రాజ్యసభకు సిఎం రమేష్, దేవేందర్ గౌడ్‌లను ఎంపిక చేసిన తెలుగు దేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రమైన అసంతృప్తిని ఎదుర్కొంటున్నట్టు కనిపిస్తుంది. వ్యక్తిగతంగా కలసిన తెలుగు దేశం నేతలు, మాజీ ప్రస్తుత ఎంపిలు కూడా ఈ విషయమై తమ ఆగ్రహాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. పైగా ఆర్థిక వనరుల సమీకరణ అవసరాన్ని అధినేత ప్రతిసారీ ముందుకు తేవడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే తెలుగు దేశం పరిస్థితి ఏమంత సజావుగా లేదు.ఎన్ని తంటాలు పడినా విశ్వసనీయత పొందలేకపోతున్నామన్న బాధ ఆందోళన వారిలో చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆలోచనా ధోరణి మారాలన్న మాట అంటున్నారు. మధ్యలో కొంత నూతన భావాలను ఆదరించిన ఆయన చుట్టూ ఇప్పుడు మళ్లీ పాత నేతలే వలయంగా ఏర్పడ్డారని వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపైనా ఏమంత ఉత్సాహంగా లేని ఆ పార్టీకి ఈ అసంతృప్తి పులి మీద పుట్రలా వచ్చిపడిందని చెప్పక తప్పదు. తలసాని శ్రీనివాసయాదవ్, అరవింద గౌడ్, కోడెల శివ ప్రసాద్, ఆఖరుకు మైసూరా రెడ్డి వంటి వారు కూడా ఏదో ఒక స్తాయిలో తమ అసంతృప్తిని వెల్లడించడం చూస్తే చంద్రబాబు ముందున్న సవాలు పెద్దదేనని స్పష్టమవుతుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ నేతలలో కొంతమందికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌తో సంబంధాలున్నాయి. అందరూ కాకపోయినా కొద్ది మందైనా పార్టీని వదలిపెట్టే అవకాశాలున్నాయనే చెప్పాలి.అలాగే తెలంగాణాలో ఎంత ఎదురుదాడి చేసినా నిలదొక్కుకోలేమన్న భావన కూడా బలంగానే వుంది.దేవేందర్ గౌడ్ సహజ శైలిలో అసంతృప్తి మామూలేనని అంటున్నా అవతలి పక్షం వారు అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోతున్నారు.
Monday, March 19, 2012
తెలుగుదేశంలో నిరసన తీవ్రత

Subscribe to:
Post Comments (Atom)
అందరికీ మైండ్ సెట్ మారాలంటూ యాగీ చేసే బాబు మైండ్ సెట్ మారలేదు. కేవలం ఆర్ధిక వనరుల పేరుతో ఎప్పటికప్పుడు ఇలా అసంతృప్తిని రగుల్చుకోవడం బాబుకు కొత్తేమీ కాదు . నిత్య అభద్రతాజీవిగా తన నీడనే నమ్మలేని వ్యక్తిగా చంద్రబాబు చరిత్ర సృష్టించడానికి తప్ప ఇవి దేనికీ పనికిరావు. విశ్వసనీయత పెంచుకోవడం చంద్రబాబుకు తెలియదు.పార్లమెంటరీ రాజకీయాలలో ఓ రాజకీయపార్టీ అధినేతకు తన నాయకత్వం పై విశ్వసనీయత కూడా కీలకమే . కేవలం పాలనాదక్షత మాత్రమే నాయకత్వానికి గీటురాయికాదు. అసంతృప్తి పెనుముప్పుగా మారక ముందే చంద్రబాబు తగిన చర్యలు తీసుకోకపోతే తెలుగుదేశంకు ఇబ్బందులే. రాజకీయం గా బాలారిష్టాలు ఎదుర్కొంటున్నా విశ్వసనీయత విషయం లో జగన్ పార్టీయే కొంత బెటర్ గా ఉంది. దేవేందర్ గౌడ్ వ్యాఖ్యలుకు ఇతర నేతల వ్యాఖ్యలకూ పోల్చి చూస్తే తెలుగుదేశం లో పదవులు వచ్చిన వారికీ - పదవులు రాని వారికీ ఉండే తేడాలను స్పష్టం చేస్తున్నాయి.
ReplyDelete