Pages

Thursday, August 18, 2011

జగన్‌ టు హజారే!



ఇప్పటి మీడియాలో ప్రత్యేకించి టీవీ మీడియాలో ఏ ఎజెండా కూడా వారం రోజుల పాటు కొనసాగదు. ఇరవై నాలుగ్గంటల ఛానళ్లలో ఏ రోజు తాజా చర్చలు ఆ రోజే. జగన్‌ ఆస్తులపె,ఎమ్మార్‌ కుంభకోణంపై ౖ దర్యాప్తుకు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వు చేయడంతో గత బుధవారం చర్చలన్ని దానిపైనే కేంద్రీకృతమైనాయి. ఈ బుధవారం నాటికి అన్నా హజారే అరెస్టుపై చర్చ అన్నిటినీ ఆక్రమించేసింది. రెండు సందర్బాల్లోనూ అవినీతి వ్యవహారాలే వేర్వేరు కోణాల నుంచి ముందుకు రావడం యాదృచ్చికం కాదు.
జగన్‌ ఆస్తులపై సిబిఐతో విచారణ జరిపించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిజానిజాలు తేలడానికి ఏకైక మార్గంగా వున్నాయి. వీటిని స్వాగతిస్తున్నామంటూనే జగన్‌తో సహా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలలో సమర్థనే ఎక్కువ. వైఎస్‌ హయాంలో లాభ పడిన వారు
తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే సత్యాన్ని వారు కాదనడం లేదు.అయితే ఆ కేటాయింపులు చంద్రబాబు విధానాల కొనసాగింపేనని ముక్తాయిస్తున్నారు. ఆ పైన వైఎస్‌ మంత్రివర్గ సహచరులు కూడా అందుకు బాధ్యత వహించాలంటున్నారు. ఇంకోవైపున వారే చనిపోయిన వ్యక్తిపై ఆరోపణలేమిటని ఆక్షేపిస్తున్నారు. వైఎస్‌ది తప్పుకాకపోతే అప్పుడు చంద్రబాబును గాని కాంగ్రెస్‌ మంత్రివర్గ సహచరులను గాని వేలెత్తిచూపించడమెందుకు? అలాగే మొదట పిటిషన్‌ వేసిన నాయకుడు మంత్రిగా వున్నా ప్రభుత్వం ఎటూ మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తున్నది. ఈ కేసుతో తమకు సంబంధం లేదని అధిష్టానం ప్రకటిస్తున్నది. కేసులో వైరుధ్యాలకు ఇవి కొన్ని ఉదాహరణలు.
వచ్చిన పిటిషన్లు ప్రజా ప్రయోజన వాజ్యాలు గనక వాటిని విచారణకు చేపట్టవలసిన ప్రాథమిక సాక్ష్యాధారాలు వున్నాయా లేదా అన్న అంశానికి పరిమితమైనట్టు కోర్టు స్పష్టం చేసింది.అప్పటికే అదాయపు పన్ను శాఖ జగన్‌ సంస్థలకు ఇచ్చిన నోటీసులను కూడా ఆధారంగా తీసుకున్నది. సిబిఐ తొలి నివేదికనూ తిలకించింది. అవినీతి నిరోధక చట్టం, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, మనీ లాండరింగ్‌ చట్టం అనే మూడు విభాగాల కింద అక్రమాలను పరిశోధించాలని ఆదేశించిందే తప్ప తన వరకూ నిరాధారంగా వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఆదేశాలపై సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత దర్యాప్తు పరిధి విస్త్రతంగానే వుంటుంది. రాజకీయ కక్ష సాధింపు, కుట్ర వంటి మాటలతో ఈ వ్యవహారాన్ని పరిమితం చేయడం కుదిరేది కాదు. సిబిఐ నిష్పాక్ష్షిికత ఏమైనప్పటికీ చట్టం చట్టమే. తమ సంస్థల్లోకి ప్రభుత్వ నిర్ణయాల లబ్దిదారులనుంచి పెట్టుబడులు రావడాన్ని సమర్థించుకోవడానికి చట్టాలను ఉటంకించే వారు అదే ప్రకరం సిబిఐ పనిచేయడాన్ని కూడా గౌరవించకతప్పదు.
రాజకీయ వైపరీత్యం ఏమంటే ప్రజల ధనంతో అమలు చేసిన సంక్షేమ పథకాలు వైఎస్‌కు చెందుతాయా కాంగ్రెస్‌కు చెందుతాయా అనేది ఇరుపార్టీల మధ్య ఎడతెగని వివాదంగా వుంది. .వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆ పథకాలు తమ స్వంతమని అంటుంటే కాంగ్రెస్‌ అవి పార్టీకి చెందుతాయని ఢంకా బజాయిస్తున్నది. అదే ఆరోపణల విషయానికి వచ్చేసరికి అవి సమిష్టి బాధ్యత అని వైఎస్‌ కాంగ్రెస్‌ అంటుంటే మాకు సంబంధం లేదని అధికార పార్టీ నేతలు మంత్రులు అంటున్నారు. నిజానిజాలు పూర్తిగా తెలియాలంటే వైఎస్‌ కుటుంబీకులతో పాటు అప్పటి మంత్రులూ కీలకనేతల పాత్రపైనా దర్యాప్తు జరగవలసి వుంటుంది. ఎందుకంటే ఈ వ్యవహారాలు రాష్ట్రానికి లేదా జగన్‌ ఆస్తులకూ పరిమితమైనవి కావు. సరళీకరణ పేరిట సాగుతున్న విశృంఖల ప్రైవేటీకరణ విష ఫలితాలే ఇవన్నీ. ఎమ్మార్‌ అక్రమాలపై కూడా దర్యాప్తుకు కోర్టు ఆదేశించిందంటే అవినీతి ఏ ఒక్క విభాగానికో వ్యక్తికో పరిమితమై లేదని స్పష్టమవుతుంది. టు జి స్పెక్ట్రంలో రాజా,కనిమొళి వంటి వారి అరెస్టుతో మొదలు పెట్టి కర్ణాటకలో ఎడ్యూరప్ప నిష్క్రమణ దాకా అన్నిచోట్లా అగుపించే అసహ్యదృశ్యం ఇది. వైఎస్‌ వుండగానే ఈ ఆరోపణలు వచ్చాయి తప్ప కొత్తవి కావు. కాకపోతే కాంగ్రెస్‌ నేతలు అప్పుడు భజన చేసి ఇప్పుడు విమర్శలు చేస్తుండవచ్చు గాని ప్రతిపక్షాలకు అది వర్తించదు. రాజకీయ కక్ష వంటి విమర్శలు న్యాయ నిర్ణయంలో సహాయపడలేవని హైకోర్టు స్పష్టంగానే చెప్పిన్పటికీ వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ వారికి ఇతర వాదనలు దొరక్క వాటి చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యవహారాల్లో తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదని జగన్‌ చెప్పేది ఎలా వున్నా పరోక్ష ప్రయోజనాలు వున్నాయా లేదా అన్నది పూర్తి దర్యాప్తు తర్వాతనే తేలాలి. ఒక వేళ సుప్రీం కోర్టు జోక్యం చేసుకుని దర్యాప్తు జరక్కుండా చక్రం అడ్డం వేస్తుందా అంటేే ఇప్పుడు దేశంలో అవినీతి సమస్యపై కోర్టుల వైఖరి రీత్యా అదీ అనుమానమే. జగన్‌ జనాదరణ లెక్కలు ఎలా వున్నా న్యాయపరమైన ఈ 'చిక్కులు' ఒకపట్టాన వదిలేవి కావు.
