ప్రతిష్టాత్మకమైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-11 బోగీ కాలి బుగ్గయి పోవడం, 32 మంది సజీవ దహనం కావడం మనసులను కలచి వేసే దారుణం. సందర్శనలు, సంతాపాలు, దర్యాప్తు నివేదికలు షరా మామూలుగా జరిగిపోతాయి గాని దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామా? రైల్వేల అభివృద్ధి ఆధునీకరణ గురించి కోతలు కోసే పాలకులు ప్రయాణీకుల భద్రతా ప్రమాణాలను సదుపాయాల కల్పనను గాలికొదిలేస్తున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది బద్జెట్‌లో 60 వేల కోట్ల ప్రణాళిక ప్రతిపాదిస్తే అందులో భద్రతకు కేటాయించింది కేవలం 2000 కోట్లు! అవైనా వినియోగం అందులోనూ సద్వినియోగం అవుతాయన్న హామీ లేదు. చాలా కాలంగా రైల్వేల్లో నియామకాలు స్తంభించిపోయాయి. 18 లక్షల నుంచి సిబ్బంది సంఖ్య 14 లక్షలకు తగ్గింది. మరీ ముఖ్యంగా రైళ్లు నడిపే లోకో రన్నింగ్ సిబ్బందిని బాగా కోత కోసి 36 గంటలు కూడా నడిపిస్తున్నారు.ట్రాక్ మెన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలసిన అవసరం వుండగా దాదాపు ఆ పద్ధతినే ఎత్తి వేస్తున్నారు. కొత్త లైన్లు వేయలేదు గాని రైళ్లు, బోగీలు, బెర్తులు అన్నీ పెరిగాయి.రోజుకు రెండు కోట్ల మందిని చేరవేసే రైల్వేలు భద్రతకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాల్సి వుండగా వున్న ఏర్పాట్లకు కూడా తిలోదకాలిస్తున్న స్థితి. పెట్టెలలో తనిఖీ, పట్టాల తనిఖీ రెండూ
Tuesday, July 31, 2012
డేంజర్ పట్టాలపై రైళ్లు!
ప్రతిష్టాత్మకమైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఎస్-11 బోగీ కాలి బుగ్గయి పోవడం, 32 మంది సజీవ దహనం కావడం మనసులను కలచి వేసే దారుణం. సందర్శనలు, సంతాపాలు, దర్యాప్తు నివేదికలు షరా మామూలుగా జరిగిపోతాయి గాని దీని నుంచి పాఠాలు నేర్చుకుంటామా? రైల్వేల అభివృద్ధి ఆధునీకరణ గురించి కోతలు కోసే పాలకులు ప్రయాణీకుల భద్రతా ప్రమాణాలను సదుపాయాల కల్పనను గాలికొదిలేస్తున్నారు. ఉదాహరణకు ఈ ఏడాది బద్జెట్‌లో 60 వేల కోట్ల ప్రణాళిక ప్రతిపాదిస్తే అందులో భద్రతకు కేటాయించింది కేవలం 2000 కోట్లు! అవైనా వినియోగం అందులోనూ సద్వినియోగం అవుతాయన్న హామీ లేదు. చాలా కాలంగా రైల్వేల్లో నియామకాలు స్తంభించిపోయాయి. 18 లక్షల నుంచి సిబ్బంది సంఖ్య 14 లక్షలకు తగ్గింది. మరీ ముఖ్యంగా రైళ్లు నడిపే లోకో రన్నింగ్ సిబ్బందిని బాగా కోత కోసి 36 గంటలు కూడా నడిపిస్తున్నారు.ట్రాక్ మెన్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయవలసిన అవసరం వుండగా దాదాపు ఆ పద్ధతినే ఎత్తి వేస్తున్నారు. కొత్త లైన్లు వేయలేదు గాని రైళ్లు, బోగీలు, బెర్తులు అన్నీ పెరిగాయి.రోజుకు రెండు కోట్ల మందిని చేరవేసే రైల్వేలు భద్రతకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాల్సి వుండగా వున్న ఏర్పాట్లకు కూడా తిలోదకాలిస్తున్న స్థితి. పెట్టెలలో తనిఖీ, పట్టాల తనిఖీ రెండూ
Sunday, July 29, 2012
రాజకీయ అనిశ్చితి-ప్రాంతాల పల్లవులు!
రాష్ట్రాన్ని విభజించదలిస్తే ముందు రాయలసీమ నాలుగు జిల్లాలను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తెలుగు దేశం ఫ్రధాన కార్యదర్శి హౌదాలో వున్న కర్నూలు జిల్లా నాయకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు. తెలంగాణాపై తెలుగు దేశం స్పష్టత ఇస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్న తరుణంలో రాయలసీమ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ౖ అదే జిల్లాకు చెందిన కె.ఇ.కృష్ణమూర్తి వాటిని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ నేత కె.తారక రామారావు తెలంగాణా ఏర్పాటు తర్వాత మీరు రెండు కాకుంటే పన్నెండు చేసుకోండి అంటూ నాన్న గారి శైలిలో స్పందించగా మరో నేత హరీష్‌రావు బైరెడ్డి ప్రకటనను చంద్రబాబు కుట్రలో భాగంగా వర్ణిస్తూ లేకపోతే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. నిజానికి గతం నుంచి టిజివెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి,జి.శ్రీకాంతరెడ్డి,మైసూరా రెడ్డి వంటి కాంగ్రెస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు ఇలాటి వాదనలు వినిపిస్తూనే వున్నారు. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వుండగా 1986 ప్రాంతంలో సాక్షాత్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి వత్తాసుతోనే మైసూరా రెడ్డి, ఎం.వి.రమణారెడ్డి, భూమన్ వంటి వారు రాయలసీమ ప్రత్యేక
మోడీ ఉరి సవాలు - సరికొత్త వ్యూహం
గుజరాత్ మారణహౌమంలో తన పాత్ర వున్నట్టు తేలితే ఉరికైనా సిద్ధమేనని ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నయా దునియా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం రాజకీయంగా చాలా వ్యూహాత్మకమైంది. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల సన్నాహాలలో భాగంగానే దీన్ని చూడకతప్పదు. ప్రధాని అభ్యర్థిగా మోడీని ఆమోదించేందుకు ఆ పార్టీలోనే అనేక మంది సిద్దంగా లేరు. ఈ రాష్ట్ర బిజెపి నాయకత్వంలో కీలకమైన ఒక వ్యక్తి నాతోనే అలాటి అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా బిజెపి ఇప్పుడున్న స్తితిలో మోడీని పూర్తిగా పక్కన పెట్టగల స్థితిలో లేదు గనకే ఆయన కోసం సంజరు జోషిని పక్కన పెట్టింది. అద్వానీ కూడా అప్పుడు గైర్ హాజరైనా తర్వాత మోడీని కలిసి ప్రశంసలు కురిపించారు. దేశ విదేశ కార్పొరేట్ ప్రతినిధుల్లో కొందరు మోడీని రంగం మీదకు తేవాలని ఉత్సాహంగా వున్నారు గనకే అమెరికా పత్రికల్లోనూ దేశ రాజకీయాలను మోడీ కి రాహుల్‌కు మధ్య పోటీగా చిత్రిస్తున్నారు.ఈ నేపథ్యంలోన కాస్త ఆమోదయోగ్యత పెంచుకోవడానికే మోడీ మొదట్లో చెప్పుకున్న వ్యాఖ్యల వంటివి చేస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించి తాను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అదే ఇంటర్వ్యూలో చెప్పిన మోడీ ఇక ఉరి వంటి పెద్ద శిక్ష ల గురించి ప్రస్తావించాల్సిన అవసరమేమిటి? కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ అన్నట్టు పదేళ్లలో ఆయనపై గుజరాత్ పోలీసులు ఒక్క ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయనప్పుడు శిక్షల
అన్నా హజారే వ్యవహారం
సామాజిక రంగంలో వ్యక్తుల ప్రాధాన్యతలు ప్రభావాలు వారి వైఖరిలోని వాస్తవికతను బట్టి మారుతుంటాయి. అన్నా హజారే వ్యవహారం అలాగే వుంది. కొద్ది మాసాల కిందట ఆయన చిత్తరువు దేశాన్ని వూపేసింది. ప్రతిచోటా అనేక మంది ఆయనను చూసి ఉత్తేజ పడ్డారు.ప్రభుత్వం కూడా అధికారికంగా ఆయనతో సంప్రదింపులు జరిపింది. తర్వాత..? ఆయన చుట్టూ వున్న బృందంలోనే తేడాలు వచ్చాయి. రామ్‌దేవ్‌తో ఆయన జట్టు కట్టడంలోనూ అనేక విభేదాలు కనిపించాయి. ఆయన అవినీతిపై పోరాటం చేస్తూనే కార్పొరేట్ శక్తుల గురించి ప్రస్తావించడం లేదని, మోడీ వంటి వ్యక్తిని ప్రశంసించడం బాగా లేదని వివిధ తరగతుల నుంచి వ్యాఖ్యలు వెలువడ్డాయి. కర్ణాటకలో ఇంత బాహాటంగా సాగుతున్న అవినీతి అంతర్గత కలహాలపై ఆయన బృందం నుంచి ఎలాటి స్పందన లేదు కాని ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత ఆయనపై ఆభియోగాల దండకం చదివిన అన్నా వైఖరిని ఆయన సత్యాగ్రహ వేదికపైనే రామ్ దేవ్ విమర్శించారు. అవినీతిపై పోరాటం సందర్భంలో వ్యక్తిగత కేంద్రీకరణ తగదన్న భావం మన్మోహన్ సింగ్‌పై ఆరోపణల విషయంలో లోక్‌సత్తా నేత జయ ప్రకాశ్ వ్యాఖ్యల్లో వ్యక్తమవుతున్నది. మొత్తంపైన అన్నా బృందం గతంలో వలె ఏకోన్ముఖ మద్దతు పొందలేకపోతున్నదంటే వారి వైఖరిలో సమగ్రత వాస్తవికత లోపించడం ప్రచార దృష్టి పెరగడం కూడా కారణాలే. అందువల్లనే ఆయన శిబిరం దగ్గర జన సందోహం కూడా తగ్గింది. అది పెద్ద సమస్య కాదని ఆయన అన్నా దానికి కారణాలు కూడా చూడాల్సిన అవసరం వుండనే వుంటుంది. అవినీతిని మిగిలిన ఆర్థిక విధానాల నుంచి విడదీసి చూడటం, అందులోనూ పాక్షికంగా వ్యవహరించడం పరిష్కారం చూపించదు.ఎన్జీవోలు మాజీ అధికారులే అవినీతి ప్రక్షాళన చేసేస్తారన్న భావన కూడా సరైంది కాదు. విశాల జన రాశుల భాగస్వామ్యంతో విధానాల ప్రాతిపదికన పోరాడితేనే అవినీతికి కళ్లెం వేయడం సాధ్యపడుతుంది.
