ఈగ చిత్రం విజయం తర్వాత తెలుగు చిత్ర రంగం శక్తి సామర్థ్యాల గురించి ముఖ్యంగా రాజమౌళి ప్రతిభా విశేషాల గురించి చాలానే చర్చ జరుగుతున్నది. నాని(కొద్దిసేపే),సమంత,సుదీప్(ప్రధానంగా)ల నటన, ఈగకు సంబంధించిన సాంకేతిక విన్యాసం ఇవన్నీ ఆ చిత్ర విజయానికి దోహదం చేశాయి. ఏ కథనైనా ఉద్విగ భరితంగా తీయడంలో రాజమౌళికి ఒక ప్రత్యేక నేర్పు వుంది. మగధీర ఘన విజయం గురించి ఎవరికి వారు చెప్పుకోవచ్చు గాని ఈగధీర విజయం పూర్తిగా ఆయన ఖాతాలోకి రావలసిందే. అయితే ఆయనను లేదా తెలుగు సినిమాను అంచనా కట్టడానికి ఈగ కొలబద్ద అవుతుందా? అంటే కాదనే చెప్పాలి. నా ఉద్దేశంలో మర్యాదరామన్న రూప కల్పన ఇంతకంటే అభినందనీయమైంది. అందులోనూ పెద్ద సామాజిక సమస్యలున్నాయని కాదు గాని తెలుగు చిత్రాల్లో అరుదుగా కనిపించే నేటివిటీని సృష్టించగలిగాడు అందులో.ఈగ ఏ దేశంలో ఏ భాషలో తీసినా పెద్ద తేడా ఏమీ వుండదు. పైగా ఇందులో ఈగకు సంబంధించిన సన్నివేశాలలో వైవిధ్యం చాలా తక్కువ. శంకర్ అపరిచితుడు తీసినపుడు నేను అతి పరిచితుడు అంటూ వర్ణించాను. ఏమంటే ఆధునికత, సనాతన విశ్వాసాల మధ్య నలిగిపోతూ అవినీతిపై వ్యతిరేకత, అభివృద్ధి గురించిన అస్పష్టత వున్న నేటి భారతీయుడికి శంకర్ నమూనా బాగా అమరింది. అదే శివాజి,రోబో చిత్రాల దగ్గరకు వచ్చేసరికి యాంత్రికత, పటాటోపం ప్రధానమైనాయి. రాజమౌళి ఆయన అభిమానులు కూడా ఈగ విజయానికి ఎంతగా సంతోషించినా దాని పరిమితులు కూడా గమనించడం అవసరం.
Thursday, July 26, 2012
ఈగ విజయం.... రాజమౌళి

Subscribe to:
Post Comments (Atom)
రాసినది కొద్దిగానైనా మీ విశ్లేషణ శైలిని పట్టిస్తోందిది.
ReplyDeleteశ్రీరమణ ఒక పేరడీ రాసారు.. వివిధ వృత్తుల, ప్రవృత్తుల వ్యక్తులు ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుంది అన్నది ఇతివృత్తం. పాత్రికేయులు, రచయితలు, వివిధ ప్రసిద్ధ వ్యక్తుల శైలిని పేరడించారాయన. బాగుంటుందది. మీ ఈ టపా చూసాక నాకు అది గుర్తుకొచ్చింది. :)
సార్, ధన్యవాదాలు. అయితే మీరు ఇదే నా సినిమా శైలి అనుకోకండి. పెద్దగా వుంటే చదివే ఓపిక జనాలకు వుండటం లేదని, నాకూ సమయం లేదని క్లుప్తంగా రాశాను. సినిమాలను సినిమాల తరహాలో రాసిన పోస్టులు కొన్ని ఈ బ్లాగులోనే వున్నాయి. చూడొచ్చు. వాటిపై విమర్శలూ జవాబులు కూడా ఆసక్తి కరంగానే వుంటాయి. ఇకపోతే.. శ్రీరమణ నాకు మంచి మిత్రుడు. హాస్య రచయితలు దేన్నయినా ప్యారడీ చేస్తారు.అందులో ఆయన మరీ.నాకు బాగా ఇష్టం. ఆ ప్యారడీ లక్షణం నాకూ వుంది .
Delete