చే ఫలితాలే రావచ్చు. తెలుగు దేశం నాయకుల ఎదురు దాడి వారి శ్రేణులను కూడతీసుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఉపయోగపడింది తప్ప ప్రజలలో విశ్వసనీయత కలిగించడానికి సరిపోలేదు.ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర విభజన లేదా సమైక్యత సమస్యపై వారి వైఖరి అస్పష్టంగానే వుంది. మోత్కుపల్లి వంటివారి దుర్భాషలు( ఒకప్పటి కెసిఆర్ శైలికి నకళ్లే అయినా) ఈ వాతావరణంలో ప్రజా బాహుళ్యానికి నచ్చి ఓట్లు తెచ్చిపెట్టడం కష్టం. బిజెపి తెలంగాణా వాదానికి తాను ప్రతినిధిగా రావాలని చేసే ప్రయత్నాలు కూడా ఫలించకపోవచ్చు. విభజన వద్దని చెప్పే సిపిఎంకు పరిమితంగానే ఓట్లు రావచ్చు గాని అసలు అది పోటీలో వుండటమే మారిన పరిస్థితికి ఒక సంకేతం. నేను చర్చల్లో పాల్గొన్న సర్వేలన్నీ ఇదే విధమైన అంచనాలిచ్చాయి.
కోవూరులో కూడా ఈ సారికి వైఎస్‌ఆర్ పార్టీనే విజయం సాధించవచ్చు. దీనివల్ల వెంటనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం పడుతుందని కొందరు అంచనా వేస్తున్నారు గాని అందుకోసం మిగిలిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ ఆగక తప్పదు. అప్పుడు వైఎస్‌ఆర్ పార్టీ అన్ని స్తానాలు తెచ్చుకోగలిగితే అధికార పీఠం కదలిపోవడం అనివార్యమే. నిజానికి ఇది పాలక పక్షానికే గాక ప్రధాన ప్రతిపక్షానికి మరింత పెద్ద సవాలు. ఆ సవాలను విజయవంతంగా ఎదుర్కోగలుగుతామన్న ధీమా ఇంకా తెలుగు దేశంలో కనిపించడం లేదు.
కోవూరులో జగన్ అభ్యర్ధి గెలిస్తే కాంగ్రెస్ కు ముందుంది ముసళ్ల పండగ . చంద్రబాబుకూ సవాలే. తెలంగాణాలో తెలంగాణా వాదమే బలంగా ఉన్నా వాతావరణం ప్రశాంతంగా మారడం ఊరట నిచ్చే అంశం.ఇది జగన్ కోసం కే.సీ.ఆర్ వ్యూహమా? జనం కోపం కు గురికాగూడదనా? తెలియాల్సి ఉంది.ఇకనైనా భావోద్వేగాలను రెచ్చగొట్టకుండా అన్ని పార్టీలు జాగ్రత్త వహించాలి.ఉద్యామాలను భాద్యతగా నిర్వహించాలి. తెలంగాణా పై కేంద్రం ఆడా,మగా కాని వ్యవహారాన్ని మాని వైఖరిని స్పష్టం చేయకపోతే రెండు ప్రాంతాలలో ఈ సారి కాంగ్రెస్ మూడో స్థానానికే పరిమితం కావలసి వస్తుంది.
ReplyDeleteమీ సొంత పార్టీ సంగతేమిటి? దిపాసిట్టులు ఒక్క చోటయినా మిగులుతాయా? తెదేపాతో తెగతెంపులు చేసుకోవాలన్న రాఘవులు గారి నిర్ణయం బెడిసి కొడుతుందా?
ReplyDeleteమీరు చెప్పింది నిజమే జై గారు. "మేము భాషా ప్రయుక్త రాష్ట్రాలకే కట్టుబడి ఉన్నాము కానీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని అడ్డుకోము" అనే స్టేట్‌మెంట్ చంద్రబాబు నాయుడి రెండు కళ్ళ సిద్ధాంతం కంటే స్పష్టత ఉన్నదా? వాళ్ళ పార్టీకే తెలంగాణావాదం విషయంలో దిక్కు లేదు కానీ "మాది తెలంగాణా విషయంలో స్థిరమైన అభిప్రాయం ఉన్న పార్టీ" అని చెప్పుకుంటూ ఇతర పార్టీలని విమర్శిస్తారు.
ReplyDeleteపై ప్రశ్నలు రెండింటికీ జవాబు నా ఐటంలోనే వుంది. అంతకన్నా ఎక్కువగా సిపిఎంపైనే దాడి చేయాలని విమర్శించాలని అనుకుంటే ఆ స్వేచ్చ వారికి పుష్కలంగా వుంటుంది. సిపిఎం ఈ పోటీపై పెద్ద ప్రగల్భాలు పలికింది లేదు. ప్రాంతాల పేరిట పాచికలాడే శక్తుల పట్ల అప్రమత్తంగా వుండాలన్నదే అసలు విషయం. పరస్పర దుర్భాషలాడుకున్నవారు ఒకరి నొకరు ఎత్తి చూపిస్తే సిపిఎం అందరి పట్ల విమర్శనాత్మకంగా వుండాలని చెప్పింది. అంతే తేడా.
Delete/కోవూరులో కూడా ఈ సారికి వైఎస్‌ఆర్ పార్టీనే విజయం సాధించవచ్చు. /
ReplyDeleteయు.పి.ఎన్నికల్లో 'లౌకిక' భావాలుకల SPకే ప్రజలు పెద్ద పీట వేశారని చెప్పారు. 36కేసులున్న రాజు భయ్యా జైళ్ళ శాఖామంత్రిగా నియమితులయ్యారు.
మరి కొవూరులో మన జగన్ పార్టీ గెలుపును ఏవిధంగా విశ్లేషించవచ్చంటారు?