Saturday, July 28, 2012
మంగుళూరులో ఒక వికృతం, ఒక అకృత్యం
మంగుళూరులో రేవ్ పార్టీల పేరిట విహెచ్‌పి దుండగులు యువతీ యువకులపై దౌర్జన్యానికి దిగడం సహించరాని విషయం.గతంలోనూ శ్రీ రాం సేన పేరిట ఇలాటి దుశ్చర్యలే అక్కడ జరిగాయి. వలైంటీన్స్ డే సందర్భంగా హైదరాబాదులోనూ ఇలాటి పోకడలు చూశాము. ఆ పార్టీలూ పబ్బులూ వికృత మనడంలో సందేహం లేదు గాని ఇలా దాడులు దౌర్జన్యాలు చేసే అధికారం వీరికెక్కడిది? మతం పేరిట సంప్రదాయం పేరిట ఇతరులపై బల ప్రయోగం చేసే వారు తమ వ్యక్తిగత ప్రవర్తన గురించి ఎక్కడైనా ముద్ర వేయించుకొచ్చారా? సమాజంలో సంచలనం కలిగించేందుకు భయ భ్రాంతులు సృష్టించేందుకు తప్ప ఇలాటి చర్యలు ఉపయోగపడవు. అవినీతి భరితమైన కర్ణాటక వ్యవహారాలు చూస్తే హిందూత్వ శక్తుల నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుంది. గాలి జనార్థన రెడ్డి వంటివారిని నెత్తిన పెట్టుకున్న పరివార్ మరెవరికో నీతి పాఠాలు అది కూడా బలవంతంగా నేర్పిస్తామనడం అనుమతించరాని అమానుషం.
భారత్‌పై అమెరికా ఆధిపత్య ప్రత్యక్ష ప్రభావం
భారత దేశంపై అమెరికా ఆధిపత్య వ్యూహాల ప్రత్యక్ష ప్రభావం ఇప్పుడు మరింత స్పష్టమవుతున్నది. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం ఆలస్యమవుతున్నదని అద్యక్షుడు ఒబామా అసహనం ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాని మన్మోహన్ ప్రతిస్పందించి చర్యలు ప్రారంభించారు. సిరియాలో జోక్యానికి అమెరికా ఐరాసలో ఒత్తిడి పెంచితే చైనా రష్యా వీటో చేశాయి.కాని భారత దేశం దానికే వంత పాడి ఓటేసింది. కాశ్మీర్ సమస్య వంటి వాటిలో అమెరికా జోక్యానికి ప్రయత్నించిన చేదు అనుభవాలు మర్చిపోయింది. తాజాగా మన చమురు అవసరాల్లో 70 శాతం దిగుమతి అవుతున్న ఇరాన్‌తో సంబంధాలను అమెరికా మెప్పుకోసం ఫణం పెట్టడానికి కూడా సిద్ధమైంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులు చేసుకోరాదన్న ఆంక్షలకు తలవొగ్గి మనకు మూడు ఓడల చమురు రావలసి వుండగా ఒక దానికే పరిమితం చేసుకుంటున్నది. ఇప్పటికే పెట్రోలు ఉత్పత్తుల ధరల మోత మోగుతుంటే ఇలాటి నిర్ణయాలు మరింత సంక్షోభానికి దారి తీయడం అనివార్యం. ఈ వ్యవహారంలో అనేక సాంకేతికాంశాలు వున్నా కీలకం మాత్రం అమెరికా ఆంక్షలను పాటించాలన్న ఆతృతే.మరో వైపున వారి ధోరణి చూస్తే మాత్రం భారతీయులు వచ్చి ఉద్యోగాలు ఎగవేసుకుపోతున్నారన్న ఒబామా మాటల్లో స్పష్టమవుతున్నది.
మనుగడ కోసం మంత్రులకు రక్షణ
మాధ్యమిక విద్యా మంత్రి పార్థసారథి రాజీనామా చేయాలా వద్దా అనే దానిపై నిజానికి ఎలాటి సందేహాలు లేవు. ఆయన తప్పుకోవడం రాజకీయ విలువల ప్రకారమే గాక రాజ్యాంగ సూత్రాల ప్రకారం కూడా తప్పని సరి. అయినా దానిపై ఇదమిద్దంగా కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు ఏమీ చెప్పలేని స్థితి. ఎందుకంటే ఆయన రాజినామా ప్రసక్తి వస్తే వెంటనే మిగిలిన ఆరు మంది సంగతి ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఆరుగురు మరో ఆరుగురిని కలుపుకోగలిగితే ప్రభుత్వమే కుప్పకూలుతుంది.
పార్థసారథి రాజినామా చేయాలా అక్కర్లేదా అనే ప్రశ్న నిజానికి పెద్ద క్లిష్టమైనది కాదు. నేరం ఆర్థికమైన మరో రకమైనా ఇప్పుడు జరిగినా ఎప్పుడు జరిగినా శిక్ష ఇప్పుడు పడింది. కనక తప్పు జరిగిందా లేదా అనే ప్రశ్నకు ఆస్కారం లేదు. ఇన్నేళ్లుగా వె ంటాడుతున్న తప్పుకు ఇప్పుడు శిక్ష పడింది. బ్యాంకు రుణం మంజూరు కానందునే తాము అనుకున్న పరికరాలు దిగుమతి చేసుకోలేకపోయాము తప్ప వేరే అపరాధం లేదని మంత్రి అంటారు. బ్యాంకు రుణం మంజూరు చేయకపోవడానికి చాలా పొరబాట్లు కారణంగా చూపించింది. ఆ నాటి సంగతి వదిలేస్తే దానిపై ఈడీ నోటీసు మంత్రిగా వున్నప్పుడే వచ్చింది. చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి ఆ వారంట్లను బేఖాతరు చేయడం
హౌం శాఖ నివేదిక పేర నిరాధార వివాదం
సిరిసిల్ల ఘటనకు ముందే తెలంగాణా సమస్యకు సంబంధించి విభిన్న వూహాగానాలు వెలువడుతూ వచ్చాయి. మూడు మాసాల్లో వచ్చేస్తున్నట్టు తనకు సంకేతాలు అందాయని కె.సిఆర్ ప్రకటిస్తే అలాటివి తనకు రాలేదని కోదండరాం,విజయశాంతి ప్రకటించారు. ఎలాగూ వచ్చేస్తుంటే అడ్డుకోవడాలు ఎందుకనే ప్రశ్న కూడా సహజంగానే ఎదురైంది. తాడూ బొంగరం లేని ఈ కథనాల మధ్య ఇప్పుడు రాష్ట్ర విభజన సాధ్యం కాదంటూ హౌం శాఖ నివేదిక నిచ్చిందని మరో వార్త, దానిపై ఆరోపణలు ప్రత్యారోపణలు. అసలు నిర్ణయం తీసుకోవలసిన కేంద్రం కావాలని జాప్యం చేస్తుంటే నిరాధార వాదోపవాదాలు పెంచి ప్రజలు ప్రాంతాల మధ్య వాతావరణం కలుషితం చేయడం పరిపాటిగా మారుతున్నది. ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి కావడానికి ప్రాంతీయ సమస్య పరిష్కారానికి సంబంధం ఏమిటి? ఆయన పదవిలోకి రాగానే ఈ సమస్యపై నివేదిక తెప్పించుకున్నారని కథనాలు ఏమిటి? హౌం శాఖ ఆధ్వర్యంలోనే డిసెంబర్ 9 ప్రకటన,అఖిల పక్ష సమావేశాలు,శ్రీకృష్ణ కమిటీ నియామకం వగైరా జరిగాయి గనక వారి అధ్యయనం ఏదో వుంటే వుండొచ్చు గాని అధిష్టానం నిర్ణయం లేకుండా ఆ శాఖ చేసేదేమిటి? కాంగ్రెస్ ముందుగా నిర్ణయం చెబితే గాని ఏమీ చేయలేమని చిదంబరం ఇది వరకే చెప్పేశారు కూడా. కనక కేంద్రానికి సీమాంధ్ర నేతలు అడ్డుపడుతున్నారని, సీమాంధ్ర మీడియా కథలు వదులుతున్నదని కొందరు , తెలంగాణా వాదమే ఎక్కువై మా వాదన వినిపించుకోవడం లేదని మరి కొందరు సాగిస్తున్న హడావుడి స్థానిక మనుగడ కోసమే. ఈ హడావుడిలో స్పష్టత ఇస్తామంటూ తెలుగు దేశం, మా వైఖరి స్పష్టమంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వీటిపై పెద్ద తర్జనభర్జనలు అవసరమే లేదు. రాష్ట్రపతి ఇలాటి విషయాల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం రాజ్యాంగంలోనే లేదు.
ఓనమాలు .. మానవత్వం ఆనవాలు..
సకుటుంబంగా సలక్షణంగా చూడదగిన చిత్రం కోసం నిరీక్షించే వారికి సంతోషదాయకమైన కానుక సన్‌షైన్ ఫిలిమ్స్ ' ఓనమాలు'. వర్తమాన యుగంలో వక్రధోరణులనూ అక్రమాలను అనౌచిత్యాలనూ చూసినప్పుడు కలిగే ఆవేదనకు తెర రూపం ఈ చిత్రం. యువ దర్శక నిర్మాత క్రాంతి మాధవ్ తొలి ప్రయత్నంలోనే ఇలాటి అర్థవంతమైన చిత్రం అందించడం అభినందనీయం.
నారాయణ రావు మాష్టారు( ఇంకెవరు, రాజేంద్ర ప్రసాదే) ఆ వూరితో పెనవేసుకుపోయిన మానవతా మూర్తి. పిల్లలకు చదువులతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పే గురువు. భార్య రుక్మిణి(కళ్యాణి) కోపతాపాలను మురిపెంగా సర్దుబాటు చేసుకుంటూ వూరి గురించే ఆలోచించిన వ్యక్తి. భార్య చివరి కోర్కె మేరకు అమెరికాలో కొడుకు దగ్గరకు వెళ్లినా నిరంతరం వూరే ఆయన మదిలో మెదులుతుంటుంది.ఆ జ్ఞాపకాలు మనవళ్లకు చెబుతూ కాలక్షేపం చేస్తుంటాడు. స్వదేశాగమనాన్ని ఏళ్లతరబడి వాయిదా వేస్తున్న కొడుకుతో పోట్లాడలేక తనకు తానుగానే వచ్చేస్తాడు. మధుర జ్ఞాపకాలతో బయిలు దేరిన నారాయణరావు స్వగ్రామం చేరుకోవడం ప్రథమార్థమైతే ఆయన ప్రతిస్పందన ద్వితీయార్థం.
పల్లెల్లో ఒకనాటి ఆత్మీయ సంబంధాలు, కుల మత ప్రసక్తి లేని అన్యోన్యతలు, ె్లబడి పిల్లల సహజ సిద్ధమైన ఆటలు అసూయలు, దాంపత్య జీవితపు సరదాలు, జాతరలు, ఆచారాలు,
Thursday, July 26, 2012
అసోం హింసా కాండలో హెచ్చరికలు
అసోంలోని కోక్రాజార్ ప్రాంతంలో అకస్మాత్తుగా చెలరేగిన హింసా కాండ చిరాంగ్,దుబ్రి,బొంగైగాన్ జిల్లాలకు పాకి డజన్ల మంది ప్రాణాలు బలితీసుకుంటున్నది. దాదాపు రెండు లక్షల మంది శరణార్థి శిబిరాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గోగోరు ఆధ్వర్యంలో మూడో సారి గెలిచి రికార్డు సృష్టించామని చెప్పుకున్న చోట ఇంతగా పరిస్థితి అదుపు తప్పి పోవడానికి చాలా కారణాలే వున్నాయి. ఈ సందర్భంలో చెప్పాలంటే జులై ఆరవ తేదీన ఘర్షణలు ప్రారంభం అయినప్పుడు అదుపు చేయడానికి గట్టి చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించారు. అవి ఇప్పుడు అదుపు తప్పిపోయి యాభై గ్రామాలు భస్మీపటలమయ్యాయి. అటు చూస్తూ బోడో గిరిజనులు ఇటు చూస్తే ముస్లిం మైనారిటీ తరగతులు అల్లకల్లోలానికి హత్యాకాండకు గురవుతున్నారు. వారు వలస వచ్చిన వారు గనక తమ అవకాశాలు దెబ్వతింటున్నాయనేది వీరి వాదన కాగా మత కోణంలోనూ కొన్ని రాజకీయ శక్తులు అందుకు వంతపాడి ఆగ్నికి ఆజ్యం పోశాయి. బోడో స్వయం పాలక జిల్లాలో సాగుతున్న ఈ హత్యాకాండ వెనక పథకం వుందని ఉభయ వర్గాల నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు వీటిని పరిష్కరించడం కన్నా
వామపక్షాల విద్యుత్ ఉద్యమంపై మళ్లీ దృష్టి
విద్యుచ్చక్తి రేట్ల పెంపు, సరఫరా సంక్షోభంపై వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన సచివాలయ ముట్టడి సహజంగానే రాజకీయ వర్గాలనూ మీడియానూ కూడా బాగా ఆకర్షించింది. పుష్కరం కిందట ఈ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన విద్యుత్తేజానికి సంధాన కర్తలు వామపక్షాలేనన్నది అందరికీ తెలిసిన విషయం. నాటి తెలుగు దేశం ప్రభుత్వ సంస్కరణలకూ భారాలకు వ్యతిరేకంగా సాగిన ఆ ఉద్యమంలో కాంగ్రెస్ ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చురుగ్గా పాల్గొన్నారు.తర్వాత అధికారంలోకి కూడా వచ్చారు.అయితే అదే సంస్కరణలు సాగించడమే గాక మరింత ఉధృతం చేశారు. అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేర్చారు. ఆ దశలో 2008లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల భూపోరాటం మళ్లీ సంచలనం కలిగించింది. విద్యుదుద్యమంలో బషీర్‌బాగ్, భూ పోరాటంలో ముదిగొండ రక్తసిక్తమయ్యాయి. నిజానికి వైఎస్ సంక్షేమ పథకాల హౌరు పెరిగింది ఆ తర్వాతే.ఆ నేపథ్యంలో చాలా తర్జనభర్జనల తర్వాత ఏర్పడిన మహాకూటమిలో తెలుగుదేశం,టిఆర్‌ఎస్‌ల మధ్య సీట్ల పోట్లాట స్వల్ప తేడాతో వైఎస్ మళ్లీ గద్దెక్కడానిక కారణమైంది. ఆ తర్వాత ఆయన మరణం, జగన్ తిరుగుబాటు, కెసిఆర్ నిరాహారదీక్ష వగైరాలు రాజకీయాలను అనిశ్చితి అంచులకు తీసుకెళ్లాయి. ఈ క్రమంలో పేరుకు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నా యాత్రలు చేస్తున్నా ప్రధాన పార్టీలన్ని సీట్ల వేటలోనే
ఈగ విజయం.... రాజమౌళి
ఈగ చిత్రం విజయం తర్వాత తెలుగు చిత్ర రంగం శక్తి సామర్థ్యాల గురించి ముఖ్యంగా రాజమౌళి ప్రతిభా విశేషాల గురించి చాలానే చర్చ జరుగుతున్నది. నాని(కొద్దిసేపే),సమంత,సుదీప్(ప్రధానంగా)ల నటన, ఈగకు సంబంధించిన సాంకేతిక విన్యాసం ఇవన్నీ ఆ చిత్ర విజయానికి దోహదం చేశాయి. ఏ కథనైనా ఉద్విగ భరితంగా తీయడంలో రాజమౌళికి ఒక ప్రత్యేక నేర్పు వుంది. మగధీర ఘన విజయం గురించి ఎవరికి వారు చెప్పుకోవచ్చు గాని ఈగధీర విజయం పూర్తిగా ఆయన ఖాతాలోకి రావలసిందే. అయితే ఆయనను లేదా తెలుగు సినిమాను అంచనా కట్టడానికి ఈగ కొలబద్ద అవుతుందా? అంటే కాదనే చెప్పాలి. నా ఉద్దేశంలో మర్యాదరామన్న రూప కల్పన ఇంతకంటే అభినందనీయమైంది. అందులోనూ పెద్ద సామాజిక సమస్యలున్నాయని కాదు గాని తెలుగు చిత్రాల్లో అరుదుగా కనిపించే నేటివిటీని సృష్టించగలిగాడు అందులో.ఈగ ఏ దేశంలో ఏ భాషలో తీసినా పెద్ద తేడా ఏమీ వుండదు. పైగా ఇందులో ఈగకు సంబంధించిన సన్నివేశాలలో వైవిధ్యం చాలా తక్కువ. శంకర్ అపరిచితుడు తీసినపుడు నేను అతి పరిచితుడు అంటూ వర్ణించాను. ఏమంటే ఆధునికత, సనాతన విశ్వాసాల మధ్య నలిగిపోతూ అవినీతిపై వ్యతిరేకత, అభివృద్ధి గురించిన అస్పష్టత వున్న నేటి భారతీయుడికి శంకర్ నమూనా బాగా అమరింది. అదే శివాజి,రోబో చిత్రాల దగ్గరకు వచ్చేసరికి యాంత్రికత, పటాటోపం ప్రధానమైనాయి. రాజమౌళి ఆయన అభిమానులు కూడా ఈగ విజయానికి ఎంతగా సంతోషించినా దాని పరిమితులు కూడా గమనించడం అవసరం.