జగన్‌ కేసు పూర్వాపరాలు పర్యవసానాలు ఆయన వ్యాఖ్యలలో ఆంతర్యాలు వగైరాలపై తర్జనభర్జనలు జరుగుతుండగానే దేశంతో పాటు రాష్ట్రం దృష్టి కూడా అన్నా హజారే ిపైకి మరలింది. అదీ అవినీతిి వ్యతిరేక పోరాటంతోనే ముడివడిన పరిణామం. కాకపోతే ఇక్కడ జగన్‌ విషయంలో అవినీతి ఆరోపణలపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్‌ వారే అక్కడ తమను నిలదీస్తున్న అన్నాహజారేపై ఎదురు దాడి చేస్తున్నారు. అవినీతిని అరికట్టడం ప్రథమ కర్తవ్యం అంటూనే ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అందుకు తన దగ్గర మంత్ర దండం లేదంటున్నారు. సరిగ్గా పనిచేస్తే ప్రజాతంత్రాన్ని మించిన మంత్రదండం ఏముంటుంది? ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కుల ప్రకారం అన్నా హజారే నిరాహార దీక్ష చేస్తానంటే ఒక వైపున అడ్డుపడుతూ మరో వైపున లేని మంత్రదండం గురించి నిట్టూర్పులు విడవడమెందుకు? మంత్రదండం లేదంటూనే రాజదండాన్ని ప్రయోగించడమెందుకు? అవినీతిపై పోరాటాన్ని అణచివేసేందుకు అధికారమే మహాదండమని మన్మోహన్‌ సర్కారు భ్రమపడుతున్నట్టు దీన్నిబట్టి తేలిపోతుంది. చారిత్రాత్మకమైన ఎర్రకోట బురుజులపై ప్రతిష్టాత్మకమైన స్వతంత్ర దిన ప్రసంగం చేసిన ప్రధాని నిరాహారదీక్షలు దేశ ప్రగతికి అడ్డుపడుతున్నాయన్నట్టు మాట్లాడ్డం కన్నా హాస్యాస్పదం ఏముంటుంది? నిరాహారదీక్షలే నేరమైతే ఆయన స్వతంత్ర పతాకమే ఎగరవేయగలిగేవారు కాదు! ఈ దాడితో ఆగక అన్నాహజారేపై వ్యక్తిగతంగా ఆరోపణల వర్షం కురిపించేందుకు కూడా మంత్రులు పాలక పక్ష నేతలు సిద్దమైనారంటే ఎంతటి అసహనం ఆందోళన వారిని ఆవరించాయో అర్థమవుతుంది.అన్నా హజారే విమర్శకు అతీతుడు కాకపోవచ్చు.. కాని ఆయనను అవినీతి పరుడుగా చిత్రించడం ద్వారా ఆయన లేవనెత్తిన సమస్యను దారి తప్పించడం చాలా హీనమైన ఎత్తుగడ.ఈ వైఖరి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా పూర్తిగా బెడిసికొట్టి రాత్రికి రాత్రి ఆయన విడుదల చేసి చెంపలేసుకోవలసి వచ్చింది. ఇందుకు యువరాజు రాహులుడు బాధ్యుడన్న కథనాలు కూడా వెలువడ్డాయి.అయితే ఆయన ఆఖరి నిముషం వరకూ ఎందుకు ఉపేక్ష వహించినట్టో అర్థం కాదు.
