ఆత్మబంధువు కెవిపి రామచంద్రరావు వైఎస్‌రాజశేఖర రెడ్డి డైరీని ఫోటోలను అధిష్టానం ఆశీస్సులతో ఆవిష్కరించడం ఒకటైతే దానిపై హైదరాబాదులో వ్యక్తమైన ప్రతిస్పందన మరొకటి. గతంలో గాంధీ భవన్‌లో వైఎస్ ఫోటో లేకపోవడంపై అసందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా కెవిపి తమ బంధాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు. దాంతో పాటే కాంగ్రెస్ నాయకులు వైఎస్‌ను కూడా ప్రచారానికి వాడుకుంటారన సందేశం అందించారు. ఢిల్లీ సభ దానికి కాస్త విస్తరణ. పైగా ఈ కాలంలో జగన్ పార్టీతో అధికార పక్షానికి కాస్త సఖ్యత పెరిగినట్టు కనిపిస్తుంది. అందుకు తగినట్టే విజయమ్మ రెండు పార్టీల విలీనం ప్రస్తావనకు స్పందించి తర్వాత సర్దుకున్నారు. ఇదంతా రాబోయే రాజకీయ పరిణామాల సూచిక కావచ్చు
ఈ సమయంలో చిరంజీవి విహెచ్ పోటీ సభకు హాజరవడమే విశేషం కాగా అక్కడ అధికార పార్టీ దురవస్థపై అస్త్రాలు సంధించడం మరింత విశేషం. గోడలు విచ్చిపోయిన పాలకపార్టీ తనకు అభద్రత కలిగిస్తోందని ఆయన అనడం నిజంగా అసాధారణం. ఇవన్నీ ఇప్పటి నాయకత్వాన్ని మార్చాలన్న సందేశానికి సంకేతాలు కావచ్చు. దీనిపై ఇతరులు ఏమంటారో ఇప్పుడు చూడాలి. మెగాస్టార్ ఈ మాత్రం మాట్లాడ్డం ఇప్పుడే గనక దీని ప్రకంపనలు తీవ్రంగానే వుండొచ్చు.
No comments:
Post a Comment