Wednesday, July 25, 2012
క్షుద్ర పూజల వ్యవహారంలో చిక్కు ప్రశ్నలు
డిజిపి దినేష్ రెడ్డికీ, సీనియర్ ఐపిఎస్ ఉమేష్ కుమార్‌కు మధ్యన సాగుతున్న వివాదంలో ఇప్పుడు దేవతలు పూజలు కూడా ప్రవేశించడం విడ్డూరం. ఈ సాయింత్రం మీడియాలో చూసిన ప్రకారం కొన్ని మాసాల కిందట ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి, డిజిపికి హాని జరగాలని పూజలు చేయించారట. కొంతమంది పేరు చెప్పగా కొందరు చెప్పకుండా వదిలేశారు.చెప్పినా చెప్పకున్నా వూహకందనిదేమీ కాదు. ఇంతకూ ఇక్కడ పూజలు చేయించారా లేదా అన్నది ఒకటైతే పూజలు చేయిస్తే హాని జరుగుతుందా అన్నది మరొకటి. ఆ ప్రకారం కేసు పెట్టవచ్చునా అని ఒక రిటైర్డు పోలీసు ఉన్నతాధికారిని అడిగితే తనకూ స్పష్టత లేదన్నారు. వారి మధ్య వైరం గురించి ఎలాటి భిన్నాభిప్రాయాలు లేకున్నా మీడియలో ఒక వైపు కథనాలే వస్తున్నాయని గతంలో ఒకరు ఫోన్ చేసి చెప్పారు. ఇదంతా ఒక పోలీసు పోరు అనుకోవాలి. అది ఎలా వున్నా అశాస్త్రీయమైన పూజలు చేసినందుకు, రక్తం ఉపయోగించినందుకు కేసు పెట్టవచ్చునేమో గాని ఫలానా వారికి వ్యతిరేకంగా చేసినందుకు కేసు పెట్టే అవకాశం చట్టంలో వుందా? వుంటే చట్టం మూఢత్వాన్ని ఆమోదిస్తుందా?గతంలో చాలా మంది అధినేతలు రకరకాల యజ్ఞయాగాలు బలి క్రతువులు చేసినప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు.
కాంగ్రెస్ కమిటీ సిఫార్సుల ఫార్సు!
వరుస ఓటముల తర్వాత కాంగ్రెస్ కాయకల్ప చికిత్స కోసం సూచనలకై నియమించిన కమిటీ సిఫార్సులు(సున్నితంగా చెప్పాలంటే) అవాస్తవికతకు అద్దం పడుతున్నాయి.తమ ప్రభుత్వ లోపాలు, అవకతవకలు, అవినీతి ఆరోపణలు, కేంద్రం సృష్టించిన ఎడతెగని అనిశ్చితి ఇవన్నీ సమస్యలుగా వారికి కనిపించలేదు.ఫీజులు,విద్యుత్తు;ధరలు, రైతుల సమస్యలు, శాంతి భద్రతలు, జల యజ్ఞం జాప్యాలు వగైరాలన్ని ప్రధాన కారణాలుగా అగుపించలేదు.తమ పథకాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటున్నది గనక ఇందిరమ్మ పేరో మరొకటో తగిలించి మళ్లీ ఖాతాలో వేసుకోవాలన్న తాపత్రయమే నివేదికపై ఇచ్చిన వివరణలో కనిపించింది. అంతేగాని అశేష ప్రజల ఆగ్రహానికి అసంతృప్తికి ఆవేదనకు కారణమైన విధానాలను కాస్తయినా సవరించుకోవడానికి సిద్ధం కాలేదు. ఇంకా చెప్పాలంటే ఆత్మవిమర్శకు బదులు ఆత్మస్తుతికి ప్రచార సాధనాలు సమకూర్చుకోవడమే తారకమంత్రమని భావిస్తున్నారు. అందుకోసం పత్రిక పెట్టాలని ఛానెల్ ప్రారంభించాలని సిఫార్సు చేశారు.ఇప్పుడు కూడా ప్రభుత్వ ధనంతో ప్రత్యక్ష ప్రసారాలు బాగానే చేయించుకుంటున్న సంగతి అందరూ చూస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో పార్టీ వారిని వెంటనే నియమించేయాలని మరో సిఫార్సు. నిజంగానే చాలా కాలంగా కమిషన్లు, కమిటీలు, చాలా వరకు ఖాళీగా అఘోరిస్తుంటే అధికార పక్షీయుల బాధకు అంతు లేదు గనక ఈ సిఫార్సు వారికి బాగా నచ్చ వచ్చు. మొత్తంపైన పార్టీకి రాజకీయంగా లబ్ది ఎలా చేకూర్చావాలనే ఆలోచన తప్ప ప్రజల పరంగా ఆ నివేదికలో ఏమీ సిఫార్సులు చేసినట్టు మీడియాతో మాట్లాడిన ధర్మాన చెప్పింది లేదు. ప్రజాగ్రహాన్ని ప్రచారంతో చల్లార్చవచ్చని వారు అనుకుంటున్నారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది.
రాష్ట్ర మంత్రులు- రాజకీయ నైతిక ప్రమాణాలు
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రకరకాల ఆరోపణలకు అభిశంసనలకు గురయ్యే మంత్రుల సంఖ్య పెరిగిపోతున్నది. అయితే వాటిపై ముఖ్యమంత్రి లేదా కాంగ్రస్ పార్టీ ప్రతిస్పందనే వుండటం లేదు. తాజాగా మంత్రి పార్థసారథిపై ఫెరా నిబంధనల వుల్లంఘన కింద జరిమానా జైలు శిక్ష విధించడం విషయంలోనూ అదే జరుగుతున్నది. సహజంగానే మంత్రి ఆయన అనుయాయులు సమర్థించుకుంటున్నా ఆ స్థాయిలో ఇలాటి తీర్పు రావడం చిన్న విషయం కాదనేది నిర్వివాదాంశం. పై కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ అది వచ్చిన తీర్పును మటు మాయం చేయదు. పాత నేతలను పక్కన పెట్టినా మహారాష్ట్ర వంటి చోట్ల కూడా తీర్పులు రాగానే మంత్రులు గవర్నర్లు తప్పుకున్న ఉదంతాలు చాలా వున్నాయి. అయితే అలాటి ప్రమాణాలకు ఈ ప్రభుత్వం విలువ ఇస్తుందని ఏ వి ధంగానూ ఆశించలేము. అలాగే సదరు మంత్రులు కూడా సవాలుగా తీసుకుని పదవులు వదులుకునే ప్రసక్తి అంతకన్నా వుండటం లేదు. గాలి బెయిల్ డీల్‌లో న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేరు మొదట వచ్చి తర్వాత వెనక్కు పోయింది. ఇప్పుడు మళ్లీ వచ్చింది. అయినా ఆయన పదవిలో కొనసాగుతూ గంభీరోక్తులు పలకడం తప్ప పక్కకు తప్పుకోవడానికి సిద్దపడరు. పరిశుభ్రమైన పారదర్శకమైన కిరణ్ పాలన విచిత్రాలలో ఇవి కొన్ని మాత్రమే.ఇలా మాట్లాడిన వారిపై ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేయడం తప్ప కాస్తయినా పరిశీలించుకునే ధోరణి ఈ ప్రభుత్వానికి ఏ కోశానా లేదు.
