Pages

Sunday, March 25, 2012

సబ్‌ ప్లాన్‌ ఎజెండా సబ్‌ కా ఎజెండా



ఎస్‌సి ఎస్‌టిలకు జనాభా నిష్పత్తి మేరకు సబ్‌ ప్లాన్‌ కేటాయింపులు జరపాలని కోరుతూ కుల వివక్ష వ్యతిరేక సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల అధ్వర్యంలో జరుగుతున్న 72 గంటల నిరాహారదీక్షకు గొప్ప సంఘీభావం వ్యక్తమైంది. ఆదివారం ఆ శిబిరం సందర్శించినపుడు వరుసుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, సిపిఎం సిపిఐ లతో సహా అనేకానేక సంఘాల నేతలు ప్రతినిధులు వచ్చి ముక్తకంఠతో బలపర్చారు. ఈ నాటి అనిశ్చిత ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక సమస్యపై అంతటి సమైక్య భావన వ్యక్తమవుతుందని చూస్తే తప్ప నమ్మడం కష్టం. 16 శాతం దళితులు , 8 శాతం గిరిజనులు వుండగా వీరికి కేటాయించవలసిన దానిలో కొద్ది భాగమే విదిలించి అది కూడా ఇతర రంగాలకు మళ్లించడం జరుగుతున్నది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ 5 లక్షల కోట్లకు పైగా వుండగా అందులో 30 వేలకు కొంచెం ఎక్కువగా మాత్రమే ఈ రంగాలకు కేటాయించారు. లక్షా 12 వేల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్‌సిఎస్‌టిలకు కలిపి పది వేల కోట్ల కేటాయింపు చేసి అందులో 3 వేల కోట్లు ఇతర రంగాలకు మరల్చారు. రాష్ట్రంలో 70 వేల దళిత వాడలుండగా మొత్తం కలిపి 7 వేల కోట్లు కేటాయించడమంటే తలసరి ఎంత వచ్చేది చెప్పనవసరం లేదు. పైగా ఈ నిధులను జలయజ్ఞానికి రోడ్లకూ విమానాశ్రయాలకు మరలించి అది కూడా దళితులకు ఉపయోగకరమని వూకదంపుడు వినిపిస్తున్నారు. దేశంలో 55 మంది సహస్ర కోటేశ్వరులు జిడిపిలో మూడో వంతు అనుభవిస్తుంటే మరో వైపు నాలుగో వంతుగా వున్న ఈ అణగారిన వర్గాలు కనీస నిష్పత్తిలో కూడా కేటాయింపులు పొందలేకపోవడం కఠోర వాస్తవం. ఈ పరిస్తితులలో సామాజిక చైతన్యం గల వారందరూ ఒక్క కంఠంతో పోరాడితే తప్ప ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ అన్న రాజ్యాంగ భావన, ప్రణాళికా సంఘ సూచన అమలు కావు.ఆంధ్ర ప్రదేశ్‌లో మొదలైన ఈ ఉద్యమం ఆ విధంగా దేశానికి మార్గదర్శకమవుతుంది.అందుకే దాన్ని అందరూ బలపరుస్తున్నారు. నిన్న హెచ్‌ఎంటివి రామచంద్రమూర్తి, శ్రీనివాసులు రెడ్డి, దేవులపల్లి అమర్‌ తదితర పాత్రికేయ మిత్రులు పూర్తి సంఘీభావం ప్రకటిస్తే ఈ రోజున ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్‌, ప్రజాశక్తి న్యూస్‌ ఎడిటర్‌ తులసీదాస్‌ తదితరులు వచ్చారు. మీడియా కూడా సామాజిక అంశాలను చర్చకు పెట్టడంలో తన వంతు పాత్ర పోషిస్తుందని హామీనిచ్చారు. ఇదెంతైనా హర్సనీయమైన పరిణామం. మాజీ ప్రభుత్వ కార్యదర్శి కాకి మాధవరావు ఈ సభలో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఇంత స్థాయిలో దీనిపై ఉద్యమాలు ఇంకా రావడం లేదని అన్నారు.బహుశా ఆంధ్ర ప్రదేశ్‌లో సామ్యవాద భావాల సామాజిక ఉద్యమాల ప్రభావమే అందుకు కారణం. దీన్ని మరింత ముందుకు తీసుకుపోవడం ద్వారా సబ్‌ కా ఎజెండా సబ్‌ప్లాన్‌ ఎజెండా అన్న భావాన్ని చాటిచెప్పడం ఎంతైనా అవసరం.

3 comments:

  1. meru ee agiatation ni support chesthunnara sir...
    ante Janabha lo vallu antha mandi unnaru kabatti antha nishpatti lo vallaki nidulu ketayinchinapudu migatha kulalu kuda entha nishpatti lo unnaro vallaki kuda anthe nidulu ketainchalani nenu manavi chesthunna...

    leni vallani paiki tesukuravali kaani... ila ee kulam vallu intha mandi unnaru, so vallaki intha nidulu ivvali antam one of the foolish decision taken by Idiots....

    ReplyDelete
    Replies
    1. @vinod

      sir ani modalupetti idiots to mugincharu. it's ok. pedarikam kolabaddaha choodalisinde.pranalika sangham lekkapai naa comment chadavandi. kani sc st la vishayam lo positive discrimination andaram amodinchamu. rajyangamlone rasukunnamu. deenni ala choodataniki try cheyandi..ok

      Delete
    2. Ambedkar garu Rajyangam rasinappati sthithi ki ippati sthithiki chala teda undi...
      Appudu Buswamya vyvastha tara sthayi lo undi.. and antaranithanam kuda ade tarahalo undi...
      kani ippudu Bhuswmya vyvastha ledu, Bhumi unna vadu appulato enti ra ee jevitham anukunutnnadu.. kooli kellina varu valla kanna hayi ga unnaru..
      and at the same time aa kulalo kuda Dabbu vunna vallu reservations use chesukuntunnaru (like SC/ST ppl who are taking coaching in premire inst with fee vs ppl who study in govt college)

      Ippatiki mana rajyangam lo chala marpulu chesaru avasaramainappudalla.. so vetiki kuda oka marpu undali annadi na uvacha...

      Delete