Pages

Thursday, March 22, 2012

అసంతృప్తి జ్వాలల్లో అధికార పక్షం




అధికార కాంగ్రెస్‌లో అసమ్మతి అసంతృప్తి వేగంగానే రాజుకుంటున్నాయంటే ఆశ్చర్యం లేదు. ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యల నుంచి డిఎల్‌ రవీంద్రారెడ్డి రాజీనామా లేఖ వరకూ ప్రతిదీ ధిక్కార స్వరానికి ప్రతిధ్వనిగా వుంది. అధిష్టానం కూడా కొంత కాలం ఈ అసంతృప్తిని వెల్లడించనివ్వడమే మంచిదని భావిస్తుంది. తద్వారా పరిస్తితి కొంతైనా చల్లబడుతుందని దాని ఆశ. కాంగ్రెస్‌ కోలుకోక తెలుగుదేశం తేరుకోక అంతర్గత వైరుధ్యాలతో సతమతమవుతుంటే రాష్ట్ర రాజకీయాలలో అనిశ్చితి మరింత పెరుగుతుంది.ఉత్తరోత్తరా అది అధికార పీఠానికే ఎసరు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ముఖ్యమంత్రిపైనా పిసిసి అధ్యక్షుడిపైనా విమర్శలు వినిపించడం భావి పరిణామాలకు సూచికే. రానున్న 18 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ కోలుకునేది ఎలాగూ వుండదు గనక ప్రభుత్వానికి ప్రమాదం పెరుగుతుంది.కొనసాగినా అది దిన దిన గండంగానే వుంటుంది. కేంద్రం పరిస్తితి కూడా అంతంత మాత్రంగానే వుండటం, రాష్ట్ర భవిష్యత్తుపైనా తేల్చుకోలేక పోవడం సంక్షోభాన్ని తీవ్రం చేస్తాయి.బహుశా తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతలు స్వంత వేదిక ఏర్పాటు చేసుకుని వత్తిడి పెంచడం ఖాయం.

1 comment:

  1. <>
    ఇపుడు లేదా స్వంతవేదిక . కేంద్రం ప్రకటించే ప్రత్యేక ఆర్ధిక మండళ్లలో వారి స్వంత వాటాల కోసం ఐక్యతా రాగం తీస్తారనుకోవచ్చు. ఆంధ్రాప్రాంతంలో కూడా కాంగ్రెస్ నేతలలో అసంతృప్తి రాగం ఊపందుకుంది. ఇదంతా జగన్‌ కు కలసివచ్చే అంశాలే. జగన్‌ తో కేంద్రం ఒప్పందం చేసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. అంతకు మించి కాంగ్రెస్ ను ఇప్పట్లో గట్టెక్కించే అవకాశాలు లేవు. ఇక ఏ పరిణామాన్ని అనుకూలంగా మార్చుకోలేని తెలుగుదేశం పరిస్తితి ఇలాగే కొనసాగుతుందా ? అనేది ఇపుడే చెప్పలేము.కిరణ్ కుర్చీలో పూర్తికాలం ఉంటాడా అనేది కూడా అనుమానమే.

    ReplyDelete