హజారే చెప్పిందే వేదవాక్యమని తుచ తప్పకుండా అమలు చేయాలని ఎవరూ అనడం లేదు. గతసారి ఆయన దీక్ష సందర్బంలో దొర్లిన కొన్ని అపశ్రుతులపై హజారే దీక్ష: హజార్‌ సవాళ్లు అంటూ ఇదే శీర్షికలో చెప్పుకున్నాం. పౌర సమాజం పేరిట ఎన్జీవోలకు సర్వాతీత పాత్ర కట్టబెట్టనవసరం లేదు. ప్రభుత్వం రూపొందించిన లోక్‌పాల్‌ ముసాయిదాపై చర్చకు బదులు ఆయన జనలోక్‌పాల్‌ చుట్టూ పరిభ్రమించాల్సిన అవసరం కూడా లేదు. అవన్నీ నిజమే అయినా ఆయనను అప్రజాస్వామికంగా అరెస్టు చేయడం ఏ విధంగానూ సమర్థనీయం అవదు. ఈ దశలో ఆయన దేశ వ్యాపితంగా అవినీతి వ్యతిరేక పోరాటానికి ప్రతీకగా మారాడంటే అది అధినేతల అసహనం ఫలితమే.అరెస్టు చేసినంత మాత్రాన ఆ పోరాటం ఆగిపోతుందనీ కాదు. కాని లోక్‌పాల్‌ ముసాయిదా బలహీనంగా వున్నదనే వాస్తవం దేశం మరింత బాగా గుర్తించడానికి ఈ సందర్భం పనికి వచ్చింది.మూల విరాట్టును వదలిపెట్టి ఉత్సవ విగ్రహాలను శిక్షించినట్టు ప్రధానిని వదిలేసి అప్రధానులపై గురి పెట్టడంతోనే లోక్‌పాల్‌ వీక్‌పాల్‌గా జోక్‌పాల్‌ మాక్‌పాల్‌గా మారిపోయింది. న్యాయవ్యవస్థకు కమీషన్‌ను, ఎన్నికల సంస్కరణలనూ కూడా జోడిస్తేనే తప్ప అవినీతి ప్రక్షాళన సంపూర్ణం కాదు.కార్పొరేట్లు,అధినేతలు అధికారుల అపవిత్ర త్రయం అవినీతికి మూలకందంగా వుంది. సరళీకరణ వాటికి చట్టబద్దత కల్పించింది.ఇలాటి సమయంలో మరింత పకడ్బందీగా లోక్‌పాల్‌ తీసుకురావలసింది పోయి ప్రశ్నించిన వారిపై నిర్బంధానికి పాల్పడ్డం సహించరానిది. ప్రధానిని మినహాయించాలని మన రాష్ట్రంలో ఫ్రధానంగా లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ్‌తో సహా ఎందుకు వాదిస్తున్నారో అర్థం కాదు. జపాన్‌లో ప్రధానులు అనేక సార్లు మారారు.అమెరికా అద్యక్షులు వారి అర్థాంగులు కూడా ఆరోపణలను అభిశంసనలను ఎదుర్కొన్నారు. అంత మాత్రాన ఆ దేశాల్లో రాని అస్థిరత ప్రధానిని ప్రశ్నించగానే ఎందుకు వస్తుంది? స్వచ్చంద సంస్థలన్ని స్వచ్చంగా వున్నాయని చెప్పలేని నేటి నేపథ్యంలో వాటిపైనా దర్యాప్తు అధికారాలివ్వడానికి అభ్యంతరాలుండనవసరం లేదు. భూగర్భ ఖనిజాల నుంచి అంతరిక్ష తరంగాల వరకూ అవినీతి భుక్తమైపోతున్నందునే అన్నా హజారే ఇంతటి స్పందన పొందగలిగారని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించి ప్రతిపక్షాలతో సంప్రదించి సరైన లోక్‌పాల్‌ ఆమోదించే వరకూ ఆందోళనలు ఆగకూడదు. లేక పోతే రేపటి తరాలకు పర్వతాలు నదీనదాలు కూడా మిగలకపోవచ్చు!
(గమనం,ఆంధ్రజ్యోతి 18,8,11)