జగన్‌కూ సాయం చేస్తే పోలా!
అవినీతి ఆరోపణలకు సంబంధించిన జీవోల విషయంలో శ్రీలక్ష్మి మినహా తక్కిన ఐఎఎస్‌లకు సహాయం అందించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం వూహించిందే. మంత్రులకు సహాయం చేయాలంటే అధికారులకూ చేయాలి. ఇంకా చెప్పాలంటే వీరందరికీ చేసిన తర్వాత జైలులో వున్న జగన్‌కు కూడా పరోక్షంగా సహాయం చేసినట్టే చెప్పాలి. ఎ ందుకంటే క్విడ్ ప్రో వ్యవహారం నడవాలంటే ప్రభుత్వ ప్రతినిధుల తప్పు లేకుండా ఆయనపై ఆరోపణలు నిలవడం కష్టం. సిబిఐకి వ్యతిరేకంగా మంత్రులు అదికారులు జగన్ కూడా ఒక వైపునే నిలబడి వాదించే పరిస్థితిని మనం త్వరలోనే చూడాల్సి రావచ్చు. ఇదంతా ఒక రాజకీయ మాయాజాలం. కాని అవినీతి ఆరోపణలకు గురైన వారి తరపున ప్రభుత్వం వకాల్తా పుచ్చుకున్న ఇలాటి తతంగం దేశంలో ఇంత వరకూ జరగలేదని మాత్రం చెప్పొచ్చు.
Monday, July 23, 2012
నేతలు,కోర్టులు,కేసులు, తీర్పులు
ఈ రోజు వరుసగా కోర్టులు రాజకీయ ప్రాధాన్యత గల తీర్పులు ఆదేశాలు ఇచ్చాయి., మరో వంక ఆ కోర్టుల ముందున్న కేసుల్లో కొత్త మలుపులూ వచ్చాయి.
.చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ విజయమ్మ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడం, దీనికి రాజకీయ దురుద్దేశాలున్నందున ప్రజా ప్రయోజన వాజ్యం కిందకు రాదని తేల్చి చెప్పడం విశేషం. అయితే దీనిపై తెలుగు దేశం నేతలు పూర్తిగా ఆనందించే అవకాశం లేకుండా ఇది క్లీన్ చిట్ కాదని కూడా కోర్టు ముక్తాయింపు జోడించింది. సంబంధిత శాఖల్లో సంస్థల్లో ఫిర్యాదు చేసుకోవచ్చని కూడా అవకాశమిచ్చింది. కనక ఈ వ్యవహారం ఇంతటితో ముగిసిపోయిందని అనుకోలేము.
.ఇక ఈ రోజునే జగన్ అదే సుప్రీం కోర్టులో బెయిల్ కోసం తను వేసిన పిటిషన్‌ను వెనక్కు తీసుకున్నారు. నిజంతా ఇది నిశ్శబ్దంగా జరిగిపోయిన కీలక పరిణామం.ఈడీ విచారణ జరుగుతున్నదని సాకు చెబుతున్నా అది కొత్త సంగతేమీ కాదు. కాకుంటే బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైతే రేపు సహజంగానే విడుదల చేసే అవకాశాలు సన్నగిల్లుతాయని ఆయన అనుమానించి వుండొచ్చు. లేదా ఎలాగూ బయిటకు వస్తానన్న భరోసా చిక్కి వుండొచ్చు కూడా.
. ఈ రోజునే మంత్రి పార్థసారథిపై పాత కేసు ఒకటి ఈడీ తిరగదోడడం, నాన్ బెయిలబుల్ వారంటు జారీ కావడం ఆయనకే గాక కిరణ్ ప్రభుత్వానికి కూడా ఒక ఎదురు దెబ్బ. దీనితో పాటే గాలి బెయిల్ స్కాంలో న్యాయశాఖా మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి పేరు మళ్లీ ముందుకొచ్చింది. జైలులో వున్న ఇప్పటికే నోటీసులు అందుకున్న వారితో పాటు ఈ తాజా అభియోగాలు కూడా రావడం చాలా తీవ్రమైన విషయం. ఎన్ని ఆరోపణలు వచ్చినా నిమ్మకు నీరెత్తినట్టు కూచుంటామంటే అది చాలా అపహాస్య భాజనం. అభ్యంతర కారణం.
చేనేత విషాదం నేతల వివాదం
సిరిసిల్లలో వైఎస్‌ఆర్‌సిపి గౌరవాద్యక్షురాలు విజయమ్మ నిరాహారదీక్ష, నిరసన పేరిట దానిపై టిఆర్‌ఎస్,జెఎసిల రభస అనవసరమైన ఉద్రిక్తతల చరిత్రలో మరో ఘట్టం అనుకోవాలి. చేనేత కార్మికులు 642 మంది వరకూ గత కొద్ది కాలంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆకలి చావుల పాలైనారు.గతంలో తెలుగు దేశం, తర్వాత వైఎస్‌ఆర్ హయాంలోనూ ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు సక్రమంగా వ్యవహరించి వుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. అయితే వున్న మాట చెప్పాలంటే ఇప్పుడు నిరసన అంటున్న టిఆర్‌ఎస్ ముఖ్య నేతలు కూడా ఆ నాడు ఆ ప్రభుత్వాలలో భాగస్వాములే! కపనక ఇక్కడ జరగాల్సింది చేనేతపట్ల విధానాల మార్పు గాని ప్రాంతాల పేరిట పార్టీల ప్రయోజనాల ఘర్షణ కాదు. ఈ వారం రోజులలోనూ అసలు చర్చించని అంశమేదైనా వుందంటే అది చేనేత సమస్య పరిష్కారమే. ఇవన్నీ చూస్తుంటే టిఆర్‌ఎస్ గత అనుభవాల నుంచి ఏమీ నేర్చుకోలేదనిపిస్తుంది. మూడు ప్రధాన పార్టీలు తెలంగాణాపై స్పష్టమైన వైఖరి చెప్పలేదన్నది నిజమే అయినా ఆ పేరుతో అడ్డుకోవడం ఏ విధంగా సమంజసం? వారి మాటలు ఎంత విలువ ఇవ్వాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు తప్ప వారిపేరిట ఉద్రిక్త వాతావరణం సృష్టించి ఎవరికి మేలు చేసినట్టు? పరకాల ఉప ఎన్నికలో సురేఖకు భారీగానే ఓట్లు వచ్చిన దృష్ట్యా 2009లలో కె.తారకరామారావు రెండు వందల లోపు ఓట్ల మెజారిటితో గెలిచిన సిరిసిల్లను కాపాడుకోవడంపై ప్రత్యేకంగా కేంద్రీకరించారన్నది ఒక వాదన. ఆ ఓటింగు తర్వాత తెలంగాణాలో తమ సత్తా చాటడానికి విజయమ్మ వచ్చిందనేది మరో వాదన. తర్వాత వచ్చిన ఉప ఎన్నికలలో కె.టిఆర్ మెజార్టి పెరిగిన మాట నిజమే అయినా ఆయన సిరిసిల్లలో మరమగ్గాల కార్మికుల 21 రోజులు సమ్మె చేసినప్పుడు వ్యవహరించిన తీరుపైనా విమర్శలున్నాయి.అప్పట్లో కార్మికులు ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేశారు కూడా. సింగరేణిలో టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించిన మాట నిజమే గాని మెదక్ జిల్లా సంగారెడ్డిలో మహేంద్రా మహేంద్ర, పెప్సీ వంటి చోట్ల ఎన్నికలలో సిఐటియు చేతులో వారి ముఖ్య నాయకులే ఓడిపోయారు. రెండు మాసాలలో తెలంగాణా వచ్చేస్తుందని కెసిఆర్ ఆంటున్నప్పుడు ఎందుకు అడ్డుకోవడాలు లేఖలు రాయడం అనే ప్రశ్నలు కూడా
Saturday, July 21, 2012
బాధ్యత లేని మాటల మంటలు
పని చేయని ఐఎఎస్ అధికారులను కాల్చి చంపాలని మంత్రి టిజివెంకటేష్ వ్యాఖ్యానించడం ఏ విధంగానూ సమర్థించడానికి లేదు గనకే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రితో సహా అందరూ ఖండించారు. అయితే తర్వాత కూడా తన ధోరణి మార్చుకోకుండా ఆయన అటూ ఇటూ తిప్పి మాట్లాడుతున్నారు. ప్రజల కోసమే నోరు పారేసుకున్నానంటున్నారు. లగడపాటి రాజగోపాల్‌లాగే టిజి కూడా నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలతో వుండాలనుకుంటారు. (ఈ జాబితాలో ఇంకా జెసి దివాకర రెడ్డి, శంకర రావు, ఆనం వివేకానంద రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డి, రేవంత్ రెడ్డి వంటి వారిని జోడించవచ్చు.) అయితే మంత్రి పదవిలో వుండి మాట్లాడే ప్రతిమాట ప్రభుత్వానికి వర్తిస్తుంది. మరో వైపున తెలంగాణా జాగృతి సంస్థ అద్యక్షురాలు కవిత టీజీనే కాల్చి చంపాలని ఎదురు దాడి చేశారు. ఆమె అనుభవం, రాజకీయ స్థానం వంటి కారణాల రీత్యా , ఒక మంత్రి మాటలకు ఎక్కువ అభ్యంతరం చెప్పాల్సి వున్నా ఈ మాటలు కూడా సరికాదనేది స్పష్టం. ఉద్దేశ పూర్వకంగానే ఉద్రేకాలు పెంచడానికి
రాజకీయ రాహు(ల్)కాలం?
యుపిఎ ప్రభుత్వం అందులోనూ నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నదో ఇటీవల వరుసగా సంభవిస్తున్న పరిణామాలు విదితం చేస్తున్నాయి. అంత సంక్షుభితమైన పాలక కూటమి ఏలుబడిలో దేశం, ప్రజల స్థితిగతులు మరెంత దారుణంగా వున్నాయో చెప్పాల్సిన అవసరం ఎలాగూ వుండదు. గత వారం అమెరికా పత్రిక టైమ్ ప్రధాని మన్మోహన్ సింగ్ అసమర్థత గురించి ముఖ చిత్ర కథనం ప్రచురించడంతో ఈ కలకలం మొదలైంది. దానికి కొనసాగింపుగా కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ గాంధీ అతిథి పాత్రకు పరిమితమైనందునే ఇలా జరుగుతున్నదని నిందాస్తుతి చేశారు.దీనిపై కొందరు వీర విధేయులు చిందులు తొక్కినా వాస్తవంలో ఆయన రాహుల్ రాకకు రంగం సిద్ధం చేసేందుకే అలా మాట్లాడారని అర్థమై పోయింది. తర్వాత పరిణామాలన్ని అక్షరాలా ఆ దిశలోనే నడిచాయి. ఉప రాష్ట్రపతి అన్సారీ నామినేషన్ ఘట్టంలో కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా గాంధీ దీనిపై స్పందిస్తూ తాను ఏ పాత్ర తీసుకోవాలో నిర్ణయించుకోవలసింది రాహుల్ గాంధీయేనని వ్యాఖ్యానించారు. కాగా ఆ మరుసటి రోజునే ఆయన మాట్లాడుతూ తన స్థానం ఏమిటో నిర్ణయించాల్సింది సోనియా, మన్మోహన్‌లేనని వినయం ప్రదర్శించారు. ఇలా సాగుతున్న తల్లీ కొడుకుల ముచ్చట్ల వెనక బృహత్ వ్యూహం వుందని పసిగట్టిన వ్యవసాయ మంత్రి ఎన్‌సిపి అధినేత శరద్ పవార్,తన సహచరుడు ప్రపుల్ పటేల్‌తో సహా రాజినామాలు సంధించి కొత్త సంక్షోభానికి తెర తీశారు. ఎందుకంటే రాహుల్ రాకకు రంగం సిద్ధమయ్యేప్పుడే తను సాధించుకోవలసిన కోర్కెల జాబితా ఆయన దగ్గర వుంది.
నిజానికి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే సమయంలోనే లుకలుకలన్నీ వ్యక్తమైనాయి. కావాలనే దాన్ని జాగుచేయడం, మమతా బెనర్జీ వ్యతిరేకించడం వంటి పరిణామాలు కలిగాయి. నిజానికి వ్యక్తులు, పదవులు, ప్రయోజనాల వేట తప్ప వీటిలో ఎలాటి విధానపరమైన విభేదాలు లేవు. అధికధరలు అవినీతి వంటి ఏ అంశంలోనూ భాగస్వామ్య పార్టీలు గట్టిగా నిలబడుతున్నది లేదు. కాకపోతే ఆ సమస్యలను సాకులుగా చూపించి తమ వాటాలు వాదనలు నెగ్గించుకోవడమే జరుగుతున్నది. ప్రణబ్ ముఖర్జీకి మద్దతు విషయంలో మమతా బెనర్జీ ఆఖరుకు ప్లేటు ఫిరాయించడం కూడా ఆ కోవలోదే. అయితే ఆమెకు బెంగాల్‌లో కాంగ్రెస్‌కు మధ్య వైరుధ్యాలు పెరుగుతున్న మాట కాదనలేనిది. సిపిఎంను దెబ్బ తీయడానికి ఆమె పల్లకీ మోసినా అతి కొద్ది కాలంలోనే ఆ అదరగణ్నం నాయకురాలిని భరించలేని దురవస్థ కాంగ్రెస్‌ది. ఇలాటి సమస్యలు ఇతర చోట్ల కూడా వున్నాయి. ఈ అవకాశం తీసుకుని అమెరికా అద్యక్షుడు ఒబామా చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించాలని సరళీకరణను వేగవంతం చేయాలని వత్తిడి చేస్తూ మాట్లాడారు.
అంతకు ముందే
Sunday, July 15, 2012
కెసిఆర్ సంకేతాలపై సందేహాలు
సెప్టెంబర్‌లోగా తెలంగాణా విభజన జరుగుతుందని తనకు సంకేతాలు వస్తున్నాయని టిఆర్‌ఎస్ అద్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేసిన ప్రకటనతో రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాం విభేదించడం చాలా ఆసక్తి కరమైన విషయం. నాకెలాటి సంకేతాలు లేవని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇదే మాట నాలాటి విశ్లేషకులం ఎవరైనా అనివుంటే అనుచిత విమర్శల వర్షం కురిసివుండేది. చిదంబరం అధికారిక ప్రకటనలో లేని సంకేతాలు ఎవరికైనా ఎలా అందుతాయి? జాతీయ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణాపై నిర్ణయం జరుగుతుందని ముఖ్యమంత్రి అంటే కోదండరాం తదితరులు తప్పు పట్టారు గాని నిజానికి అది చాలా సాధారణమైన ప్రకటన. ఆ సృహ కలిగి మెలగకుండా గతంలో పరిపరివిధాల విన్యాసాలు చేసినందుకు కాంగ్రెస్‌ను విమర్శించవచ్చు గాని జాతీయ కోణం చూడకుండా వుండటం ఎలా సాధ్యం?నదీజలాలు మెడికల్ సీట్లు ఈ సమస్యలన్నిటిలోనూ విమర్శలు చేయొచ్చు. పరిష్కారాలకై పోరాడవచ్చు కూడా.కాని ఈ స్వార్థపరులైన నేతలకు ఏదో ఒక ప్రాంతంపై ప్రత్యేకంగా ప్రేమ వుండటం కారణమని నేననుకోను.ఎందుకంటే తమ అధికారం పదిలంగా వుండటం,లాభాలు పండించుకోవడం వారికి ముఖ్యం తప్ప ఏ ప్రాంతమైనా ఒకటే. ఇప్పుడు ముందుకొచ్చిన సమస్యలపై అఖిలపక్ష సమావేశం జరిపి ఆచరణ యోగ్యమైన చర్యలు చేపట్టాలి తప్ప అరకొర చర్యలతో అసంతృప్తిని పెంచడం సరికాదు. అలాగే సమస్యలపై కన్నా ప్రాంతాల ప్రజట మధ్య అపార్థాలు పెంచే వ్యూహాలు కూడా మంచిది కాదు.ఈ విషయంలో మంత్రులు ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీల నేతలు అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించవలసి వుంటుంది. ప్రభుత్వం తరపున సంకేతాల విడుదల బాధ్యతను ఎవరూ తీసుకోకపోవడం మరింత శ్రేయస్కరం.
ఆవేశ కిరణాల ఆంతర్యం?
