భారత దేశంపై అమెరికా ఆధిపత్య వ్యూహాల ప్రత్యక్ష ప్రభావం ఇప్పుడు మరింత స్పష్టమవుతున్నది. చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం ఆలస్యమవుతున్నదని అద్యక్షుడు ఒబామా అసహనం ప్రకటించారు. ఆ వెంటనే ప్రధాని మన్మోహన్ ప్రతిస్పందించి చర్యలు ప్రారంభించారు. సిరియాలో జోక్యానికి అమెరికా ఐరాసలో ఒత్తిడి పెంచితే చైనా రష్యా వీటో చేశాయి.కాని భారత దేశం దానికే వంత పాడి ఓటేసింది. కాశ్మీర్ సమస్య వంటి వాటిలో అమెరికా జోక్యానికి ప్రయత్నించిన చేదు అనుభవాలు మర్చిపోయింది. తాజాగా మన చమురు అవసరాల్లో 70 శాతం దిగుమతి అవుతున్న ఇరాన్‌తో సంబంధాలను అమెరికా మెప్పుకోసం ఫణం పెట్టడానికి కూడా సిద్ధమైంది. ఆ దేశం నుంచి చమురు దిగుమతులు చేసుకోరాదన్న ఆంక్షలకు తలవొగ్గి మనకు మూడు ఓడల చమురు రావలసి వుండగా ఒక దానికే పరిమితం చేసుకుంటున్నది. ఇప్పటికే పెట్రోలు ఉత్పత్తుల ధరల మోత మోగుతుంటే ఇలాటి నిర్ణయాలు మరింత సంక్షోభానికి దారి తీయడం అనివార్యం. ఈ వ్యవహారంలో అనేక సాంకేతికాంశాలు వున్నా కీలకం మాత్రం అమెరికా ఆంక్షలను పాటించాలన్న ఆతృతే.మరో వైపున వారి ధోరణి చూస్తే మాత్రం భారతీయులు వచ్చి ఉద్యోగాలు ఎగవేసుకుపోతున్నారన్న ఒబామా మాటల్లో స్పష్టమవుతున్నది.
Saturday, July 28, 2012
భారత్‌పై అమెరికా ఆధిపత్య ప్రత్యక్ష ప్రభావం

Subscribe to:
Post Comments (Atom)
తెరగారు,
ReplyDeleteఅమెరికా స్వప్రయోజనాలకోసం ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం మామూలే, ఏదేశమైనా అదే చేస్తుంది. దానికి నిలబడి, మన ప్రయోజనాలను కాపాడుకునేందుకు భారత్‌లోని కరప్ట్ ప్రభుత్వం సిద్ధంగా వుందా?
అలాంటి ప్రభుత్వానికి మద్దతుగా ప్రణబ్ ముఖర్జీకి వైకాపతో సహా మద్దతిచ్చిన పార్టీల మాటేమిటి? ఎందుకు ఓ పాలసీ అంటూ లేక, కాంగ్రెస్ కటాక్షం కోసం వూగిసలాడుతున్నారు?
సిరియాలో ఫ్యూడల్ ప్రభువుపై పోరాడుతున్న విప్లవకారులకు వ్యతిరేకంగా ఎందుకు రష్యా, చైనాలు వోటేశాయి? అది మార్క్స్ సిద్ధాంతాలకు అనుగుణంగా వుందా? సిరియా ప్రభుత్వం విప్లవకారులపై టాంకులు, గ్రెనేడ్లు, రాకెట్లు లాంటి ఆయుధాలను ప్రయోగించడం ఏ మార్కిస్టు సూత్రాలకు అనుగుణంగా వుంది?