Pages

Thursday, July 26, 2012

అసోం హింసా కాండలో హెచ్చరికలు





అసోంలోని కోక్రాజార్‌ ప్రాంతంలో అకస్మాత్తుగా చెలరేగిన హింసా కాండ చిరాంగ్‌,దుబ్రి,బొంగైగాన్‌ జిల్లాలకు పాకి డజన్ల మంది ప్రాణాలు బలితీసుకుంటున్నది. దాదాపు రెండు లక్షల మంది శరణార్థి శిబిరాలలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి గోగోరు ఆధ్వర్యంలో మూడో సారి గెలిచి రికార్డు సృష్టించామని చెప్పుకున్న చోట ఇంతగా పరిస్థితి అదుపు తప్పి పోవడానికి చాలా కారణాలే వున్నాయి. ఈ సందర్భంలో చెప్పాలంటే జులై ఆరవ తేదీన ఘర్షణలు ప్రారంభం అయినప్పుడు అదుపు చేయడానికి గట్టి చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించారు. అవి ఇప్పుడు అదుపు తప్పిపోయి యాభై గ్రామాలు భస్మీపటలమయ్యాయి. అటు చూస్తూ బోడో గిరిజనులు ఇటు చూస్తే ముస్లిం మైనారిటీ తరగతులు అల్లకల్లోలానికి హత్యాకాండకు గురవుతున్నారు. వారు వలస వచ్చిన వారు గనక తమ అవకాశాలు దెబ్వతింటున్నాయనేది వీరి వాదన కాగా మత కోణంలోనూ కొన్ని రాజకీయ శక్తులు అందుకు వంతపాడి ఆగ్నికి ఆజ్యం పోశాయి. బోడో స్వయం పాలక జిల్లాలో సాగుతున్న ఈ హత్యాకాండ వెనక పథకం వుందని ఉభయ వర్గాల నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌ నాయకులు వీటిని పరిష్కరించడం కన్నా
గోగోరుని సాగనంపడంపై కేంద్రీకరిస్తున్నారు. ఆయన రాజీనామా కథనాలు జోరుగా వినిపిస్తున్నాయి.1978లో మొదలైన అసోం ఆందోళనకు హింసా కాండకు ఇన్నేళ్లయినా సహేతుక పరిష్కారం కనుగొనలేకపోవడం,ఆ వైరుధ్యాలను అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని ఎజిపి,కాంగ్రెస్‌,బిజెపి,బోడో పార్టీలు, మైనారిటీ నేతలు పాచికలు వేయడం ఇందుకు చాలా వరకు కారణం. అక్కడ పౌరసత్వ సమస్య పరిష్కారమే పూర్తికాకపోవడం ఒకటైతే తీవ్ర నిరుద్యోగ సమస్య ఇంకా కీలకమైంది. ఆ వెనకబడిన ప్రాంతం బహుభాషల మతాల తెగల నిలయం. చాలా చోట్ల మనం మత మారణహౌమాలు, ప్రాంతీయ ఘర్షణలు, ఈశాన్య భారతంలో ఉపజాతి సమరాలు చూశాము. ఈ లక్షణాలన్ని కలబోసుకున్న ప్రస్తుత కార్చిచ్చు వాస్తవంలో దేశానికే ఒక హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కపెట్టకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వెంటనే పరిస్థితి అదుపు లోకి రా

No comments:

Post a Comment