Pages

Saturday, July 28, 2012

మంగుళూరులో ఒక వికృతం, ఒక అకృత్యం




మంగుళూరులో రేవ్‌ పార్టీల పేరిట విహెచ్‌పి దుండగులు యువతీ యువకులపై దౌర్జన్యానికి దిగడం సహించరాని విషయం.గతంలోనూ శ్రీ రాం సేన పేరిట ఇలాటి దుశ్చర్యలే అక్కడ జరిగాయి. వలైంటీన్స్‌ డే సందర్భంగా హైదరాబాదులోనూ ఇలాటి పోకడలు చూశాము. ఆ పార్టీలూ పబ్బులూ వికృత మనడంలో సందేహం లేదు గాని ఇలా దాడులు దౌర్జన్యాలు చేసే అధికారం వీరికెక్కడిది? మతం పేరిట సంప్రదాయం పేరిట ఇతరులపై బల ప్రయోగం చేసే వారు తమ వ్యక్తిగత ప్రవర్తన గురించి ఎక్కడైనా ముద్ర వేయించుకొచ్చారా? సమాజంలో సంచలనం కలిగించేందుకు భయ భ్రాంతులు సృష్టించేందుకు తప్ప ఇలాటి చర్యలు ఉపయోగపడవు. అవినీతి భరితమైన కర్ణాటక వ్యవహారాలు చూస్తే హిందూత్వ శక్తుల నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుంది. గాలి జనార్థన రెడ్డి వంటివారిని నెత్తిన పెట్టుకున్న పరివార్‌ మరెవరికో నీతి పాఠాలు అది కూడా బలవంతంగా నేర్పిస్తామనడం అనుమతించరాని అమానుషం.

4 comments:

  1. రేవ్ పార్టీలు చట్టబద్ధమా?! వ్యక్తిగత స్వేచ్చా? అయినా కాకున్నా వి.హెచ్.పి, భజరంగ్ దళ్‌లు చేసింది తప్పే. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

    ReplyDelete
  2. బాగుంది. ఇది ఉపేక్షించాల్సిన విషయం కాదు.ఈ Moral policing ని కట్టడి చెయ్యక పోతే పరిణామాలు చెయ్యి దాటి పోతాయి.Party with a difference ఈ విషయంలో తమ వైఖరి ఏంటో స్పష్టం చెయ్యాలి.ఓట్లు వెయ్యొచ్చో వెయ్యకూడదో ప్రజలు నిర్ణయించుకుంటారు.

    ReplyDelete
  3. అవినీతి భరితమైన కర్ణాటక వ్యవహారాలు చూస్తే హిందూత్వ శక్తుల నిజ స్వరూపం ఏమిటో తెలుస్తుంది.
    --------------------------
    రవి గారు....అవినీతి ఆంధ్ర లో లేదా ?? తప్పు చేసిన మనిషిని కాకుండా వాళ్ళకి కులాన్ని,మతాన్ని ఆపాదించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసం

    ReplyDelete
    Replies


    1. నేను ఈ కామెంట్‌ గతంలో చూడలేదు.. ఆలస్యంగా గమనించి జవాబు రాస్తున్నాను.కర్ణాటక అనడంలో ఆ రాష్ట్రంలో జరుగుతున్న అని ఉద్దేశమే తప్ప ప్రాంతీయ కోణాలేమీ లేవు శేఖర్‌ గారూ. ఆంధ్ర ప్రదేశ్‌ గురించి నేను చేసిన అనేక వ్యాఖ్యానాలు ఈ బ్లాగులో చూడొచ్చు.బిజెపి అధికారంలో వున్న రాష్ట్రం గనక దానికి అది ఉదాహరణగా ఇవ్వడం జరిగింది, అంతే. కుల మత ప్రాంతీయ కొలబద్దలు వద్దనే నా గొడవ. దోచుకునేవారు పీడించే వారు అన్ని చోట్లా వున్నారు, వుంటారు.

      Delete