చంద్రబాబు లేఖపై తొలుతగా కినుక వహించి తిరుగుబాటు స్వరం వినిపించిన తంబళ్లపల్లి ఎంఎల్‌ఎ ప్రవీణ్ కుమార్ రెడ్డి చర్య వూహించిందే. ఆయన మొదటి నుంచి రాష్ట్ర విభజనకు గట్టి వ్యతిరేకిగా వున్నారు. డిసెంబర్ 9 తర్వాత రాజీనామాలను సేకరించడంలోనూ ముఖ్యపాత్ర వహించారు.ఈ విషయంలో అవసరమైతే పార్టీని వదులుకోవడానికి కూడా వెనకాడబోనని తరచూ అంటుండే వారు. దానికి తగ్గట్టే లేఖ వచ్చిన వెనువెంటనే ధిక్కారానికి దిగారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు చంద్రబాబు లేఖ వల్ల తెలంగాణా ప్రాంతంలో విశ్వాసం కలిగించడానికి అక్కరకు రాదు గాని తక్కిన చోట్ల అసంతృప్తుల తిరుగుబాటుకు కారణం అయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా వున్నాయి. దానికి తోడు జగన్ పార్టీ ఈ విషయంలో ఎప్పటి నుంచో కాచుకుని కూచున్నది. ఆ పార్టీ కూడా స్పష్టమైన వైఖరి తీసుకోకపోయినా ఉప ఎన్నికల విజయాలు సామాజిక సమీకరణాలు కలసి వస్తున్నట్టు కనిపిస్తుంది. మరి కొంతమంది ఇలాగే వ్యవహరించే అవకాశం వుంది.
Thursday, September 27, 2012
ప్రవీణ్ కుమార్ తిరుగుబాటు వెనక...

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment