బిజెపి జాతీయ సమావేశాల్లో అద్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతిపై పోరాటం గురించి బ్రహ్మాండమైన ప్రసంగం దంచుతున్నా ఒక మహిళా స.హ కార్యకర్త దానికి తూట్లుపొడించిందని చెప్పాలి.ఎందుకంటే మహారాష్ట్రలో బయిటపడిన 70 వేల కోట్ల ఇరిగేషన్ కుంభకోణం(మన జలయజ్ఞం వంటిది)పై పోరాడటానికి ఆయన వెనుకాడాడని ఒక ఆరెస్సెస్ అనుయాయి కూతురైన అంజలీ దమానియా వెల్లడించడం బిజెపిని చాలా ఇరకాటంలో పెట్టింది. దీనిపై బిజెపి నేతలే మొదట దుమారం లేవనెత్తినా తర్వాత రాజీ పడుతున్నారని తెలిసి ఆమె ఆయనను ఆగష్టు 14న కలిసి మాట్లాడారు. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ అనే సంస్థకు చెందిన ఆమె సూచనలకు గడ్కరీ స్పందించకపోగా తనకు కూడా ఎన్‌సిపి నాయకులతో వ్యాపార సంబంధాలున్నాయని వెల్లడించారు.దీంతో హతాశురాలైన అంజలీ దమానియా ఆ రోజునే ఆయన వైఖరిని ఖండిస్తూ ఒక ఎస్‌ఎంఎస్ పంపించారు. దేశం దేశ సేవ అనే మీరు ఇలా ఎలా చేయగలరని ఆమె ప్రశ్నించారు.ఆరెస్సెస్ దేశభక్తి సందేశం ఏమై పోయిందని నిలదీశారు. ఇదంతా జరిగి చాలా కాలమైనా పట్టించుకోని గడ్కరి తమ జాతీయ సమావేశాల సంందర్భంలో బయిటకు రావడంపై మాత్రం చాలా ఆగ్రహించారు. అంతా బయిటపెట్టింది తమ వారైతే ఈమె అనవసరంగా ఆరోపణలు చేస్తున్నదంటూ పరువు నష్టం దావా వేస్తామని ప్రకటించారు బిజెపి నేతలు. చాలా కుంభకోణాలలో కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు ప్రముఖుల పేర్లు వినిపిస్తూనే వుంటాయి గాని అద్యక్షుని స్థాయిలో ఇది తీవ్రమైన అంశమే. గతంలో ఒక అద్యక్షుడు ముడుపులు తీసుకుని జైలుశిక్షకు గురయ్యారు గనక మామూలే అనుకంటే అది వేరే సంగతి!
Friday, September 28, 2012
నితిన్ గడ్కరీ నీతి బోధలకు మచ్చ

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment