ఎంతకాలం నుంచో ప్రచారం జరుగుతున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఎట్టకేలకు ఆదివారం పూర్తి కానుంది. ే పూర్వ ప్రజారాజ్య నేత మెగాస్టార్ చిరంజీవితో పాటు కోట్ల సూర్య ప్రకాశరెడ్డి, బలరాం నాయక్, కిల్లి కృపారాణి, సర్వే సత్యనారాయణ పదవులు పొందనున్నారు. ప్రభుత్వం కూలిపోయే స్థితిలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపి ప్రాణం నిలిపిన చిరంజీవికి కేంద్రంలో స్థానం కల్పిస్తారని ఎప్పటినుంచో చెబుతున్నా ఆ ప్రక్రియ బాగా ఆలస్యమైంది. దీనిపై అనేక వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక కోట్ల సూర్య మాజీ ముఖ్యమంత్రి కుమారుడైనప్పటికీ జిల్లాకే పరిమితమై తన వర్గం పనులను చూసుకుంటూ కాలం గడుపుతుంటారు. రాయలసీమలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను ఎదుర్కొవడానికి సామాజిక సమీకరణను నిలబెట్టడంలో ఆయనను తీసుకోవడం ఉపయోగమని అంచనా వేసినట్టు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో కిల్లి కృపారాణిని తీసుకోవడంలోనూ ఇదే వ్యూహం అనుకోవాలి. తెలంగాణా విషయానికి వస్తే ప్రాంతీయ ఉద్యమం నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అధిష్టానం తరపున నిలబడే వారు కావాలి గనక సర్వే, నాయక్‌లు ఎంపికయ్యారు. అనేక సందర్భాల్లో తీవ్ర స్వరంతో ప్రత్యేక నాదం వినిపిస్తున్న వారికి భిన్నంగా సర్వే అధిష్టానం విధేయతను చాటుకున్నారు. అందరూ బహిష్కరించినప్పుడు కూడా ఆయన లోక్‌సభలో వుండి తన వాదం వినిపించారు.ఇప్పుడు పదవి పూర్తిగా సోనియా గాంధీ దయా దాక్షిణ్యాల వల్లనే లభించిందంటూ ఆ విధేయతను రెట్టింపు చేశారు. పైగా వీరికి ఇవ్వడం వల్ల ఎస్‌సి ఎస్‌టి వర్గాల ప్రతినిధులుగానూ వారిని ముందుకు తెచ్చే అవకాశం వుంటుంది.
వాస్తవానికి ఎవరికి ఏ పదవి వచ్చిందన్న దానికన్నా ఎవరు ప్రజల కోసం ఏం చేశారన్నది