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాస్త సూటిగానూ ఆవేశంగానూ కూడా స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది.విద్యుచ్చక్తి సమస్యపై రిలయన్స్ గ్యాస్ సరఫరాకు సంబంధించి కేంద్రంపై పరోక్ష వ్యాఖ్యలు ఆ కోవలోవే. ఇందిరమ్మ బాటను మంత్రులు కొంతమంది వ్యతిరేకించినా కొనసాగించడంలోనూ అదే పట్టుదల కనిపిస్తుంది. తన స్థానంలో రావాలనుకుంటున్న వారికి బెస్టాప్ లక్ చెప్పారంటే పరోక్షంగా అది తన కేబినెట్ సహచరులకే తగులుతుందని కూడా ఆయనకు తెలుసు. ఈ దూకుడు బాగానే వుంది గాని ఆవేశం ఆలస్యమైందా? ఇందులో వున్నది ఆత్మ విశ్వాసమా?అభద్రతా భావమా? తన పర్యటనలో రాజీవ్ యువ కిరణాలపై విమర్శలకు సందేహాలకు సంబంధించి ఆయన వ్యక్తం చేసిన ఆగ్రహం మరింత ఆశ్చర్య కరంగా వుంది. 15 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు ఇస్తామని తానంటే ఎంపిలే నమ్మలేదని ముఖ్యమంత్రి ఆవేదన చెందుతున్నారు. అంతేగాక ఆ కార్యక్రమానికి రావద్దంటూ ప్రధానికి లేఖ రాశారని కూడా విమర్శించారు. నిజానికి చాలా కాలంగా భర్తీ చేయని లక్ష ఉద్యోగాలలో నియామకాలు చేస్తామని ప్రచారం చేసుకుని వుంటే బాగుండేదని, తాడూ బొంగరం లేని 15లక్షల ప్రైవేటు ఉద్యోగాల గురించి మాట్లాడి లేనిపోని సందేహాలు కలిగించారని ఆయన అనుకూలులు కూడా అనేక మంది నాతో అన్నారు. ఈ పథకం ప్రారంభం సందర్భంలోనే ఆయనతో ముఖాముఖి చర్చలో నేను,
రాష్ట్రపతి ఎన్నికల రాజకీయాలు
భారత రాష్ట్రపతి ఎన్నిక ఈ సారి తీవ్ర రూపం తీసుకున్నదని ఎన్‌డిఎ అభ్యర్థి పి.ఎ.సంగ్మా వ్యాఖ్యానించారు గాని వాస్తవంలో యుపిఎ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీ విజయావకాశాల స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధినేత ఇందిరాగాంధీయే వైఖరి మార్చుకున్న 1969 ఎన్నికలను మినహాయిస్తే ఇంత వరకూ అధికార పక్ష అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోయిన దాఖలాలు లేవు. ఇందుకు చట్ట సభల బలాబలాలు ఒక కారణమైతే రాజకీయ పార్టీల విన్యాసాలు మరో కారణం. ఇన్నిటి మధ్యనా వామపక్షాలు,అందులోనూ సిపిఎం ఎప్పుడూ ఒక నిర్దిష్ట వైఖరితో వ్యవహరిస్తూ వస్తున్నది. అత్యున్నతమైన ఆ రాజ్యాంగ బాధ్యత స్వీకరించే వ్యక్తి అభివృద్ది నిరోధక మతతత్వ నేపథ్యం కలిగి వుండరాదన్న సూత్రానికి సంబంధించి సిపిఎం ఎన్నడూ వెనక్కు పోలేదు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీని బలపర్చాలని తీసుకున్న నిర్ణయంలోనూ అదే హేతువు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా చాలా పార్టీలు తమ వైఖరి తేల్చుకోలేక తర్జనభర్జన పడుతుండగా సిపిఎం అలాటి శషభిషలు లేకుండా తన విధానం సూటిగా ప్రకటించిందంటే అదే కారణం.
భారత రాష్ట్రపతిని రాజ్యాంగ రీత్యా అధికారాలు లేని రబ్బరు స్టాంపుగా అభివర్ణిస్తుంటారు. బ్రిటిష్ రాణితో పోలుస్తుంటారు. పార్లమెంటరీ వ్యవస్థ క్యాబినెట్ పాలనా విధానం వున్న మాట నిజమే అయినా రాష్ట్రపతి స్థానం అంత అప్రధానమైనది గాని లాంఛనమైనదిగానీ కాదు. దేశాన్ని పాలించవలసిన ప్రభుత్వాధినేతను ఆహ్వానించవలసింది రాష్ట్రపతి మాత్రమే. ఏదో ఒక పార్టీకి గుత్తాధిపత్యం వుండే కాలం పోయి మిశ్రమ ఫ్రభుత్వాలు వచ్చాక ఈ విషయంలో రాష్ట్రపతి విచక్షణాధికారం చాలా చాలా కీలకమై
Saturday, July 7, 2012
తప్పు మీద తప్పు చేస్తున్న సర్కారు!
వివాదాస్పద జీవోల విషయంలో కోర్టు నోటీసులు ఎదుర్కొంటున్న అమాత్యులకు (అందులోనూ ఇద్దరు మినహా) న్యాయ ఖర్చులు భరించి సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీని ఆవరించిన అయోమయాన్ని, అది అనుసరిస్తున్న ద్వంద్వనీతిని వెల్లడించే నిర్ణయం ఇది. ఆ 26 జీవోల ఆధారంగానే జగన్ మోహన రెడ్డి అక్రమ లబ్ది పొందారని కేసు నడుస్తుంటే- వాటికి కారకులైన వారిని ప్రభుత్వం ఎలా సమర్థిస్తుంది? అందులోనూ ఇద్దరిని ఎలా మినహాయిస్తుంది? ఇందులో ఎలాటి సూత్రమూ వుండనవసరం లేదా?జీవోలు సక్రమమైతే అప్పుడు క్విడ్ ప్రో కో పద్ధతిలో భారీ పెట్టుబడులు ఎందుకు పెడతారు? అంటే జగన్ కూడా నిర్దోషి అని ప్రభుత్వం చెప్పదలచిందా? మరి ఆయనపై అవినీతి ఆరోపణలతో దండెత్తదం దేనికి? అలాగే మంత్రులకు కల్పించిన రక్షణ ఐఎఎస్‌లకు ఎందుకు ఇవ్వరంటే ఏం చెబుతారు? నిజానికి వారు తమ శాఖ మంత్రుల మాట ప్రకారమే నడుచుకున్నామని చెప్పే అవకాశం పూర్తిగా వుంటుంది.కనక అవినీతిపై దర్యాప్తులో గాని విమర్శలలో గాని ద్వంద్వనీతి చెల్లుబాటు కాదని ఏలిన వారు గ్రహిస్తే మంచిది.
ప్రాంతీయ వివాదాలకు ఆజ్యం పోస్తున్న ప్రభుత్వం
ప్రాంతీయ వివాదాల చాటున మనుగడ సాగించుకోవాలన్న వ్యూహం నానాట ఆందోళనకరంగా మారుతున్నది. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత ఏదో పరిష్కారం ప్రకటిస్తామన్న వూహాగానాలపై చాలా తతంగమే నడిచింది. తాడూ బొంగరం లేని ఆ కథనాల మధ్య హొం మంత్రి చిదంబరం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.దాంతో ఏ మాత్రం నిమిత్తం లేకుండా రాయల తెలంగాణా పేరిట వ్యాఖ్యానాలు దానిపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తనకు మాలిన తతంగంగా దీన్ని నెత్తిన వేసుకున్న మంత్రి టిజి వెంకటేష్ కాస్త వెనక్కు తగ్గవలసి వచ్చింది. వైఎస్‌ఆర్‌సిపి నేతలైన శ్రీకాంత్ రెడ్డి వంటివారు దీనిపై ఆవేశ భరితంగా మాట్లాడ్డం మరో పరిణామం. ఇంతకంటే తీవ్రమైంది సాగర్ నీటి విడుదలలో ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం. సున్నితమైన పరిస్థితిని గమనంలో పెట్టుకుని అఖిలపక్షాలతో సంప్రదించి అందరికీ న్యాయం జరిగేలా వ్యవహరించే బదులు ఆదరాబాదర చర్యలతో అపార్థాలు పెంచడానికే కారణమైంది. మళ్లీ దానిపై కాంగ్రెస్ నేతలే అతిగా స్పందించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మెడికల్ సీట్ల విషయంలో హరీష్ రావు వినోద్ కుమార్ వంటి వారు లేవనెత్తిన అంశాలు మరింత తీవ్రమైనవి. పోటాపోటీగా నడిచే ఈ సీట్ల విషయంలో అన్ని ప్రాంతాలకు సమతుల్యత పాటించవలసింది పోయి ఒక ప్రాంతంలో అసలు సీట్ల పెంపు లేకుండా చేయడం ఏ విధంగానూ సమర్థనీయం కాదు.దీనికి మెడికల్ కౌన్సిల్‌నో మరో సంస్థనో నిందిస్తే సరిపోదు.ఇంత ఉద్రిక్తంగా అనిశ్చితంగా వున్న పరిస్థితులలో వేయి విధాల జాగ్రత్తలు తీసుకోవలసిన ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం క్షంతవ్యం కానిది. ముందస్తుగానే మేల్కొని వుంటే తెలంగాణా ప్రాంతంలోని మెడికల్ కాలేజీలలోనూ సీట్లు పెంపు సాధించుకోవడం సాధ్యమై వుండేది. వచ్చిన వాటిని సర్దుకోవడమైనా జరిగివుండేది. స్థానిక నిబంధనలు వున్నప్పుడు ఇలా అసమాన పెంపుదలలు అవాంచనీయమైన స్పర్థలకు దారి తీస్తాయి. నీళ్లనుంచి సీట్ల వరకూ ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరించడం ప్రాంతీయ చిచ్చు పెద్దది చేయడానికి తప్పితే ఏ ప్రాంతంపైనా ఏలిన వారికి ప్రత్యేకాభిమానం వుండటం వల్ల అనుకోలేము. వారికి కావలిసింది అధికారం మాత్రమే. ఇప్పటికైనా దీనిపై సత్వర కదలిక రావాలి. అవసరమైతే అసాధారణ చర్యలు తీసుకున్నా మంచిదే. ఇదే సమయంలో జెఎసి స్థానికులకు ఉద్యొగాలు, వనరుల వగైరాలపై చేసిన డిమాండ్లు దాని గత వైఖరికి కాస్త భిన్నంగానూ తక్షణ స్పందన కలిగించేవిగానూ వుండటం గమనార్హం. రాష్ట్ర విభజన అన్నది కేవలం జపంగా మారకూడదంటే జన సమస్యలపైనా పోరాడాలని నిర్ణయించుకోవడం మంచిదే.
