కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రకరకాల ఆరోపణలకు అభిశంసనలకు గురయ్యే మంత్రుల సంఖ్య పెరిగిపోతున్నది. అయితే వాటిపై ముఖ్యమంత్రి లేదా కాంగ్రస్ పార్టీ ప్రతిస్పందనే వుండటం లేదు. తాజాగా మంత్రి పార్థసారథిపై ఫెరా నిబంధనల వుల్లంఘన కింద జరిమానా జైలు శిక్ష విధించడం విషయంలోనూ అదే జరుగుతున్నది. సహజంగానే మంత్రి ఆయన అనుయాయులు సమర్థించుకుంటున్నా ఆ స్థాయిలో ఇలాటి తీర్పు రావడం చిన్న విషయం కాదనేది నిర్వివాదాంశం. పై కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ అది వచ్చిన తీర్పును మటు మాయం చేయదు. పాత నేతలను పక్కన పెట్టినా మహారాష్ట్ర వంటి చోట్ల కూడా తీర్పులు రాగానే మంత్రులు గవర్నర్లు తప్పుకున్న ఉదంతాలు చాలా వున్నాయి. అయితే అలాటి ప్రమాణాలకు ఈ ప్రభుత్వం విలువ ఇస్తుందని ఏ వి ధంగానూ ఆశించలేము. అలాగే సదరు మంత్రులు కూడా సవాలుగా తీసుకుని పదవులు వదులుకునే ప్రసక్తి అంతకన్నా వుండటం లేదు. గాలి బెయిల్ డీల్‌లో న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పేరు మొదట వచ్చి తర్వాత వెనక్కు పోయింది. ఇప్పుడు మళ్లీ వచ్చింది. అయినా ఆయన పదవిలో కొనసాగుతూ గంభీరోక్తులు పలకడం తప్ప పక్కకు తప్పుకోవడానికి సిద్దపడరు. పరిశుభ్రమైన పారదర్శకమైన కిరణ్ పాలన విచిత్రాలలో ఇవి కొన్ని మాత్రమే.ఇలా మాట్లాడిన వారిపై ప్రభుత్వ వ్యతిరేక ముద్ర వేయడం తప్ప కాస్తయినా పరిశీలించుకునే ధోరణి ఈ ప్రభుత్వానికి ఏ కోశానా లేదు.
Wednesday, July 25, 2012
రాష్ట్ర మంత్రులు- రాజకీయ నైతిక ప్రమాణాలు

Subscribe to:
Post Comments (Atom)
ప్రభుత్వమా? ఆదేమిటి ? ఎక్కడుంది?
ReplyDeleteప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోయిన కాలంలో, ప్రభుత్వం అనేది కేవలం అధికారపార్టీ కమిటీగానే మిగిలి పోయింది.
మీరింకా పుస్తకాలలోని పాతకాలపు విలువలతోనే పరిస్థితులను తూకం వేస్తున్నట్లుంది!
తనదికాక పోతే తాటిపట్టకు ... అన్నట్టు, ఈయనకు న్యాయసాయం అందించడానికి కిరణ్ కుమార్ రెడ్డి లగెత్తుకు రావట్లేదా?
ReplyDelete