7 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. /ఆయనను అవినీతి పరుడుగా చిత్రించడం ద్వారా ఆయన లేవనెత్తిన సమస్యను దారి తప్పించడం చాలా హీనమైన ఎత్తుగడ.ఈ వైఖరి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోగా పూర్తిగా బెడిసికొట్టి రాత్రికి రాత్రి ఆయన విడుదల చేసి చెంపలేసుకోవలసి వచ్చింది./
    Well said, no doubt.
    /ప్రభుత్వం ప్రజాస్వామికంగా వ్యవహరించి ప్రతిపక్షాలతో సంప్రదించి సరైన లోక్‌పాల్‌ ఆమోదించే వరకూ ఆందోళనలు ఆగకూడదు. లేక పోతే రేపటి తరాలకు పర్వతాలు నదీనదాలు కూడా మిగలకపోవచ్చు!/
    True. Opposition(BJP, left/right, SP,DMK, AIADMK, BSP etc) are no holy cows.
    So, retired HC/SC judges, Secretaries, Defence officers should be included, in drafting Lokpal bill. CBI, CVC, state ACBs should be free from the influence of politicians. Courts may have seperate setup.

    EC should be strengthened to bar criminals from contesting elections.

    ReplyDelete
  3. ప్రధానమంత్రిని, judiciary ని లోక్పాల్ లోకి ఎందుకు తీసుకో రాకూడదో JP అనెకా కారణాలతో వివిరించాడు. అర్థం కాలేదు అంటం సరికాదు. మీరు వాటిని అంగీకరించటం లెదు అనండి. ఎందుకు ఆయన కారణాలు సరి అయినవి కావో విశ్లేషిస్తే బావుండేది. హజారే మొండిగా వ్యవహరిస్తుంటే, ప్రభుత్వం తెలివి తక్కువగా వ్యవహరిస్తోంది. మొండితనమే ఎక్కువ ప్రమాదకరమైనదని నేను నమ్ముతున్నాను..ఈ విషయంలో.

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. 'శంకర్‌
    అన్ని పార్టీలనూ కలిపి తిట్టిన తర్వాత అధికారులను కూడా నమ్మవలసిన అవసరమేమీ లేదు. లాభార్జన మీద అందులోనూ అక్రమ లాభార్జన మీద ఆధారపడిన వ్యవస్థ వున్నంత వరకూ అవినీతి భూతం వెంటాడుతూనే వుంటుంది.నిరంతర అప్రమత్తతే స్వాతంత్రానికి మూల్యం అన్నట్టు అవినీతి నిరోధానికి వివిధ యంత్రాంగాలు వుండాలి. జనం కనిపెట్టి వుండాలి. అందరినీ కలిపి తిట్టేవారు కూడా తరతమ తేడాలు చూపించాలి. కాకపోతే శంకర్‌ కామెంట్‌లో బిజెపిని విడిగా పేర్కొని రైట్‌ అన్నారు. అది అన్నిటికన్నా ముందు ఆ పార్టీకే వర్తించే మాట.

    పావని
    .ప్రధానిని ఎందుకు చేర్చవచ్చునో నేను రాశాను. జెపి ఎందుకంటున్నారో అర్థం కాదు అన్న మాటలకు కూడా అర్థం వేరు. ఆ అభ్యంతరాలు సమంజసం కాదు అనే భావం. దానికి నా వివరణ కూడా తర్వాత వుంది. దాంతో మీరు ఏకీభవించకపోవచ్చు గాని నేను వివరణ ఇవ్వలేదంటే

    ReplyDelete
  6. /కాకపోతే శంకర్‌ కామెంట్‌లో బిజెపిని విడిగా పేర్కొని రైట్‌ అన్నారు. అది అన్నిటికన్నా ముందు ఆ పార్టీకే వర్తించే మాట./

    కాంగ్రెస్ తరువాతనే ఎవరైనా... BJP, వామపక్షాలు(left/right).. ఇలా అన్నానే !?
    తరతమ భేధాలుండకూడదండీ, చట్టం ముందు అంతా సమానులే! అవినీతిని బట్టి శిక్షలో భేధాలుంటే వుండవచ్చు. కడుపుకోసం పిక్‌పాకెట్ చేసినోడికి, కోట్లు తిన్న కనిమోళికి ఒకే శిక్ష వేయలేం కదా.

    ReplyDelete
  7. america , japan public different, vallaki tagga rules vallaku vunnia. manam okappudu anta kanna goppavallam, ippudu kaadu. amrica, japan la lo jariginavatito polchi mana desam ade jarigite elavuntundo alochana cheyyagalara!

    ReplyDelete