సిబిఐకి అభిశంసన- జగన్ పార్టీకి ఆనందం?
మాయావతి ఆస్తుల కేసులో సిబిఐ అతిగా వ్యవహరిస్తోందని అత్యున్నత స్థానం అభిశంసించడం ఆసక్తి కరమైన విషయమే కాదు- రాజకీయంగా జగన్ పార్టీ వైఎస్‌ఆర్‌సిపికి చాలా ఆనందకరమే అనుకోవచ్చు. అవినీతి ఆరోపణలపై విచారణ నెదుర్కోక తప్పదనీ, ఉప ఎన్నికల్లో విజయం సాధించినంత మాత్రాన నిర్దోషిత్వం ప్రాప్తించదని నేను చాలా సార్లు చెప్పాను, రాశాను. అయితే ప్రతిసారీ సిబిఐ పాత్రపైనా ప్రశ్నలు వస్తుంటాయి.వ్యక్తిగతంగా జెడి లక్ష్మినారాయణపై ఆ పార్టీ దాడి కేంద్రీకరించడం వల్ల ఈ ఆరోపణల స్వభావం మారిపోతుంటుంది.వాస్తవంలో సిబిఐ ఎప్పుడూ వివాదాలకు అతీతంగా లేదు. రాజ్యాంగ రీత్యానే అది కేంద్ర ప్రభుత్వ ఆజమాయిషీలోనే పనిచేస్తుంటుంది.అలాటప్పుడు రాజకీయాల క్రినీడలు దానిపై పడవని అనుకోవడానికి లేదు. వాజ్‌పేయి ప్రభుత్వం వుండగా అయోధ్య ఘటనలో అద్వానీపై కేసులు ఎత్తివేసి తనపై కొనసాగిస్తున్నందుకు నాటి కేంద్ర మంత్రి మురళీమనోహర్ జోషి స్వయానా రాజీనామా చేశారు. మాయావతి, ములాయం, లాలూ వంటి వారి విషయంలోనూ ఈ విధమైన ఉదాహరణలున్నాయి. కేరళలో సిపిఎం కార్యదర్శి పినరాయి విజయన్‌పై పాత కేసు తిరగదోడిన ఘటనలోనూ వైఫల్యం ఎదురైంది. మాజీ సిబిఐ డైరెక్టర్ జోగిందర్ సింగ్ స్వయంగా ఈ విధమైన వివాదాలను ఉదహరించారు. వీటిని సాకుగా చూపించి జగన్‌పై ఆరోపణలన్ని అసత్యాలంటూ ఒప్పుకోవడం సాధ్యం కాదు గాని సిబిఐ తీరుపై విమర్శలకు ఆస్కారం లేదని మాత్రం చెప్పలేము.మాయావతిపై తాజ్ కారిడార్ వ్యవహారంలో కేసు దర్యాప్తు చేయమంటే ఆస్తుల కేసు ఎందుకు చేశారని సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది.అయితే నాలుగేళ్లుగా అనేక దఫాలుగా నడుస్తున్నప్పుడు ఎందుకు అనుమతించారనే ప్రశ్నకు మాత్రం జవాబు ఆశించలేము. జగన్ మోహన రెడ్డి కేసు కూడా హుటాహుటిన ముగిసిపోయేది కాదని గతంలోనే రాశాను. ఇందులోనూ అనేక మలుపులు చూడవలసే వుంటుంది. వాటిలో రాజకీయమైనవీ, న్యాయ సంబంధమైనవీ కూడా వుండొచ్చు.ఆ మలుపులు ఇరు వైపులా వుండొచ్చు కూడా. కాంగ్రెస్ తెలుగు దేశంలు కూడా ఈ వాస్తవాన్ని గుర్తించబట్టే దీర్ఘ కాలిక వ్యూహాల రూపకల్పనకు తంటాలు పడుతున్నాయి.. అయితే ఉభయ పార్టీలూ కూడా విధానపరంగా తమ లోపాలు తప్పులు ఒప్పుకోవడానికి సిద్ధం కావడం లేదు.కేవలం ప్రచారంతో నెట్టుకుపోతే సరిపోతుందన్న భావన ఆ రెండు పార్టీలలో ఇంకా వుంది గనకే ముఖ్యమంత్రి కిరణ్ ఇందిరమ్మ రాజ్యం, ప్రతిపక్ష నేత చంద్రబాబు సైకిల్ యాత్ర అంటూ హడావుడి పడుతున్నారు. వాస్తవం ఏమిటంటే వాటిని ఆవరించిన విశ్వాస రాహిత్యం అనే రుగ్మత అంతకన్నా తీవ్రమైనది. సిబిఐ దర్యాప్తు కన్నా ఈడీ విచారణలో ఏదో నాటకీయంగా జరిగిపోతుందనే కథనాలు జోరుగా సాగుతున్నాయి గాని ఇటీవలి పరిణామాలను గుర్తు చేసుకుంటే ఇది కూడా సాగలాగబడటం తప్ప తేలేది కాదని అర్థమవుతుంది.
జ్ఞాపకాల నేపథ్యంలో అయోధ్య నిజాలు
బాబరీ మసీదు విధ్వంసం సందర్భంలో నాటి ప్రధాని పి.వి.నరసింహారావు పాత్రపై మరోసారి దుమారం చెలరేగుతున్నది.వరుసగా వెల్లడవుతున్న వాస్తవాలు ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.అందులోనూ చాలా ముఖ్యమైన వ్యక్తులే నాటి ఘటనలను ఏకరువు పెట్టడం వల్ల కాదని నమ్మకంగా ఖండించలేని స్థితిలో కాంగ్రెస్ నాయకత్వం చిక్కుకుపోతున్నది. మాజీ కేంద్ర మంత్రి అర్జున్ సింగ్ జ్ఞాపకాలు ఆయన మరణానంతరం ప్రచురితమైన ఆయన జ్ఞాపకాలు ఇందుకు కారణమైనాయి.ఆ మరుసటి రోజునే ప్రముఖ పాత్రికేయుడు కులదీప్ నయ్యర్ పుస్తకం భాగాలు విడుదలవడంతో ఇది మరింత తీవ్రమైంది. కాకపోతే ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం ఆయన వ్యక్తిగత వ్యవహారంగా పరిమితం చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నది.పివికి, సోనియా కుటుంబానికి మధ్య వైరుధ్యం కోణంలో ఎక్కువ మంది దీన్ని చిత్రిస్తున్నా కాంగ్రెస్ రాజకీయ విన్యాసాలు దేశ లౌకిక పునాదుల కోణం నుంచి చూడాల్సిన అవసరం ఎక్కువగా వుంది.
1992 డిసెంబర్ 6 వ తేదీన అద్వానీ ప్రభృతుల సమక్షంలో బాబరీ మసీదు విధ్వంసం జరగడం దేశాన్ని ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంత పరచింది. దేశ లౌకిక విలువలకు విఘాతం కలిగింది. తర్వాత మత కలహాలు చెలరేగాయి. అయితే రామజన్మభూమి ఆందోళన పేరుతో జరిగిన ఆ విధ్వంసాన్ని పివి ప్రభుత్వం ఆపలేకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ దేశ చరిత్రలోనే లేని విధంగా బహిరంగ ప్రకటన చేస్తూ ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. ఈ ఘటనలపై నియమితమైన లిబర్‌హాన్ కమిషన్ 48 సార్లు గడువు పొడగించిన తర్వాత పదహారున్నర సంవవత్సరాలకు నివేదిక సమర్పించింది. అందులో పివి తప్పు లేదని కితాబునివ్వడంపై తీవ్ర విమర్శలొచ్చాయి.
రాజకీయ లబ్ది కోసం రామజన్మభూమి వివాదాన్ని రగుల్కొల్పిన బిజెపి నేత అద్వానీ ఆయన వెనక వున్న సంఘ పరివార్‌ల పాత్ర ఒకటైతే ఆ దారుణాన్ని అనుమతించడంలో నాటి పివి ప్రభుత్వ పాత్ర కూడా తక్కువ కాదు. నవంబరులో జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలోనే ఈ సమస్యను సాకల్యంగా చర్చించిన అఖిల పక్షాలు పరిస్థితిని అదుపు చేయడానికి ఏ చర్యనైనా తీసుకోవడానికి ప్రధానికి అధికారమిస్తూ ఏకగ్రీవ
Subscribe to:
Posts (Atom)