Pages

Wednesday, March 7, 2012

శాసనసభల ఫలితాలు- జాతీయ ప్రభావాలుఅయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాలపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ బిజెపిలు రెండూ చతికిలబడటం ఈ ఎన్నికల ప్రధాన పాఠం. మరీ ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో. పదహారేళ్లలో తొలి సారి పూర్తి మెజారిటితో ప్రభుత్వం ఏర్పాటు చేసి తొలిసారిగా పూర్తి కాలం పాలించిన ి ముఖ్యమంత్రిగా బిఎస్‌పి నేత మాయావతి తనదైన స్థానం పొందారు. అయితే ఆమె రికార్డును కూడా అధిగమించి ఆమెను ఓడించి ఎస్‌పి నాయకులైన తండ్రీ కొడుకులు ములాయం సింగ్‌, అఖిలేష్‌ యాదవ్‌లు కొత్త చరిత్రనే సృష్టించారు. దేశంలో అతి పెద్దదైన ఈ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు పక్కకు పోయి సామాజిక న్యాయం లౌకిక తత్వంతో సంబంధం గల రెండు పార్టీలే ప్రధానంగా మిగలడం ఎంతైనా ఆహ్వానించదగిన పరిణామం.రాహుల్‌ ప్రచార వైఫల్యం ఒకటైతే ఉమా భారతి సహా బిజెపి నాయకగణమంతా పర్యటించినా ఫలితం లేకపోవడం అంతకన్నా తీవ్రమైంది. గతంలో తన పెరుగుదలకు ప్రధాన పునాదిగా ఉపయోగపడిన చోటనే బిజెపి వరుసగా దెబ్బ తినడం నిస్సందేహంగా మతతత్వ రాజకీయాలకు
తిరస్కరణే.పంజాబ్‌లోనూ అకాలీ దళ్‌ విజయం సాధించినంతగా బిజెపి నిలబడలేదు. ఉత్తరా ఖండ్‌లోనూ ఓటమి మిగిలింది. కనక కాంగ్రెసేతర బిజెపియేతర పార్టీల వేదికకు ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలు గొప్ప వూపు నిస్తాయనడంలో సందేహం లేదు.వామపక్షాలు ఈ అయిదు రాష్ట్రాలలోనూ అస్సలు కనిపించని మాట నిజమే. బెంగాల్‌, కేరళ, త్రిపుర గాక తక్కిన చోట్ల తమ బలం చాలా పరిమితమని ఆ పార్టీలు ఎప్పుడూ చెబుతూనే వున్నాయి. కాంగ్రెసేతర లౌకిక వేదిక నిర్మాణంలో వాటికి వుండే పాత్ర ఎప్పుడూ వుంటుంది.అయితే ఆ వేదిక ఏ రూపంలో ముందకొస్తుందనేది చూడాలి. అది ఎలా వున్నా ఈ తీవ్రమైన బలహీనత నుంచి బయటపడి కొంతైనా బలం పెంచుకోవడానికి వామపక్షాలు కూడా గట్టిగానే దృష్టి పెట్టాల్సి వుంటుంది.ఈ విజయ సాధనలో అఖిలేష్‌ పాత్ర వున్నా కొంతమంది కేవలం యువతరం అన్న కోణం నుంచే మాట్లాడ్డం పాక్షికత్వమవుతుంది. యువకులైనా వృద్ధులైనా ఏ విధానాల కోసం నిలబడుతున్నారనేది ముఖ్యం. అలాగే యుపి ఫలితాలు విభజన రాజకీయాలతో అధికార సోపానాలు నిర్మించుకోవాలనుకునే వారికి, ఈ విషయంలో అవకాశవాదం ప్రదర్శించేవారికి కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి.

4 comments:

 1. గెలుపు ఓటములు వచ్చినపుడు పై పై కారణాలు కాకుండా , విధానాలను పరిశీలించాలి. యూ.పీ లో ఫలితాలు రవిగారు చెప్పినట్లు లౌకికతత్వం కే భారతప్రజలు ఎపుడూ పెద్దపీట వేస్తారనేది మరోసారి ఋజువైంది. బీ.జే.పీ కి అవకాశం ఇచ్చారు అంటే కారణం లౌకిక పార్టీల అవకాశవాదమే తప్ప భారత ప్రజల తప్పు కానేకాదు. అవకాశ వాద , ప్రాంతీయవాద రాజకీయాలు ఈ ఫలితాలనుండి ఏమి పాఠాలు నేర్చుకుంటాయి ? ఏమి అనుకూలతలు వెతుక్కుంటాయి అనేది వేచిచూడాల్సి ఉంది.

  ReplyDelete
 2. /రెండు జాతీయ పార్టీలు పక్కకు పోయి సామాజిక న్యాయం లౌకిక తత్వంతో సంబంధం గల రెండు పార్టీలే ప్రధానంగా మిగలడం ఎంతైనా ఆహ్వానించదగిన పరిణామం/
  వామపచ్చాలు జాతీయ పార్టీలు కావా? లౌకిక తత్వం, సామాజిక న్యాయం ఆపార్టీల్లో కొరవడిందా?

  /అవకాశ వాద , ప్రాంతీయవాద రాజకీయాలు ఈ ఫలితాలనుండి ఏమి పాఠాలు నేర్చుకుంటాయి ? ఏమి అనుకూలతలు వెతుక్కుంటాయి అనేది వేచిచూడాల్సి ఉంది./

  వామపచ్చాలు ఏమి నేర్చుకున్నాయి? తమకు వోటేయని ప్రజలంతా బూర్జువాలు అనేనా? హ్హూ... ఏమి అనుకూలతలు వెతుక్కుంటాయి! అయితే UPA కాకుంటే మూడవఫ్రంట్, అంతేనా?

  ఇలాంటి పరిశీనలలు, వేచిచూడటాలు, అనాలిసిస్లు మనకు కొత్త కాదు కదా? 60ఏళ్ళకు పైగా వింటూనేవున్నాము.

  ReplyDelete
 3. Party 2012 2007 2002 1996 1993 1991 1989
  SP 224 97 143 109 109
  INC 28 22 25 38 28
  BJP 47 51 88 174 177 221 57
  BSP 80 206 98 70 67 12 13 CPI - - - 1 3 4 6
  CPI (M) - - 2 4 1 1 2

  Lefties together could not secure one seat, Why? It is time to introspect, before branding the others Non-Secular, Anti-SocialJustice, Anti-people, Anti-China, bourgeois etc - my 2paise.

  ReplyDelete
  Replies
  1. Dear snkr,

   Read my comments carefully at least now. and then .. heckling as a habit is not nice. i only made political points you are free to do so. you may differ with my analysis.. i don't mind. the plight of left in north is a fact but they are not at all a force there. the case of BJP in up is different. bye.

   Delete