Pages

Friday, March 30, 2012

జగన్‌తో సయోధ్య కుదిరినట్టేనా?



ఇది కేవలం ప్రశ్న కాదు. వూహాగానం అంతకన్నా కాదు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న భావన. కాంగ్రెస్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలెవరూ ఖండించడానికి సిద్దం కాని పరిస్థితి. ఒక ప్రముఖ చానల్‌ విలేకరి వారం రోజుల కిందట చెప్పిన సాధికార సమాచారం బట్టి నేను కొద్ది గత శనివారం ఐటంలోనే ఈ మేరకు రాశాను.ఇప్పుడు ఇంచుమించు అందరూ అదే మాట ధృవీకరిస్తున్నారు. తాజా పరిణామాల తర్వాత జగన్‌ను అరెస్టు చేయడం ఎందుకనే అభిప్రాయం కాంగ్రెస్‌లో కలిగినట్టు చెబుతున్నారు. జగన్‌పై తీవ్రంగా ధ్వజమెత్తే కడప జిల్లా కాంగ్రెస్‌ నాయకుడితో ఈ సంగతి అన్నప్పుడు ఆయన కూడా అర్థాంగీకారమే తెలిపారు. జెడి లక్ష్మీనారాయణ ఢిల్లీ యాత్ర తర్వాత ఈ మేరకు నిర్ణయం జరిగిందనేది కథనం. ఆయన బదిలీ కావచ్చుననీ మరో కథనం. జగన్‌ను అరెస్టు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయొచ్చని ప్రతిపక్ష న్యాయవాది ఒకరు వివరణ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా సిబిఐ వైఖరిలో మార్పు వచ్చిందని బహిరంగంగా వ్యాఖ్యానించడంలో ఇదే అంచనా తొంగి చూస్తుంది. వీటన్నిటి మధ్యనా సోనియా తనను చూసి భయపడుతోందని జగన్‌ ఎందుకన్నాడనే ప్రశ్న రావచ్చు. రాజకీయాలలో ఇవన్నీ సర్వసాధారణమేనని సమాధానం ఇవ్వాలి.ఒక్కసారిగా మెతగ్గా మాట్లాడకుండా వుండటమే ఇక్కడ కాంగ్రెస్‌ కోరుకుంటుంది. ప్రభుత్వ వ్యతిరేక వోటు తెలుగుదేశంకో మరొకరికో పోకుండా జగన్‌కు వెళితే కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దగా బాధపడదు. ఇంతకు ముందే చెప్పినట్టు రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కొత్త సమీకరణాలు ముందుకు రావడం తథ్యంగా కనిపిస్తుంది. జగన్‌ అరెస్టు కాకపోవచ్చు, లాంఛనంగా నిర్బంధంలోకి తీసుకున్నా గౌరవంగానే బయిటకు రావచ్చు.ఇందుకు భిన్నంగా జరిగితే దాన్ని ప్రస్తుత అంచనాలకు పూర్తి భిన్నమైన పరిణామంగా చూడాల్సి వుంటుంది.కాగ్‌ నివేదిక తర్వాత ప్రభుత్వ స్పందన చూస్తే కూడా ఈ అభిప్రాయమే బలపడుతుంది.

1 comment:

  1. మీకు తెల్సినంతలో, CAG నివేదికని ఏ నాడన్నా ఏ ప్రభుత్వమన్నా పట్టించుకున్న దాఖలాలున్నాయా? వాళ్ళ నివేదికలు కూడా అంతే ఏడుస్తాయి. మేం చెప్పాం.. మీరు నమ్మేయండి అంటమే తప్ప నాకెందుకో వాళ్ళు ground realities ని కానీ, ప్రభుత్వ policy లు కానీ ద్రుష్టిలో ఉంచుకోని చెప్తున్నట్టు అనిపించవు. 3G కుంభకోణంలో లక్ష డెబ్భైవేల కోట్లు పొయ్యాయని చెప్పినట్టే వుంటుంది.

    దాన్ని పట్టించుకోలేదని మనమో Conclusion కి రావటం అనవసరం అని నాభిప్రాయం. Your other insights may be valid. I do not know.

    ReplyDelete